Sri Reddy – Jr NTR : శ్రీ రెడ్డి సినిమా రంగంలో నిలబడలేకపోయినా.. సినీ అభిమానులందరికీ మాత్రం ఆవిడ సుపరిచితమే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందరికీ దగ్గరలో ఉంటుంది. ఇవాళ రేపు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసి.. అందులో ఆమె వీడియోలు అప్లోడ్ చేస్తుంది. శ్రీరెడ్డి కొందరి మీద చాలా ఘాటుగా పోస్టులు పెట్టడం చేస్తుంది. ఆమె పోస్ట్ ( Sri Reddy comments on Jr NTR ) అనగానే అందరిలోనూ ఒక రకమైన క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. ఎంత పెద్ద సెలబ్రిటీ నైనా.. ఏమీ కాకుండా మాటలు అంటుంది. అందులో ఎన్ని నిజాలు ఉంటాయి, ఎన్ని నిజాలు ఉండవు అనేది పక్కన పెడితే.. ఆమె ధైర్యంగా అనడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు.
ఈమధ్య ఆమె పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా అనేక పోస్టులు పెట్టడం కూడా జరుగుతుంది. ఆమె జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులైతే ఆనందంతో పొంగిపోతున్నారు. శ్రీరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ గురించి పోస్ట్ ఏమని పెట్టిందంటే.. ఇంకో 250 రోజుల్లో ( Sri Reddy comments on Jr NTR ) బాక్సాఫీస్ ని భయపెట్టడానికి వస్తున్నారు. భయం అంటే తెలియని మృగాలను భయపెట్టడానికి వస్తున్నాడు. జై ఎన్టీఆర్ అంటూ ఆమె పొగడ్తలు వర్షం కురిపించింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. నెటిజనులైతే శ్రీరెడ్డి ఎన్టీఆర్ పై ఇంత ప్రేమని ఎందుకు కురిపిస్తుందని వాపోతున్నారు.
ఇంకా ఈ పోస్ట్ పై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బ్రో సినిమా హాల్స్ లో ఆడుతూ ఉంటే.. దాని గురించి ఎటువంటి కామెంట్ ఇవ్వకుండా.. ఎప్పుడో ఇంకా చాలా రోజుల తర్వాత రాబోయే దేవర సినిమా గురించి.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంది శ్రీరెడ్డి.. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ అంటే ( Sri Reddy comments on Jr NTR ) ఆమెకు ఎంత నచ్చదు.. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది అని కామెంట్ పెడుతున్నారు. మరోపక్క శ్రీరెడ్డి బ్రో సినిమా గురించి ఎక్కువ కామెంట్ చేయకుండా ఉంటేనే మంచిది అని అనుకుంటున్నారు. కామెంట్ అంటూ మొదలుపెడితే చాలా నెగటివ్ కామెంట్స్ కావాలని చేస్తాది అని ఇంకొందరు అంటున్నారు. ఇలా శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ పై అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని గ్లోబల్ లెవెల్ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం గర్వించదగ్గ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు మూడు ప్రాజెక్టుల్లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్.. దేవర సినిమాతో, రామ్ చరణ్.. గేమ్ చేంజర్ తో, రాజమౌళి.. మహేష్ బాబు తో సినిమాకి ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఆ క్రమంలోనే శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.