Tarun : ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. పెళ్లి కాకుండానే హీరో తరుణ్ తండ్రి కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తరుణ్ పెళ్లి కాకుండా తండ్రి అవ్వడం ఏమిటి అంటూ అందరూ ( Tarun will become a father ) ఆశ్చర్యపోతున్నారు. తరుణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి మనందరికీ తెలిసిందే. అంతకుముందు కూడా చిన్న వయసు నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో నటించిన వాడే తరుణ్. రోజా రమణి కొడుగ్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకొని పలు సినిమాలు నటించడం జరిగింది.
ఇప్పటికీ తరుణ్ సినిమాలు అంటే అందరికీ చాలా ఇష్టమే. కాకపోతే అంత మంచి స్టార్టంలో నడుస్తూ కూడా సడన్‌గా సినిమా రంగం నుంచి దూరమైపోయాడు. మళ్ళీ రెండోసారి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. కానీ కంగారు పడకుండా జాగ్రత్తగా ఏ సినిమా, ఎలాంటి పాత్ర చేస్తే బాగుంటది అని చూస్తున్నాడు. తరుణ్ అంటే ( Tarun will become a father ) అప్పట్లో యూత్ కి చాలా ఇష్టమైన హీరో. అమ్మాయిలకైతే మరింత ఇష్టమైన హీరో. ఇక లవ్ బాయ్ గా లవ్ సినిమాల్లో నటిస్తే తరుణ్ ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అందరికి నమ్మకం. నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు ఇలా ఎన్నో మంచి మంచి సినిమాలు నటించి అందరినీ మెప్పించి అందరి హృదయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు తరుణ్.
కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. సినిమా రంగం నుంచి కనుమరుగైపోయాడు.దానికి కారణం కేవలం అతని ప్రేమ ఫలించకపోవడమే అని అభిమానులైతే అంటారు కానీ.. దాన్ని ఎప్పుడూ అఫీషియల్ గా అయితే నోటితో తరుణ్ చెప్పలేదు. కానీ మరి ఏం జరిగి ఉంటుందో తెలియదు గానీ.. మళ్లీ తరుణ్ సినిమా ( Tarun will become a father ) రంగంలో అడుగుపెట్టి నటిస్తే ఆదరించడానికి ప్రేక్షకులైతే సిద్ధంగా ఉన్నారని అనిపిస్తుంది. తరుణ్ పెళ్లి గురించి కూడా ఎప్పటికప్పుడు ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు తరుణ్ పెళ్లి కాకుండా తండ్రి కాబోతున్నాడు అనే వార్త వచ్చింది. కానీ ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో తరుణ్ ఒక ఆరేళ్ల పాపకి తండ్రిగా నటించబోతున్నాడంట.
పాన్ ఇండియా సినిమాలో ఒక స్టార్ హీరో పక్కన సెకండ్ హీరోగా తరుణ్ చేస్తున్నాడంట. ఆ సినిమాలో తరుణ్‌కి జోడిగా మీరాజాస్మిన్ నటిస్తుందట. వీళ్ళిద్దరికీ ఆరేళ్ల పాప ఉంటుందంట. అయితే తరుణ్ పెళ్లి కాకుండానే తండ్రి పాత్ర చేస్తున్నాడన్నమాట.. పెళ్లి కాకుండా తండ్రి అయిపోతున్నాడన్నమాట అని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ నిజంగా మళ్లీ తరుణ్ సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యి, అది కూడా పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోగా నటిస్తే సూపర్ గా ఉంటుందని కొందరు అంటుంటే, రీ ఎంట్రీ ఇస్తూ సెకండ్ హీరోగా చేయడమేంటి? మెయిన్ హీరోగా చిన్న సినిమా అయినా చేయొచ్చు కదా అని మరికొందనంటున్నారు. ఏదేమైనా అసలు ముందు తరుణ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టి, మళ్ళీ యాక్టివ్ అయితే అదే గొప్ప అని ఇంకొందరు అంటున్నారు. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజమందో, తరుణ్ ఆ పాన్ ఇండియా సినిమాలో తండ్రిగా నటిస్తున్నాడో లేదో తెలియాలంటే.. అఫీషియల్ గా వార్త వచ్చేవరకు కన్ఫర్మ్ అవ్వడానికి ఏమీ లేదు.