Udayanidhi Stalin: అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా అతను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారిపై నిత్యం ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. తనకు నచ్చిన మంచి వారిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో తన పేరు హాట్ టాపిక్ గా మారేలా చూసుకుంటూ ఉంటుంది శ్రీ రెడ్డి. అయితే తను ఇలా కావడానికి అసలు సిసలైన కారణం.. తనకి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎందరో సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తనని వాళ్ళ అవసరాల కొద్ది వాడుకున్నారని దాంతో ఒంటి పై నూలు పోగు లేకుండా బహిరంగంగా నిరాహార దీక్ష చేయడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీ రెడ్డి ని పూర్తిగా బహిష్కరించింది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా తనపై జరిగిన అన్యాయం గురించి గళం విప్పుతూ పోరాడుతుంది.
ఇక తను చెప్పేది నిజమో లేక అబద్ధమో వాటిని ఖండించే సాహసం అయితే ఎవరు ఇప్పటి వరకు తీసుకోలేరు. పైగా ఆమె పై ఏ ఒక్కరు కూడా యాక్షన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించలేరు. అయితే శ్రీ రెడ్డి మాత్రం అందులో నిజం లేకుండా ఇలాంటి విషయాలను అస్సలు ప్రస్తావించదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. ఇక సినిమా రంగంలోనే బడా ఫ్యామిలీ లైన దగ్గుపాటి ఫ్యామిలీ.. మరియు మెగా ఫ్యామిలీ.. ఇక నందమూరి ఫ్యామిలీ లపై విరుచుకుపడిన సంగతి మనం చూసే ఉన్నాము. కానీ నందమూరి ఫ్యామిలీలో ఉన్న తారక్ గురించి మాత్రం మెచ్చుకుంటూ.. మిగిలిన వారిని తెగ తిట్టి ఆడేస్తుంటుంది పడేస్తుంది. ఇక మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్లందరిని తిడుతూ..
అల్లు అర్జున్ ను మెచ్చుకుంటుంది. కాగా గతంలో సీఎం కొడుకు ఉదయినిది స్టాలిన్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి గట్టింట పెద్ద దుమారమే లేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఉదయనిది స్టాలిన్ హిందూ సనాతన ధర్మంపై పలు వ్యాఖ్యలు చేసి హిందువులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు. దాంతో దేశ వ్యాప్తంగా ఉదయనిది స్టాలిన్ పై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. హిందూ ధర్మం ను మలేరియా, డెంగ్యూ, కరోనా లాగా అంతం చేయాలని మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టడమే కాకుండా.. ఉదయనిది స్టాలిన్ తల నరికి తెచ్చి ఇచ్చిన వారికి పది కోట్ల రూపాయల కూడా రివార్డు ఇస్తున్నట్లు పలువురు స్వామీజీలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి తరుణంలో తాజాగా ఆయన పై గతంలో శ్రీరెడ్డి చేసిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఇంటర్వ్యూలో భాగంగా శ్రీ రెడ్డి పాల్గొని సీఎం కుమారుడు ఉదయనిధి (Udayanidhi Stalin) గురించి పలు రకాల వ్యాఖ్యలు చేసింది. తనకు సినిమాలలో అవకాశాలు కనిపిస్తానని చెప్పి కల్పిస్తానని చెప్పి నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడంటూ ఆమె తెలిపింది. ఆ రోజు హోటల్లో ఉదయినిధి నాతో గడిపిన మెమోరీస్ ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేడంటూ వెల్లడించింది. ఆ రాత్రులు ఆయనకి మధురమైన క్షణాలేనని ఆ తీపి గుర్తు ఏనాటికి మర్చిపోలేడు అన్ని విధాలుగా నన్ను అనుభవించాడు అంటూ చెప్పుకొచ్చింది. కానీ నా కోరిక తీరాక నాకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా ఇప్పించలేదంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక అప్పుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పలువురు ట్రోల్ చేయడంతో వైరల్ గా మారుతున్నాయి.