Surekha Vani Daughter: టాలీవుడ్ లో ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో పేరు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఇటీవలే అవకాశాలు ఈమెకి తగ్గాయి కానీ సోషల్ మీడియా పరంగా మాత్రం ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ మనందరికీ టచ్ లో ఉంటుంది. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే.. వీళ్ళిద్దరూ కలిసి నిత్యం రీల్ చేస్తూ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో అందరికీ చేరువుగా ఉంటారు. ఇక వీళ్లిద్దరిని చూస్తే చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోతూ అక్క, చెల్లెల ఉన్నారు.. మీరు తల్లి బిడ్డలు అంటే ఎవరు నమ్ముతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఆశ్చర్య పోతుంటారు.
సుప్రీత (Surekha Vani Daughter) తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకొని ఇప్పుడిప్పుడే టీవీలలో కొన్ని షోలలో కూడా ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తుంది. ఇక సురేఖ వాణి తన కూతురిని ఎలాగైనా సరే స్టార్ హీరోయిన్స్ చూడాలని ఉద్దేశంతో అలా చేయడానికి పావులు కదుపుతుంది. ఇక ఇదే కాకుండా సుప్రీతా ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాని ఊపుతోంది. వీరిద్దరూ తల్లి బిడ్డల్లా కాకుండా అక్కాచెల్లెళ్ల మాదిరిగా పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్తుంటారు. ఇక నిత్యం అలా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇలా ఫోటోలు షేర్ చేసినవి వైరల్ గా మారుతూ ఉంటాయి. కొన్ని ట్రోల్స్ కు గురవుతూ విమర్శలు వస్తుంటాయి.
అలాంటి విమర్శలను సుప్రీత అసలు పట్టించుకోకుదు. ఇక ఇదిలా ఉంటే మన టాపిక్ విషయానికి వస్తే.. గతంలో సుప్రీత నా జీవితంలో సంబంధించిన కీలక ప్రకటన చేస్తానంటూ తెలిపింది. అదేంటంటే నేను ప్రేమలో ఉన్నానని అంటూ తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది సుప్రీత. నేను ఓకే చెప్పాను.. అంటూ అతగాడితో దిగిన ఫోటోలను నెట్టింట వదిలింది. అప్పట్లో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అతని విషయానికి వస్తే అతను సింగర్ అని తెలుస్తుంది. అతని పేరు రాఖీ జోర్డాన్ పలు రాప్ సాంగ్ లలో ఆల్బమ్స్ కూడా చేశాడు.
అంతేగాక ఎక్కువగా అమెరికాలో ఉంటాడు. ఇక ఆ తర్వాత సుప్రీత తన బాయ్ ఫ్రెండ్ గురించి ఎలాంటి ఫోటోలు షేర్ చేయలేదు. అంతేగాక ఎమోషనల్ స్టేటస్ లు పెట్టడం బ్రేకప్ స్టేటస్లు పెట్టడంతో బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిందా అనే సందిగ్ధంలో నెటిజెన్లు ఉన్నారు. ఇక ఇదే కాక రాఖీ జోర్డాన్ ఎప్పుడు కూడా సుప్రీత దిగిన ఫోటోలు కానీ వాళ్ల ప్రేమకు సంబంధించిన విషయాలు గానీ ఒక్కసారి కూడా షేర్ చేయలేదు. దాంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని ఉంటారని కొంతమంది ఆమె ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక మరి కొంతమంది వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ను సీక్రెట్ గా సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.