Home Cinema Janhvi Kapoor: తరచూ తిరుపతికి శ్రీ దేవి కూతురు జాన్వి కపూర్ ఎందుకు వెళుతుందో అసలైన...

Janhvi Kapoor: తరచూ తిరుపతికి శ్రీ దేవి కూతురు జాన్వి కపూర్ ఎందుకు వెళుతుందో అసలైన కారణం తెలుసా.?

Sridevi Daughter Janhvi Kapoor: దివంగత తార అతిలోక సుందరి శ్రీ దేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఆమె నటించిన పలు చిత్రాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆమెకు మాత్రం గుర్తింపు దక్కలేదు. కానీ ఇటీవల కాలంలో ఆమె నటించిన బావాల్ చిత్రం హిట్ అవడంతో ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో ఈమెకు బాలీవుడ్లో మంచి పేరు తీసుకువచ్చింది. అయితే ఎప్పటి నుంచో టాలీవుడ్ లో నటించాలని కోరిక ఉంది. పైగా అది ఆమె తల్లి కోరిక. ఇదే కాకుండా తెలుగులో నటించడం అంటే ఆమెకి ఎప్పటి నుంచో కోరిక ఉంది. కానీ మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సరసన మాత్రమే నటించాలని తన తల్లి గారి కోరిక మేరకు ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ..

See also  Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గుట్టు రట్టు.. హీరోయిన్ రష్మీకతో అక్కడ దొరికిపోయాడు..

sridevi-daughter-janhvi-kapoor-is-frequently-visiting-tirupathi-temple-for-this-reason

వదులుకొని ఎన్టీఆర్ తో అవకాశం రావాలనే ఎదురుచూసి మరి ఎన్టీఆర్ తో దేవర చిత్రం లో ప్రస్తుతం నటిస్తుంది. ఇక ఆమె ఇన్ని రోజులు ఎదురు చూసి మరి ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో హీరోయిన్ గా జాహ్నవి కపూర్ అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఈ చిత్రం నుండి ఇప్పటికే జాన్వీ కపూర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల అయింది. కానీ ఈ విషయాన్ని అంతా కాస్త పక్కన పెట్టి అసలు మన టాపిక్ విషయంలోకి.. వెళ్లి ప్రతి మూడు నెలలకి ఒక సారి జాన్వి కపూర్ (Sridevi Daughter Janhvi Kapoor) కచ్చితంగా తిరుపతి దేవస్థానంలో కనిపిస్తుంది. అసలు సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వెళ్లడానికి గల కారణం ఏంటి అని ప్రస్తుతం నెట్టింటే వార్తలు అయితే వైరల్ అవుతుంది.

See also  Rashmi: ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేసిన రష్మీ.. మల్లెమాల చరిత్ర తిరగరాసింది.?

sridevi-daughter-janhvi-kapoor-is-frequently-visiting-tirupathi-temple-for-this-reason

ఇక జాన్వి కపూర్ ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు మూడు నాలుగు సార్లు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి జాన్వీ కపూర్ వెళ్లినట్లు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. ఇక తరచూ తిరుపతి వెళుతుండడంతో జాన్వి కపూర్ అసలు తిరుపతి ఎందుకు వెళ్తుంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జాన్వి అభిమానులే  కాకుండా నేటిజన్స్ సైతం అసలు విషయం ఏంటి అనేది ఆరా తీయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే శ్రీ దేవి కి చాలా ఇష్టమట.. ఇదే కాక తను ఏదైనా పనిని తలపెట్ట దలుచుకున్నప్పుడు కచ్చితంగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ విషయం గురించి ముందుగా ఆయనకు చెప్పిన తర్వాతనే ఆ పనిని మొదలుపెడుతుందట.

See also  Yamuna: వ్యభిచార కేసు పై ఎట్టకేలకు నోరు విప్పిన యమున..

sridevi-daughter-janhvi-kapoor-is-frequently-visiting-tirupathi-temple-for-this-reason

ఇక ఇదే విషయం శ్రీ దేవి బతికున్న సమయంలో జాన్వి కపూర్ కి ఎన్నో సార్లు చెప్పసాగింది. అలా తల్లికి మంచి జరిగింది కాబట్టే.. తల్లి చెప్పిన మాటలను వింటూ తల్లి బాటలోనే పయనం అవుతూ కూడా తను ఏదైనా కొత్తగా తలపెట్టదలుచుకుంటే మొదటగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ విషయాన్ని విన్నపించిన తర్వాతే తనకు సంబంధించిన ఏ విషయమైనా ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామికి చెప్పుకోవడానికి వెళుతుందట. అలా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కూడా జాన్వీ కపూర్ తిరుపతికి వెళుతుందని మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆమె తిరుపతికి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలాసార్లు విపరీతంగా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే..