Taraka Ratna wife Alekhya Reddy emotional post in social media: నందమూరి తారకరత్న చనిపోయి నెలరోజులు అవుతున్నా, ఆ బాధ నుంచి ఇంకా నందమూరి అభిమానులు గాని, వాళ్ళ కుటుంబం గాని తేరుకోవడం లేదు. ఒక వంశం ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా, అందులో అందరూ అంత గొప్ప స్థాయికి వెళ్లలేరని, అందరికీ ఆ అదృష్టాన్ని అనుభవించే యోగం ఉండదని కొన్ని జీవితాలు చూస్తే అర్ధం అవుతుంది. తారకరత్న జీవితం కూడా చాల బాధాకరమైనది. నందమూరి వంశంలో వారసుడిగా పుట్టి కూడా అతని జీవితంలో సరైన సక్సెస్ ని అనుభవించలేకపోయాడు. సినిమా రంగంలో అడుగుపెట్టి.. పది సినిమాలకు ఒకే సారి సైన్ చేసి రికార్డ్ సృష్టించాడు గాని, అందులో అతనికి నిరాశే ఎదురయ్యింది. ఆ తరవాత అతను సినిమా రంగానికి దూరం అయ్యాడు. పోనీ రాజకీయాలలో తన అదృష్టాన్ని చెక్ చేసుకుందాం అనునకున్నాడు.
అది ఇంకా భయంకరమైన రిజల్ట్ ఇచ్చింది. మనిషినే లేకుండా చేసింది. ఒక మనషి డబ్బు , పేరు, ప్రతిష్ట ఇవన్నీ సంపాదించడం, సంపాదించకపోవకటం వాళ్ళ వాళ్ళ కృషి, అదృష్టం బట్టి ఉంటాది. కానీ కుటుంబ సభ్యుల, స్నేహితుల, రక్త సంబందీకుల ప్రేమను పొందటానికి కూడా అదృష్టం ఉంటేనే దొరుకుతాయని కొన్ని జీవితాలు చూస్తే అర్ధం అవుతుంది. తారకరత్న ప్రొఫిషన్ సక్సెస్ గురించి పక్కన పెడితే, అతని పర్సనల్ లైఫ్ లో కూడా చాలా కష్టాలను ఎదుర్కున్నాడు. తారకరత్న మనస్తత్వం చాలా మంచిదంట. అందరితో కలిసిమెలిసి ఉండే మనిషి అంట. ప్రేమ, ఆప్యాయతలు ఉన్న మనిషి. అలాంటి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. తారకరత్నది ప్రేమ వివాహం. తారకరత్న అలేఖ్య ల ప్రేమని పెద్దలు ఒప్పుకోలేదు.
తారకరత్న అలేఖ్య ను పెళ్లి చేసుకోవడం కోసం పెద్ద యుద్దమే చేసాడు. చివరికి సాధించాడు. ఇంతవరకే ఎవరికైనా తెలిసిన నిజం. కానీ తారకరత్న మరణం తరవాత అలేఖ్య సోషల్ మీడియాలో ( Taraka Ratna wife Alekhya Reddy emotional post in social media ఆమె బాధను షేర్ చేసుకుంటుంది. అక్కడ అసలు నిజాలు బయట పడ్డాయి. అలేఖ్య రీసెంట్ గా పెట్టిన పోస్ట్ లో.. నీజ్ఞాపకాలు నన్ను ఇప్పటికీ వదలటం లేదని, మన ప్రేమకి ఎవ్వరూ ఒప్పుకోకపోయినా నువ్వు నాకు ధైర్యం చెప్పి నా చెయ్యి వదలలేదు. మన వివాహంపై ఒక గందరగోళం.. మనపై వివక్ష అయినా నువ్వు నా చెంత ఉన్నందుకు ఎంతో సంతోషించాను. మనకొక పాప పుట్టాక మన జీవితంలో ఆనందం ఎక్కువ అయింది. అయినా కష్టాలు అలాగే ఉన్నా కూడా.. మన పై జనాలు ద్వేషాన్ని భరించలేక, మనం కళ్ళకు గంతలు కట్టుకుని బతికాము.
నువ్వు నీ కుటుంబానికి దూరమయ్యావు. మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలలు కనే వాడివి. ఆ కల 2019 లో కవలల పుట్టడంతో నిజమయింది. నీ చివరి శ్వాస వరకు ఎన్నో కష్టాలు పడ్డావు. నీ గుండెల్లో ఉన్న బాధ ఎవరికి అర్థం కాలేదు. దానిని ఎవరూ పట్టించుకోలేదు. అంటూ అలేఖ్య రాసిన పోస్ట్ చూసి నెటిజనులకి కన్నీళ్లు వస్తున్నాయి. తారకరత్నను సొంత మనుషులే ఇంత దారుణంగా టార్చర్ పెట్టారా అని నెటిజనులు షాక్ అవుతున్నారు.