Megastar Chiru: మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే చిరంజీవి ఈ స్థాయికి రావడానికి మాత్రం మొదట్లో ఆయన చేసిన పడ్ కృషి కారణం చేతనే అలా ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర వదలకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో రకాల తిప్పలు పడ్డాడట. అలా మొదట్లో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా కొన్ని అవకాశాలు రాసాగాయి. వాటిని వదలకుండా ఎలాగైనా సరే దక్కించుకొని ఇండస్ట్రీలోని నిలదొక్కుకునే ప్రయత్నాలు ఎన్నో చేశారు.
అయితే ఆ సమయంలో పలువురు దర్శక, నిర్మాతలు చిరంజీవిలో ఉన్న హీరోయిజం చూసి అతనితో హీరోగా చిత్రాలు తీయడానికి అవకాశం కల్పించారు. అలా హీరోగా రాణిస్తున్న సమయంలో కొంత మంది బడా దర్శకులు చిరుతో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ గా మరియు గెస్ట్ పాత్రలలో తీసుకునేవారు. దాంతో ఆయనతో సినిమా తీసే దర్శకులు చిరంజీవిని నువ్వు ఇలా మిగిలిన హీరోల చిత్రాల్లో గెస్ట్ రోల్స్ లో, విలన్ క్యారెక్టర్లు చేస్తే మా చిత్రాలు ఎలా హిట్ అవుతాయి నాయనా.. నువ్వు కనుక ఇలాంటి పనులు చేస్తే మా చిత్రాలు ప్లాప్ అవడం ఖాయం అంటూ చెప్పేవారట.
అయితే సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోల చిత్రాలు తెరకెక్కించే దర్శకులు మాత్రం నువ్వు ఆ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తే మాత్రం కచ్చితంగా మా తదుపరి చిత్రానికి నిన్నే హీరోగా పెట్టి తీస్తామంటూ చిరుకి చెప్పేవారట. దాంతో అవకాశాల కోసం దేనినైనా వదలకుండా నటించే చిరు చేసేదేమీ లేక అలాంటి పెద్దదర్శకులతో సినిమాలు చేస్తే కచ్చితంగా నాకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే.. మరి అదే విధంగా తన తదుపరి చిత్రాల్లో హీరోగా అవకాశం వస్తుందని ఆశతోనే సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ స్టార్ హీరోల వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించేవాడట (Megastar Chiru) చిరు..
మరదే విధంగా తనతో చిత్రాలు తీసే దర్శకులకు ఏదోలా నచ్చచెప్పి పెద్ద డైరెక్టర్లు చేసే చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్రాలలో చేస్తూ అటు వాళ్లను కూడా లైన్ లో పెట్టే వాడట.. కానీ చివరికి ఆ బడ డైరెక్టర్లు మాత్రం చిరంజీవికి అవకాశాలు కల్పిస్తామంటూ వాడుకొని అవకాశాలు ఇయ్యకుండా మోసం చేశారట. ఇక ఈ విషయాన్ని చాలా రోజులు జీర్ణించుకోకుండా చిరంజీవి భరించాడు. కానీ ఎప్పుడైతే చిరు స్టార్ హీరోగా ఎదిగాడు అప్పటి నుంచి అప్పడా బడా డైరెక్టర్స్ సైతం ఈయనతో సినిమాలు తీయడానికి తెగ ఆరాటపడే వారు తెగ ఆసక్తి చూపేవారట.. అలా చిరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది చిరుని ఇలా వాడుకోవడంతో చాలామంది చేతిలో మోసపోయాడంట.