Home Cinema Tamanna : మా ఇద్దరి మధ్య ఆ బంధం ఉందని తెగేసి చెప్పిన తమన్నా.. అతగాడెవరంటే..

Tamanna : మా ఇద్దరి మధ్య ఆ బంధం ఉందని తెగేసి చెప్పిన తమన్నా.. అతగాడెవరంటే..

Tamanna : హ్యాపీ డేస్ సినిమా నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ పలు ( Tamanna relationship with Vijay Varma ) భాషల్లో నటిస్తూ.. తన సినిమా కెరియర్ ని ఆగకుండా ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళుతున్న హీరోయిన్ తమన్నా. తెలుగులో అందరు స్టార్ హీరోలతో నటించి.. తనకంటూ ఒక ప్రత్యేక ముద్రనే వేసుకుంది తమన్నా. హ్యాపీడేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇలాంటి సినిమాల్లో తన నటనతో, తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. అక్కడ నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోలు సరసన తనకంటూ ఒక ప్రత్యేక విలువ ఉన్న ఎన్నో క్యారెక్టర్స్ ని అద్భుతంగా నటించి కెరియర్ను సాగిస్తూ వస్తుంది తమన్నా.

tamanna-declared-what-relationship-she-has-with-vijay-varma

సినిమా రంగంలో నటీనటులపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. అందులోనూ హీరోయిన్ పై మరీ ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్స్ ఎవరితోనైనా చనువుగా మాట్లాడిన.. ఎవరితో కలిసి ఎక్కడికి వెళ్ళినా.. ఏం చేస్తున్నా కూడా ఒక కన్ను అందరూ వేసే ఉంచుతారు. సినీ అభిమానులు దానిపై ఏదో ఒక రూమర్ ( Tamanna relationship with Vijay Varma ) సృష్టిస్తూనే ఉంటారు. ఇది వాళ్లకు ఒక ఆనందం హీరో హీరోయిన్లు పై ఏదో ఒక వార్త వాళ్ళకి ఇష్టాన్ని ఇస్తుంది. అందుకే రాసే వాళ్ళు. చూసే వాళ్ళు కూడా వాళ్ళ మీద అంత కాన్సన్ట్రేషన్ పెడతారు. అలాగే మిల్కీ బ్యూటీ తమన్న పై గత కొంతకాలంగా.. ఆమె విజయ వర్మ అనే వ్యక్తిని ప్రేమిస్తుందని ఎన్నో వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని.. వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చూసుకుంటారని ఎన్నో వార్తలు వచ్చాయి.

See also  Samantha : బయట పడ్డ భయంకర నిజం.. సమంత డ్రగ్స్ తీసుకుని..

tamanna-declared-what-relationship-she-has-with-vijay-varma

తమన్నా , విజయ్ వర్మలపై అనేక వార్తలు వస్తున్నప్పటికీ ఇద్దరు కూడా ఏ రియాక్షన్ ఇవ్వలేదు. కనీసం వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? వారి ప్రేమించుకుంటున్నారా లేదా ఏం జరుగుతుంది? అనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా నెటిజన్లు మాత్రం ఆగలేదు. వాళ్ళిద్దరూ ఎక్కడైనా తిరుగుతూ ( Tamanna relationship with Vijay Varma ) ఉన్నప్పుడు ఫోటోలు దొరికిన వాటిని సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే.. వాటిని వెంటనే షేర్లు చేస్తూ అనేక రకాలుగా కామెంట్లు చేస్తూ వాళ్ళ రిలేషన్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో మొట్టమొదటిసారిగా తమన్న స్పందించింది. తమన్నా విజయ్ వర్మల మధ్య ఉన్న రిలేషన్ గురించి తమన్నా స్పందించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

See also  Trisha Krishnan Latest: పాపం త్రిష.. అంత పెద్ద లోపం ఉన్నందు వల్ల ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదా..

tamanna-declared-what-relationship-she-has-with-vijay-varma

 

విజయ్ వర్మ అంటే తమన్నకు చాలా ఇష్టమని.. కేవలం అతను సహనటుడనే కారణంగా అతను అంటే ఇష్టం కాదని.. తను చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పింది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్ బంధం ఉందని చెప్పింది. విజయవర్మ తనకు రక్షణగా నిలబడతాడని నమ్మకం తనకే ఉందని చెప్పింది. తమన్న మనసుకు దగ్గరైన వ్యక్తి అని.. తనని అతను చాలా శ్రద్ధగా చూసుకుంటాడని.. అతను ఉన్నచోట ఇంక తమన్నా కు ఎటువంటి భయం ఉండదని.. నిస్సంకోచంగా చెప్పింది. అతను ఎక్కడ ఉంటే అక్కడ నాకు సంతోషమే తప్ప దుఃఖం ఉండదని ఎంతో ఆనందంగా చెప్పింది. దీనితో వాళ్ళిద్దరూ కచ్చితంగా ప్రేమించుకుంటున్నారని.. త్వరలో వీళ్లిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతారని అభిమానులు నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ వార్తను కూడా మనం వింటామని అనుకుంటున్నారు.