Sreeleela : ఒక్కొక్కరు సినిమా రంగంలో అడుగుపెట్టిన వేళా విశేషం వాళ్లకు చాలా బాగా కుదురుతుంది. అడుగుపెట్టిన దగ్గర్నుంచి సక్సెస్ ని అందుకొని.. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలుగుతారు. అలాంటి నటీనటుల్లో శ్రీలీల ఒకర్తి. శ్రీలీల టాలీవుడ్లో ఎంటర్ అయ్యి.. తనకంటూ ఒక క్రేజ్ ని చాలా ( Sreeleela is in love married hero ) తొందరగా క్రియేట్ చేసుకుంది. అంతేకాకుండా ఎన్నో ప్రాజెక్ట్స్ తన చేతిలో పెట్టుకొని.. అది కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద స్టార్ హీరోలు సరసన అవకాశాలతో ముందుకు దూసుకుని పోతుంది. ఇప్పటికే శ్రీలీల యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలా ఖాళీ లేకుండా స్టార్ హీరోలు సరసన నటిస్తూ వెళ్లి.. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు గాని కొట్టిందా ఇక శ్రీలీల పొజిషన్ ఇంకా హై రేంజ్ కి వెళ్లి.. లేడీ ఓరియంటల్ సినిమాల్లో సక్సెస్ అయ్యే రేంజ్ కి కూడా వెళ్తుందని అనుకుంటున్నారు.
ప్రస్తుతం శ్రీలీల గ్లామర్ రోల్స్ లో మంచి పాత్రలు చేస్తూ.. తనదైన శైలిలో మంచి అభిమానం సంపాదించుకుంది. ఇక కుర్రాళ్ళకిశ్రీలీల అంటే విపరీతమైన పిచ్చి. ఆమె సినిమా అంటే చాలు ఎగబడతారు. సోషల్ మీడియాలో ( Sreeleela is in love married hero ) ఆమె ఫోటోలు చూస్తే చాలు విపరీతంగా లైక్లు, షేర్లు కొడతారు. నేను శ్రీలీల అభిమానిని.. నేను శ్రీల ఫ్యాన్ ని.. నాకు శ్రీలీల అంటే ఇష్టం అంటూ కుర్రాళ్ళు తెగ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అదే శ్రీలీల ప్రేమలో ఉందని.. ఒక స్టార్ హీరోని అది కూడా పెళ్లైన హీరోని ప్రేమిస్తుందని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఈ వార్త చూసిన అభిమానులు అందరూ నివ్వెరబోతున్నారు.. పెళ్లి అయిన హీరోని ప్రేమించాల్సిన ఖర్మ శ్రీయులకు ఏం పట్టింది? ఆమె కెరీర్ చూస్తే ఎంతో అద్భుతంగా ఉందని మనకే అర్థమవుతుంది. ఆమెకి ఎందుకు అర్థం కావడం లేదు. శ్రీదేవి కూడా ఇలాంటి తప్పు చేసే పెళ్లైన వాడిని ప్రేమించుకుని పెళ్లి చేసుకుని లైఫ్ పాడైపోయింది. అలాగే మహానటి సావిత్రి కూడా జీవితం అలాగే అయిపోయింది వాటి నుంచి మంచి నేర్చుకోవడం ( Sreeleela is in love married hero ) మానేసి మళ్లీ ఈ పెళ్లైన స్టార్ హీరోని ప్రేమించడం ఏంటి అని అనుకుంటున్నారు కానీ ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. శ్రీలల నిన్న జరిగిన మాడ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి వెళ్ళింది. అక్కడ ఆమె మాట్లాడుతూ.. తనకు ఒక ఫేవరెట్ హీరో ఉన్నాడని, ఆ హీరో అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ వేడుకకి శ్రీలీల తో పాటు సిద్దు జొన్నలగడ్డ , దుల్కర్ సల్మాన్ ఖాన్ కూడా అతిథులుగా హాజరయ్యారు.
శ్రీలీల మాట్లాడుతూ.. తన అభిమాన హీరో దుల్కర్ సల్మాన్ అని.. ఆయన అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా దుల్కర్ సల్మాన్ వైపు చూసి సార్ మీరు ఈ కార్యక్రమానికి వస్తున్నారు అని మా అమ్మ కూడా సంతోషించింది. మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది అని చెప్పింది. నాకు మా అమ్మ చిన్నప్పుడు చెప్పే కథల్లోని గుర్రం పైన వచ్చే యువరాజు కథ అంటే ఇష్టం. అలా గుర్రం మీద వచ్చే రాజకుమారుడు నాకు మీలోనే కనిపిస్తాడు సార్ అంటూ తెలిపింది. ఇలా తన ఇష్టాన్ని, ప్రేమని ఆ పెళ్లయిన స్టాల్ హీరో మీద చూపించింది. అతను చిరునవ్వు నవ్వి.. ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ కామెంట్లు పట్టుకొని శ్రీలీల పెళ్ళైన హీరోని ప్రేమిస్తుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి.