Home Cinema Sri Reddy – Nara Brahmani: నారా బ్రాహ్మణి పై శ్రీ రెడ్డి చేసిన అనుచిత...

Sri Reddy – Nara Brahmani: నారా బ్రాహ్మణి పై శ్రీ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలు వైరల్ – భగ్గుమంటున్న టిడీపి అభిమానులు.

Sri Reddys Comments: ఇండస్ట్రీ లోకి హీరోయిన్ అవుదామని అడుగుపెట్టిన శ్రీరెడ్డి ఆ తర్వాత ఆమె చేసిన పనులకు గాను చిత్ర పరిశ్రమ ఆమెను బహిష్కరించడంతో సోషల్ మీడియా ద్వారా ఆమె జరిగిన అన్యాయం గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం గురించి గెలుకుతూనే ఉంటుంది శ్రీ రెడ్డి అలా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అవతలి వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఆమె మాటలకి హద్దు అదుపు ఉండదు. ఇక ఇటీవలే తాజాగా నారా బ్రాహ్మణి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అసలు విషయంలోకి వెళ్తే ఏం జరిగింది అనే దాని గురించి చర్చిద్దాం. అయితే టిడిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఇక ఇదే క్రమంలో నారావారి కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు మరియు అభిమానులు సైతం చంద్రబాబు అరెస్ట్ ని తీవ్రంగా ఖండించడం మొదలుపెట్టి ధర్నాలు సైతం చేస్తున్నారు.

See also  Trisha : త్రిషకి పుట్టిన కొడుకంటూ సాక్షాలతో వైరల్ అవుతున్న వార్త..

sri-reddys-inappropriate-comments-on-nara-brahmani-go-viral-tdp-fans-are-outraged-1

ఇలాంటి క్రమంలోనే నారా బ్రాహ్మణి చంద్రబాబు అరెస్ట్ విషయంపై మాట్లాడుతూ ఎలాంటి ప్రూఫ్ అనేది చూపించకుండా కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారంటూ ఆరోపించాడు. ఇక చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఎన్నో పథకాల ద్వారా ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రం యొక్క పౌరులు లబ్ది కోరారు అనే దానిలో నేను కూడా ఒకరిని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ వెల్లడించింది. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో లోకేష్ ఢిల్లీ వెళ్ళగా నేను రాజమండ్రి, విజయవాడ మధ్యలో తిరుగుతున్నాను. ఎప్పుడు బయటికి రాని మా అత్తమ్మ కూడా ఈ రోజు బయటికి వచ్చేలా చేశారు. నా ఎనిమిది ఏళ్ల కుమారుడు దేవాన్ష్ ఒంటరిగా స్కూలుకు వెళ్తున్నాడు. ఇలా కుటుంబం మొత్తాన్ని బాధపెడుతున్నారంటూ బ్రాహ్మణి మాట్లాడారు.

See also  Roshan Kanakala : ఆ పని చేస్తూ పోలీసులకు దొరికిపోయిన సుమ కొడుకు రోషన్ కనకాల..

Sri Reddys Comments

బ్రాహ్మిని మాటలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే శ్రీ రెడ్డి ఆమెపై విరుచుకుపడింది దేవాన్ష్ ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావు దేవాన్ష్ కు తాత అవసరం లేకపోవచ్చు కానీ ఒకానొక సమయంలో జగనన్న అరెస్టు అయినప్పుడు ఆయన ఇద్దరు ఆడ పిల్లలకు తండ్రి మరి ఆడ పిల్లల పరిస్థితి ఏంటి అని నువ్వు ఆ రోజు ఆలోచించలేదా అంటూ సూటిగా ప్రశ్నించింది శ్రీ రెడ్డి. ఎప్పుడూ బయటికి రాని మా అత్త బయటకు వచ్చిందని చెప్తున్నావు మీడియా అంటే ఏంటో కూడా తెలియని విజయమ్మ ఆ రోజు కొడుకు కోసం రోడ్డు పైకి రాలేదా ఆరోజు నువ్వేం చేసావ్ అంటూ ప్రశ్నించింది

See also  Mahesh Babu : మహేష్ బాబు సూపర్ స్టార్ అయినా కూడా ఆ హ్యాబిట్ వదలలేకపోవడంతో చివరికి నమ్రత ఎం చేసిందంటే..

sri-reddys-inappropriate-comments-on-nara-brahmani-go-viral-tdp-fans-are-outraged-2

ఆనాడు భర్తని పోగొట్టుకొని ఒకరు భర్త చెరసాలలో వేయడంతో మరొకరు తండ్రిని జైల్లో పెడితే ఆడపిల్లలు అందరూ ఇలా నడిరోడ్డుపై కూర్చుంటే పోలీసుల చేత వారిని పక్కకు లాగిన్చారే కానీ అప్పుడు ఎందుకు.. స్కామ్ లో భాగంగా పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయి రాజమండ్రి జైలుకు వెళ్లిన చంద్రబాబు గురించి ఇంతలా బాధపడుతున్నావే ఆరోజు అవినీతి చేసినప్పుడు ఇలా చేయడం తప్పు మావయ్య అని నువ్వు ఒక మాట ఎందుకు అడగలేకపోయావు అంటూ శ్రీరెడ్డి ( Sri Reddys Comments) బ్రాహ్మణి పై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్క తెలుగుదేశం సభ్యుడు శ్రీరెడ్డిని విమర్శిస్తున్నారు సభ్యులు శ్రీరెడ్డిని విమర్శిస్తున్నారు.