నటుడు సుబ్బరాజు ఆంద్రప్రదేశ్ భీమరవంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు. సినిమాల్లో హీరో అవ్వాలని సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన సుబ్బరాజు, హీరో అవకాశాలు రాకపోయినా.. విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ ల పాత్రలతో బిజీ అయ్యాడు. అసలు ఒక నటుడు ఎలాంటి పాత్రలు వేస్తున్నాడనేది కంటే, ఏ పాత్రనైనా ఎలా పోషిస్తున్నాడు అనేదే ముఖ్యం. సుబ్బరాజు ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోస్తాడు.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అతనికి ప్రతీ సినిమాలో మంచి పేరు మాత్రం వస్తాది. దీనిని బట్టి మనకి అర్ధమవ్వాల్సింది ఏమిటంటే.. అతను హీరోలు కంటే తక్కువ నటుడు మాత్రం కాదు, అంతకు మించి అన్నట్టు తన పాత్రకి తాను న్యాయం చేసుకుంటూ వెళ్లిపోతుంటారడని. దాదాపు అందరి టాప్ హీరోలతో సుబ్బరాజు స్క్రీన్ పంచుకున్నారు. సుబ్బరాజును చూడటానికి వయసు ఎక్కువలా ఉండడు కానీ, అతని వయసు 50 దాటి ఉంటాది.
ఇటీవల సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అనేక ఆశక్తికర విషయాలు చెప్పారు. తనని చాలా మంది ప్రొడ్యూసర్ లు మోసం చేశారని, ఇస్తానన్న రెమ్యూనిరేషన్ చెక్స్ రూపంలో ఇస్తే, అవి డ్రా చేసుకుందామని వెళ్తే, బ్యాంకులో అమౌంట్ ఉండేది కాదని, అలాంటి చెక్స్ తన దగ్గర చాలా ఉన్నాయని ఆయన బాధ చెప్పుకుంటూ వచ్చారు. అయితే సుబ్బరాజు ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పారు.
తనకి ఇంతవరకు ఏ అమ్మాయి నచ్చక చేసుకోలేదంట. అలాగే ఇకముందు కూడా ఎవ్వరూ నచ్చరని చెప్పారు. పైగా పెళ్లంటే అవసరం కాదని, అదొక బాధ్యత అని.. తనకి బాధ్యత అంటే చాలా భయమని సుబ్బరాజు చెప్పారు. బాధ్యతకు భయపడి పెళ్లి మానేయడమేంటని నెటిజనులు అంటున్నారు.