
Sumanth : అక్కినేని కుటుంబం నుంచి యంగ్ హీరోగా 1999లో ప్రేమ కథ చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు సుమంత్. మొదటి సినిమాతోనే సుమంత్ కొంతవరకు అక్కినేని అభిమానుల్ని ఆకట్టుకోగలిగాడు. ఆ తర్వాత ( Sumanth is doing that work ) ఎన్నో సినిమాలు చేశాడు. అయితే సుమంత్ స్టార్ హీరో కాలేకపోయాడు. కాకపోతే సుమంత్ కి కొన్ని పాత్రలు కొన్ని సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అందుకే సుమంత్ స్టార్ హీరో కాలేకపోయినప్పటికీ సుమంత్ కి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మాత్రం ఉంది.
గోదావరి సినిమా చూస్తే ఆ పాత్రకి సుమంత్ కరెక్ట్ గా సూట్ అయ్యాడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ సినిమా ఇప్పటికీ ఎవరు మర్చిపోయాలేకపోతున్నారు. కెరీర్ మొదలు పెట్టిన కొత్తల్లో సుమంత్ కొన్ని హిట్స్ ని కొట్టాడు. దానితో సుమంత్ బాగా సెటిల్ అవుతాడు. సినిమా రంగంలో అనుకున్న క్రమంలో కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతగా ( Sumanth is doing that work ) ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకి మరి ఎలాంటి సమస్యలు వచ్చాయో, ఏం జరిగిందో తెలియదు గానీ.. ఇద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. సుమంత్ కీర్తి రెడ్డి విడిపోవడం.. అక్కినేని అభిమానులకు అప్పట్లో అస్సలు నచ్చలేదు అయినా కూడా తప్పలేదు.
విడాకుల తర్వాత సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం ఏమిటో తెలియదు గానీ.. అలాగే ఉండిపోయాడు. కీర్తి రెడ్డి మాత్రం బెంగళూరుకు సంబంధించిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఆమె లైఫ్ లో చక్కగా సెటిల్ అయిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత సుమంత్ సినిమా రంగానికి కూడా కొంతకాలం ( Sumanth is doing that work ) దూరంగానే ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలియదు కానీ.. బహుశా తన బాధ నుంచి తాను బయటికి వచ్చేవరకు నిశ్శబ్దంగా ఉండిపోయాడేమో అనుకుంటారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో సుమంత్ మళ్లీ సినిమాల్లో ఎంటర్ అయ్యాడు.
ఆ తర్వాత ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో.. సుమంత్ ని మీ విడాకుల విషయం ఏమిటి? ఎందుకు విడిపోయారు? అని అడగ్గా.. మేమిద్దరం ఏదో అనుకుని పెళ్లి చేసుకున్నాం కానీ.. మా ఇద్దరికీ సెట్ అవ్వలేదు. అందుకే విడిపోయాం. విడిపోయినా కూడా ఇప్పటికీ నేను కీర్తి రెడ్డి, ఫోన్లో మాట్లాడుకుంటాం, చాటింగ్ చేసుకుంటాం, తన బర్త్డే గ్రీటింగ్స్ చెప్తాను. తను నా భార్యగా విడిపోయింది తప్ప ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం ఇప్పటికీ ఫోన్ లో టచ్ లో ఉంటాం అని చెప్పుకొచ్చాడు. అయితే విడాకులు తీసుకుని ఇన్నేళ్లయినా కూడా వీళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ గా.. ఇంత చనువుగా ఫోన్లో టచ్ లో ఉండడం అంటే.. నిజంగా గ్రేట్ అని కొందరు అనుకుంటుంటే.. సుమంత్ అంతా సాఫ్ట్ మైండ్ ఉన్నవాడు అని మరికొందరు అంటున్నారు.