Home Cinema Tamannaah: నటి తమన్నా లవ్ బ్రేక‌ప్.. కారణం అదే..

Tamannaah: నటి తమన్నా లవ్ బ్రేక‌ప్.. కారణం అదే..

tamannaah-love-breakup-who-broke-her-heart-twice

సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా(Tamannaah Breakup) పేరు కచ్చితంగా ఉంటుంది. పాలరాతి శిల్పం లాంటి అందంతో కుర్రకారులను పడగొట్టడమే కాదు, వాళ్ళని తన అద్భుతమైన నటనతో మైమరపించగలదు, తన డ్యాన్స్ తో థియేటర్స్ లో వాళ్ళ చేత విజిల్స్ కూడా వేయించగలదు. అందుకే ఎంతమంది కోత హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి ప్రతీ ఏడాది పుట్టుకొస్తున్నా ఈమె ఇమేజి చెక్కు చెదరడం లేదు, ఆఫర్స్ కూడా వాళ్ళతో సమానంగా దక్కించుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్ రేస్ లోనే కొనసాగుతుంది.

ఇదంతా పక్కన పెడితే తమన్నా గత కొంతకాలం నుండి ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ తో ప్రేమాయణం నడుపుతూన్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, ప్రస్తుతం తమన్నా ద్రుష్టి మొత్తం కెరీర్ మీదనే ఉందట. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే తమన్నా బాలీవుడ్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె తన బ్రేకప్(Tamannaah Breakup) లవ్ స్టోరీస్ గురించి తలచుకొని ఎమోషనల్ అయ్యింది. టీనేజ్ లైఫ్ లో ఉన్నప్పుడే తమన్నా ఒక అబ్బాయితో ప్రేమలో పడిందట.

See also  Ram Charan : ఆ స్టార్ హీరోయిన్ తో నైట్ కి నా రూమ్ కి వస్తే నీకు కావాల్సిన ఆ కోరిక తీర్చేస్తానన్న రామ్ చరణ్..

కానీ ఆ అబ్బాయి కోసం తనకి ఇష్టమైన వృత్తిని మానుకోవడం ఇష్టం లేక, అతని నుండి విడిపోయింది అట. ఈ సంఘటన తమన్నా ని చాలా బాధకు గురి చేసిందట. అలాగే తమన్నా రెండవసారి కూడా ప్రేమలో పడిందట, ఈసారి మాత్రం ఆమె తన బాయ్ ఫ్రెండ్ ప్రతీ చిన్నవిషయానికి అబద్దాలు చెప్తూ చిరాకు కలిగించేవాడట. అబద్దాలతో ఒక రిలేషన్ ని నడపడం అసాధ్యం, అందుకే అతనికి బ్రేకప్ చెప్పేసాను అని చెప్పుకొచ్చింది. దీనిని బట్టి చూస్తే తమన్నా జీవితంలో అత్యవసర పరిస్థితులు వస్తే తప్ప, ఇంకెప్పుడు అబద్దాలు చెప్పదు అనేది అర్థం అవుతుంది.

See also  Rajamouli: రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ ఏకైక సినిమాలో స్పెషల్ ఏమిటో తెలుసా?

ఇదంతా పక్కన పెడితే తమన్నా ప్రస్తుతం తన కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తుంది. ‘జైలర్’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని కొట్టి ఇండియా వైడ్ గా మారుమోగిపోయే డ్యాన్స్ నెంబర్ తో అదరగొట్టిన తమన్నా, ఈ ఏడాది విడుదలైన ‘బాక్’ చిత్రంతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత రీసెంట్ గా విడుదలైన ‘స్త్రీ 2 ‘ చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే, ఈ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ లో మెరిసింది.