SriDevi – Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తో సినిమా లో నటించాలంటే నాటి నుండి నేటి వరకు ఏ హీరోయిన్ అయినా చివరికి ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లు కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే ఎగిరి గంతేస్తారు. ఇక చిరంజీవి తో హీరోయిన్ గా పక్కన పెట్టేస్తే అసలు ఆయన పక్కన ఓ చిన్న పాత్ర లో ఐనా కనిపిస్తే చాలు అంటూ ఎందరో ఆర్టిస్టులు కలలు కంటుంటారు. ఆయన క్రేజ్ ఇప్పటి నుంచి కాదు ఎప్పుడైతే ఇండస్ట్రీ లో అడుగు పెట్ట స్టార్ గా ఎదిగినప్పటినుంచి హీరోయిన్స్ కి సపోర్టింగ్ రోజ్ చేసే వారికి ఆయనతో నటించాలని ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. కానీ అప్పట్లో అందాల తార శ్రీదేవి మాత్రం చిరంజీవి ని అస్సలు లెక్క చేయక పోయేదట అందరి లాగే ఆయన్ను కూడా ట్రీట్ చేసేదట.
ఆ కారణం తోనే చాలా సినిమాల్లో చిరంజీవి తో కలిసి నటించే అవకాశం దక్కినప్పటికీ ఎన్నో రకాల కండిషన్లు పెడుతూ డేట్స్ ఖాళీ లేవంటూ ఏవేవో కారణాలు చెప్పి ఆ సినిమాని రిజెక్ట్ చేసేదట. ఇక జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం అవకాశం వచ్చిన సమయంలో కూడా టైటిల్ లో అతిలోక సుందరి అనే పేరు పెట్టాలి అలా అయితేనే నేను సినిమాలో నాకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది లేకపోతే నేను ఈ సినిమాలలో నటించాను అంటూ రకరకాల కండిషన్లు పెట్టడంతో డైరెక్టర్ ఆమె చెప్పినట్టుగానే ఒప్పుకుని ఆ సినిమాలో నటించినదట..
ఇక ఈ చిత్రం కోదండ రామి రెడ్డి గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రొడ్యూసర్ గా శ్రీ దేవి చేసిన వజ్రాల దొంగ సినిమా ఆదిలోనే ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాకి నిర్మాతగా శ్రీ దేవి బాధ్యతలు తీసుకుందట. అలాగే ఈ సినిమా విషయంలో కోదండ రామి రెడ్డిని శ్రీదేవి తరచూ విసిగిస్తూ సినిమాలలో హీరో కంటే హీరోయిన్ ఎక్కువ చేసి చూపించాలని పదే పదే అడిగేదట. కానీ డైరెక్టర్ మాత్రం కొన్ని విషయాల్లో హీరోయిన్ ఎక్కువ చేసి చూపినప్పటికీ అన్ని విషయాలు అలా చేయడం అయితే కుదరని పని అదే కాకుండా చిరంజీవి (SriDevi – Chiranjeevi) కూడా శ్రీదేవి పెట్టే కండిషన్ లు నచ్చలేదట.
దాంతో వజ్రాల దొంగ సినిమా రెండు పాటలు చిత్రీకరణ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరికి నచ్చక అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఈ సినిమాకి అప్పటికే శ్రీ దేవి ప్రొడ్యూసర్ గా ఉండడంతో రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టిందట. ఇక అప్పట్లో రెండు కోట్ల ధనం అంటే మామూలు విషయం కాదు. దాంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో శ్రీ దేవికి రెండు కోట్ల నష్టం వచ్చింది అలా శ్రీదేవి మెగాస్టార్ చిరంజీవి లెక్క చేయనందుకు చివరికి ఆమె తీసుకున్న గోతిలో ఆమె పడి రెండు కోట్ల వరకు నష్టం తెచ్చుకుందంటూ చిరంజీవి అభిమానులు ఆమె ఇలా జరిగింది బాగా అయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు రాశారు.