
Teja : చిత్రం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన తేజ గురించి మనందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే దర్శకుడిగా ఆయన సత్తాను చాటి.. ప్రేమ కథ చిత్రాలలో కొత్త సెన్సేషన్ ( Teja revealed some facts ) సృష్టించిన దర్శకుడు తేజ. కాలేజీ కుర్రాళ్లంతా ఈయన సినిమా అంటే పడి చచ్చేవారు. అలాగే తేజ సినిమాల్లో చిత్రం, నువ్వు నేను, జయం, నేనే రాజు నేనే మంత్రి సినిమాలను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. దగ్గుబాటి వారసుడు అభిరామ్ తో తేజ అహింస అనే సినిమాని దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అభిరామ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ.. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ప్రమోషన్ కోసం తేజ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే తేజని ఇంటర్వ్యూ చేసే ఎవరైనా కూడా.. ఒక హీరో గురించి ప్రశ్నించకుండా ఉండరు. అది ఎవరో కాదు, ఉదయ్ కిరణ్. చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసిన తేజ.. ఉదయ్ కిరణ్ తో ఎంత సన్నిహితంగా ( Teja revealed some facts ) ఉండేవాడో ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ నుంచి తేజ ని ప్రశ్నించగా.. తేజ కొన్ని ఆసక్తికరమైన మాటలను అన్నారు.. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారి వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తాను పరిచయం చేసిన ఉదయ్ కిరణ్ అంటే తేజకు చాలా ఇష్టం.
వాళ్ళిద్దరూ ఎంతో మంచి రిలేషన్ తో ఉండేవారని అందరూ అంటారు. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు తేజ సమాధానం చెబుతూ.. ఉదయ్ కిరణ్ చనిపోవడం మహా పాపం అని.. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం తనకి తెలుసని.. నేను చనిపోయే లోపు ఆ నిజం బయటికి చెప్పే చచ్చిపోతానని ( Teja revealed some facts ) ఆయన అన్నారు. ఉదయ్ కిరణ్ చావు వెనుక ఉన్న మిస్టరీ ఎప్పటికైనా తన చనిపోయేలోపు చెప్పే చనిపోతాను అని తేజ అన్నమాట సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంతకాలం ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనే ప్రశ్నలే తప్ప ఇదై ఉంటుందా? అదై ఉంటుందా? డిప్రెషన్ కారణమా? అనుకోవడమే తప్ప..
దాని వెనుక ఒక మిస్టరీ ఉందని.. ఆ మిస్టరీ గురించి ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి కూడా ఈ భూమి మీద ఉన్నాడని ఎన్నాళ్ళకు బయటికి వచ్చింది. అంతేకాకుండా ఇంటర్వ్యూలో తేజని మరో ప్రశ్న వేయగా.. ఉదయ్ కిరణ్ చావుకు కారణం అందరికీ తెలుసని.. కావాలని ఎవ్వరూ నోరు విప్పడం లేదని అన్నారు. అయితే తేజ ఎందుకు ఇంత ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు? అసలు ఉదయ్ కిరణ్ చావు వెనక ఉన్న మిస్టరీ ఏమిటో? ఎవరెవరికి ఈ సంగతి తెలుసు? తెలిసి నోరెత్తలేని స్థితిలో ఎందుకు ఉన్నారో? తెలిస్తే బాగున్ను అని నెటిజన్లు వాపోతున్నారు. ఇక ఉదయ్ కిరణ్ అభిమానులైతే వాళ్ల హీరో ఏదో మిస్టరీతో, బయటికి రాని సమస్యతో సతమతమయ్యే చనిపోయినందుకు ఎంతో బాధపడుతున్నారు.