Sudigali Sudheer – Anchor Rashmi : సుడిగాలి సుదీర్ బుల్లితెరపై తనకంటూ ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకుని ఆ తర్వాత వెండితెరలోకి కూడా వచ్చి బాగానే రాణిస్తున్నాడు. సినిమాల్లో గాలోడు అనే చిత్రంలో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకొని.. ఇంకా ఒకటి రెండు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. జబర్దస్త్ షో తో ( Sudigali Sudheer and Anchor Rashmi ) బుల్లితెరపై తాను ఒక మెగాస్టార్ ల ఒక వెలుగు వెలిగాడు సుదీర్. అయితే సుధీర్ కి యాంకర్ రష్మీ కి ఏదో ఉందని.. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని.. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక వీళ్లిద్దరూ పక్కా లవర్స్ అనే అందరికీ గట్టి నమ్మకం. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనేది ఎవరికి వాళ్లు అనుకోవడమే తప్ప..
సుడిగాలి సుధీర్ గానీ.. యాంకర్ రష్మి గాని ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నామని గాని, పెళ్లి చేసుకోబోతున్నామని గాని అఫీషియల్ గా చెప్పలేదు. అయితే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ గాని ఇంకేమీ గానీ లేదని.. మా ఇద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహం మాత్రమే అని సుడిగాలి సుదీర్, యాంకర్ రష్మీ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా ( Sudigali Sudheer and Anchor Rashmi ) కూడా వీళ్లిద్దరు మీద ఏదో ఒక పరమైన వార్తలు రాకుండా మాత్రం లేవు. ఇటీవల సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త రష్మీకి తెలియడం ఒక పెద్ద షాక్ అని.. ఇప్పుడు రష్మి ఎలా ఫీలవుతుందని అంటూ అనేక కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తూనే ఉండేవి.
అయితే కొన్ని రోజుల తర్వాత అలా గడిచిన తర్వాత ఎక్కడా కూడా సుదీర్ పెళ్లి గురించి టాపిక్ లేదు. సుదీర్ వాళ్ళ ఊర్లో ఒక అమ్మాయిని పెద్దవాళ్ళు నిశ్చయం చేసారని.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి బలం లేదని.. ఉంటే ఈపాటికి అఫీషియల్ గా సుదీర్ చెప్పునని అర్థం చేసుకొని ఆ వార్తలో నిజం లేదని అందరికీ అర్థమైంది. అయితే దీంతో రష్మికి కొంత ఊరట కలిగి ( Sudigali Sudheer and Anchor Rashmi ) ఉంటదని అందరూ అనుకుంటున్నారు. అయితే నెటిజనులు అనుకునేది ఏమిటంటే.. సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ ప్రేమించుకుంటున్నారా అంటే లేదని అంటారు కానీ.. వీళ్ళిద్దరూ పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవడం లేదు? వీళ్ళిద్దరూ ప్రేమించుకోకపోతే వీళ్ళిద్దరూ వేరే వాళళ్తో అయినాఎందుకు పెళ్లి చేసుకోకూడదు?
అలాగే సుదీర్ పెళ్లి చేసుకోవాల్సిన ఏజ్ వచ్చేసింది.. రష్మీకి కూడా మూడు పదులు వచ్చేసి ఇంతవరకు పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోయినా వీళ్లిద్దరు పెళ్లిళ్లు గురించి మాటలు కూడా మాట్లాడటం లేదు. అంటే నెటిజనులు అభిప్రాయం ప్రకారం.. వీళ్ళిద్దరూ వీళ్లిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉందని.. ప్రేమించుకుంటున్నారని.. కాకపోతే ఏవో కొన్ని కారణాల వలన వాళ్ళిద్దరూ కలవలేకపోతున్నారని.. అందుకే ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయి.. ఆ ఒంటరితనంలోనే ఒకరిని ఒకరు మనసులో ప్రేమించుకుంటూ అలా బ్రతికేస్తున్నారని అనుకుంటున్నారు. ఈ అభిప్రాయాలలో ఎంతవరకు నిజం ఉందో అనేది చెప్పలేంగానీ.. ఒకవేళ ప్రేమించుకుంటే వాళ్ళిద్దరూ తొందరగా కలవాలని.. అలాంటిదేమీ లేకపోతే వాళ్లకు వేరే వాళ్లతో అయినా పెళ్లిళ్లు చేసుకుని బాగుండాలని కోరుకోవడమే..