
Sreeleela : ఒక్కొక్క సీజన్లో.. ఒక్కొక్క హీరోకి, ఒక్కొక్క హీరోయిన్ కి డిమాండ్ అనేది ఉంటుంది. వాళ్ల కష్టం, అదృష్టం రెండూ కలిసి వచ్చి కొంత సీజన్ వరకు వాళ్ళ హవా నడుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్స్ ( Sreeleela dominates Kajal Agarwal ) ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా ఒక హీరో ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు మరీ ఎక్కువ చేస్తే ఉంటాయి తప్పా.. హీరోయిన్స్ మాత్రం చాలా సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒకేసారి రిలీజ్ అయిన రెండు, మూడు సినిమాల్లో కూడా వేరువేరు హీరోల సరసన హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు శ్రీలీల కి చాలా డిమాండ్ ఉందన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది.
ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీలకు చాలా డిమాండ్ ఉంది. ఆమె ఎంటర్ అయ్యి.. సక్సెస్ అందుకున్న తర్వాత చాలామంది మహా మహా హీరోయిన్స్ కి రావాల్సిన ఆఫర్స్ ని శ్రీలీల చాలా అవలీలగా లాగేసుకుంటుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంతు కేసరి సినిమా ( Sreeleela dominates Kajal Agarwal ) షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అయితే అదే సినిమాలో శ్రీలీల కూడా నటిస్తుంది. శ్రీలీల ఒక ముఖ్యమైన పాత్రలో అంటే బాలకృష్ణ కూతురుగా నటిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే.
సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరో సరసన నటించిన హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ హీరోయిన్ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ.. ఈ సినిమాలో మాత్రం కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ 90 లక్షల నుంచి ఒక కోటి వరకు కూడా ఇవ్వడం కష్టంగానే ఉందని అంటున్నారు. అదే శ్రీలీల కి రెండు కోట్లు ( Sreeleela dominates Kajal Agarwal ) ఇస్తున్నట్టు తెలుస్తుంది. మెయిన్ హీరోయిన్ కేమో 90 లక్షలు.. కీలక పాత్రలో నటిస్తున్న హీరోయిన్ కి రెండు కోట్లు ఇవ్వడం అంటే శ్రీలీల గొప్పతనం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే కాజల్ అగర్వాల్ కి అసలు బాలకృష్ణ పక్కన ఆఫర్ ఇవ్వడమే గొప్ప అని.. పైగా ఆమెకు ఆ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే అని కొందరు అంటుంటే.. మరికొందరు ఏదైనా శ్రీలీలకు చాలా పెద్దపీటమే వేసేస్తున్నారని అంటున్నారు.
భగవంతు కేసరి అనే సినిమాని గుర్తు తెచ్చుకోగానే బాలకృష్ణ గుర్తుకొస్తున్నాడు. ఆ తర్వాత గుర్తొచ్చేది శ్రీలీలే. ఎవరికీ కూడా అసలు ఆ సినిమాలో కాజల్ ఉందనే ఆలోచన కూడా రావడం లేదు. కాజల్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ట్రైలర్, టీజర్ వీటిల్లో కూడా బాలకృష్ణకి, శ్రీలలకి ప్రాముఖ్యత చూపిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ రకంగా శ్రీలీల అందరి హీరోయిన్స్ ని డామినేట్ చేస్తూ కొంపముంచుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఏదేమైనా ఎవరి క్రేజ్ వాళ్లకు ఉంటుంది. పాపం శ్రీలీల మీద ప్రస్తుతం అందరి దృష్టి పడుతుంది. అంత సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని అలా పక్కకు తోసేసి అంత పని చేసావ్ ఏంటి శ్రీలీలా అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉందని అంటున్నారు..