Sridevi: ఏ బంధం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమంటారు. అన్నిటికంటే ముఖ్యంగా రక్తసంబంధం చనిపోయే వరకు తోడు ఉంటుందంటారు. కానీ కలికాలంలో ఆ బంధం కూడా కల్తీ అయిపోతుంది. డబ్బు కోసం వెంపర్లాడే ( Sridevi and her sister Sreelatha ) ఈ సమాజంలో బంధాలు అనేవి బలయిపోతున్నాయి. అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆమె అంటే యావత్ భారత దేశంలో సినీ అభిమానులందరికీ కూడా ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఆమె రూపురేఖల్ని అందచందాలని ఎవరు కూడా మరిచిపోలేరు.
శ్రీదేవి జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు ఇప్పటికే చాలామందికి తెలుసు. ఆమె కెరీర్ ఎలా మొదలు పెట్టింది, ఏ సినిమా నుంచి మొదలు పెట్టింది, ఎన్ని సినిమాలు చేసింది అనేది కూడా ఇంచుమించుగా తెలిసినదే. 300 సినిమాలు పైగా నటించిన శ్రీదేవి పదహారేళ్ళ వయసుతో హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. చిన్నప్పటినుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా ( Sridevi and her sister Sreelatha ) సినిమాల్లో నటిస్తూ ఎంతో అద్భుతమైన మంచి పేరు తెచ్చుకుంది. ఏ వయసులో కూడా శ్రీదేవి అబ్బా ఏం చూస్తాంలే అనే నిరుత్సాహాన్ని కలిగించేలా సినిమాల్లో ఎప్పుడూ కనిపించలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది.. హీరోయిన్గా అదరగొట్టింది.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మళ్లీ వచ్చి కుర్ర హీరోలతో నాగార్జున, వెంకటేశు ఇలాంటి వాళ్లతో కూడా నటించి మెప్పించింది.
మళ్లీ మరోసారి లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేసి కూడా అద్భుతంగా అందరిని మెప్పించింది. అదే శ్రీదేవిలో ఉన్న గొప్పతనం. అలాంటి శ్రీదేవి జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. రాజేశ్వరి – అయ్యప్పన్ దంపతులకు తమిళనాడులోని మీనంపట్టి గ్రామంలో శ్రీదేవి జన్మించింది. శ్రీదేవి తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు. అందులో ( Sridevi and her sister Sreelatha ) పెద్దది శ్రీదేవి రెండో అమ్మాయి శ్రీ లత. ఈమె ఎప్పుడు శ్రీదేవితోనే షూటింగ్స్ లో ఉంటూ ఉండేది. అక్కంటే ప్రాణంగా ఎంతో అన్యోన్యంగా ఉండే శ్రీలత కాలం గడిచే కొద్ది వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.
శ్రీదేవి తల్లి మరణించడానికి ముందు ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తప్పుగా చేయడం వలన ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయి చనిపోయింది. ఆ తర్వాత ఆ హాస్పటల్ మీద కేసు వేసిన శ్రీదేవికి కొంత డబ్బు కూడా వచ్చింది. అయితే శ్రీలత ఆ డబ్బు మొత్తం, అలాగే వాళ్ళ అమ్మ ఆస్తి మొత్తం జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల శ్రీదేవి తీసుకుందని.. తనకి ( Sridevi and her sister Sreelatha ) డబ్బు వస్తుందని కోర్టులో కేసు వేసింది. ఆ కేసు గెలిచి అప్పట్లో రెండు కోట్ల రూపాయలు కూడా తీసుకుందని వార్తలు వచ్చాయి. ఇలా డబ్బు కోసం వైరం తెచ్చుకున్న వీళ్లిద్దరూ అక్కడ నుంచి కలుసుకోలేకపోయారు. చివరికి శ్రీదేవి చనిపోయినప్పుడు కూడా ఆమె రాలేదని అనేక వార్తలు వచ్చాయి. ఇలా సెలబ్రిటీస్ జీవితాల్లో కూడా డబ్బు కోసం ఇలాంటి జరుగుతాయని తెలిసి నేటిజనులు ఆశ్చర్యపోతున్నారు.