Subbaraju : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా పుష్ప తో అల్లు అర్జున్ స్థాయి ఎన్నో రెట్లు పెరిగింది. యావత్ భారతదేశం ( Subbaraju sensational comments about AlluArjun ) ఇప్పుడు అల్లు అర్జున్ వైపు చూస్తుంది. బాలీవుడ్ నుంచి కూడా అల్లు అర్జున్ కి పిలుపు వస్తుంది. ఇలాంటి తరుణంలో సుబ్బరాజు మాట్లాడిన కొన్ని మాటలు అల్లు అర్జున్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఒక నటుడు ఇంకొక నటుడు గురించి మాట్లాడేటప్పుడు.. వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది..
అవతల మనిషి మీద ఎంతటి అభిమానం ఉందో, ఎంత కోపం ఉందో ఎంత ఇష్టం ఉందో.. అలాగే సుబ్బరాజు మాటల్లో కూడా అల్లు అర్జున్ పై ఎలాంటి ఇష్టం, ఫీలింగ్ ఉందో ఆ మాటల్లోనే తెలుస్తుంది. సుబ్బరాజు అనేక ( Subbaraju sensational comments about AlluArjun ) సినిమాల్లో డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా, విలన్ గా ఇలా ఎన్నో పాత్రలలో కనిపించగా.. ప్రతి పాత్ర నటించేటప్పుడు అతని కోసమే ఆ పాత్ర రాశారు అన్నట్టుగా ఇమిడిపోతూ చక్కగా నటిస్తాడు. బాహుబలి లాంటి మొదటి పాన్ ఇండియా సినిమాలో సుబ్బరాజు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఒక పిరికివాడు ఆడవాళ్లను రక్షించే క్రమంలో ధైర్యాన్ని ఎలా పుంజుకుంటాడు? ఒక అమాయకుడు నుంచి ధైర్యం ఎలా వస్తాది? అనే పాత్రని అద్భుతంగా చేశాడు సుబ్బరాజు. బహుశా సుబ్బరాజ అంత బాగా చేయగలడని ( Subbaraju sensational comments about AlluArjun ) మన జక్కన్న గ్రహించబట్టే.. ఆ పాత్రలో అతన్ని తీసుకుని అంత అద్భుతంగా చిక్కాడు రాజమౌళి. అక్కడ నుంచి సుబ్బరాజుకి తెలుగు సినిమా రంగంలో ఇంకా ప్రాముఖ్యత పెరిగింది. ఇటీవల సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు మంచి సమాధానం చెప్పాడు. మీకు అపోజిషన్లో ఏ హీరో ఉంటే విలన్ గా చేయాలనుంది అని పోస్ట్ అడిగిన ప్రశ్నకు..
సుబ్బరాజు నాకు అల్లు అర్జున్ తో విలన్ గా చేయాలనుంది అని అన్నాడు సుబ్బరాజు. బన్నీతో బాగా ఫైట్ చేయాలనుంది.. బన్నీని కొట్టాలని ఉంది.. ఇంతవరకు నేను అల్లు అర్జున్ తో పూర్తి విలన్ గా నటించలేదు. దేశముదురులో నటించాను కానీ, నాకు ఫుల్ స్కోప్ దొరకలేదు. కాబట్టి అల్లు అర్జున్ కి విలన్ గా నటించే అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను అని సమాధానం ఇచ్చాడు సుబ్బరాజు. దీనితో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని సుబ్బరాజుకి కొట్టాలని ఉందంట అంటూ అనేక వార్తలు వచ్చాయి. అది చూసిన బన్నీ అభిమానులు తన హీరోకి విలన్ గా చేయాలని కోరుకుంటున్న సుబ్బరాజుకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. అతి తొందరలోనే సుబ్బరాజుకి వాళ్ళ హీరోకి విలన్ గా నటించే అవకాశం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.