
Tamanna : మిల్క్ బ్యూటీ తమన్నా అంటే ఇష్టం లేనివాళ్లు అంటూ ఉండరెమో.. ఆమె సినిమా రంగంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా తన అందాన్ని ఎక్కడా చెక్కుచెదరనివ్వకుండా.. ఒకే రకంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. అందుకే టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరి సరసన ( Tamanna Charan Allu Arjun and Chaithu ) ఇంచుమించుగా నటించేసింది. ఈమె ఏ హీరో పక్కనైనా ఆ పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయి మంచి నేమ్ తెచ్చుకోగల సమర్ధురాలు. 100% లవ్ స్టోరీ లో నాగచైతన్య పక్కన మరదలుగా అద్భుతంగా సూట్ అయింది. అలాగే ప్రతి హీరో పక్కన కూడా ఆమె నటన ఆ హీరోతో అందంగా ఉంటుంది. తమన్నా ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా బిజీగా ఉంటుంది. లస్ట్ స్టోరీస్ అనే ఒక వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ నటించే క్రమంలో ఆమె బాలీవుడ్ నటుడు విజయవర్మతో ఆమె ప్రేమలో పడిందని, డేటింగ్ లో ఉందని అనేక రూమర్స్ కూడా రావడం జరిగింది. చివరికి విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్నానని తమన్నా ఒప్పుకుంది కూడా. ఈ వెబ్ సిరీస్లో తమన్నా చాలా బోల్డ్ గా నటిస్తున్న విషయం అందరికీ అర్థం అవుతుంది. లిప్ లాక్స్ తో సహా ( Tamanna Charan Allu Arjun and Chaithu ) ఇంకా రొమాంటిక్ సీన్స్ లో కూడా విపరీతంగా రెచ్చిపోతూ నటిస్తున్న సీన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు తమన్నా ఇంతగా ఇలా రెచ్చిపోతుందని అడిగిన వారికి.. అలా చేస్తే తప్పేముందంటూ గట్టిగా తిరిగి వార్నింగ్ కూడా ఇస్తుంది. ఇదే క్రమంలో ఈ సిరీస్ ప్రమోషన్ లో కూడా తమన్నా చాలా బిజీగా ఉంది. అయితే ఈ సీరియస్ ప్రమోషన్ ఇచ్చే క్రమంలో ఆమెకు కొన్ని ఇంటర్వ్యూల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఇంటర్వ్యూలు పాల్గొనేటప్పుడు కొన్ని ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె తన గురించి తాను మాట్లాడుకుంటూ.. ఇంకా టాలీవుడ్ స్టార్ హీరోలు ముగ్గురు గురించి మాట్లాడింది. ఆ ముగ్గురుని వాళ్ళ పెద్దవాళ్లు పెంచిన పెంపకం గురించి.. వాళ్ళ నేచర్ గురించి.. వాళ్ళలో ఉన్న గుణం ( Tamanna Charan Allu Arjun and Chaithu ) గురించి కొన్ని విషయాలు ఆవిడ చెప్పడంతో.. అది వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు హీరోలు ఎవరంటే.. రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య. తమన్న వీళ్ళ ముగ్గురితోని నటించడం జరిగింది. నాగచైతన్యతో 100% లవ్ స్టోరీ.. అల్లు అర్జున్ తో బద్రీనాథ్.. రామ్ చరణ్ తో రచ్చ..
తమన్నా ఇంటర్వ్యూలో హీరోల గురించి మాట్లాడుతూ.. ఈ స్టార్ హీరోలు ముగ్గురు కూడా సూపర్ స్టార్ల చేతుల్లో వాళ్ళ ఆలనా, పాలనతో చాలా బాగా పెరిగారని చెప్పింది. నేను నాగచైతన్య, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో కలిసి నటించాను. షూటింగ్ లొకేషన్లో వారు నాతో చాలా మర్యాదగా గౌరవంగా వ్యవహరించారని చెప్పింది. చాలా పద్ధతి ఉన్న హీరోలని.. వాళ్ళ పెంపకం చాలా బాగుందని చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత నేను బెస్ట్ హీరోయిన్ అవుతాను నేను చాలా పైకి వస్తానని చెప్పిన వ్యక్తి చిరంజీవి గారిని చెప్పింది. ఇలా ముగ్గురు స్టార్ హీరోలు పెంపకం చాలా మంచిదని, వాళ్ళ ముగ్గురిని చాలా బాగా పెంచారని, వాళ్ళ ముగ్గురు బిహేవియర్ చాలా మంచిదని.. తమన్నా ఇచ్చిన కామెంట్ కి.. ఆ ఆ హీరోల అభిమానులు తెగ వైరల్ చేస్తూ షేర్ చేస్తున్నారు.