Home Cinema Sobhita Dhulipala : చైతూ ఎలాంటోడంటే.. సమంతే కరెక్ట్ అంటూ శోభిత అనుభవాలు బట్టబయలు..

Sobhita Dhulipala : చైతూ ఎలాంటోడంటే.. సమంతే కరెక్ట్ అంటూ శోభిత అనుభవాలు బట్టబయలు..

sobhita-dhulipala-comments-on-akkineni-naga-chaitanya-and-samantha-became-viral

Sobhita Dhulipala : గత కొంతకాలంగా శోభిత ధూళిపాల గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వింటూనే ఉన్నాం. ఎప్పుడైతే నాగచైతన్యత ఏదో ఉంది అనే వార్త బయటకు వచ్చిందో.. అప్పటినుంచి జనాలు ఆమె వెనకే పడుతున్నారు. నిజానికి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. నాగచైతన్యత ( Sobhita Dhulipala Chaithu and Samantha ) ఇంతవరకు శోభిత తో తనకు ప్రేమ నడుస్తుందని ఎలాంటి వార్త చెప్పలేదు. శోభిత మాత్రం వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని.. మంచి స్నేహితులం అని చెప్పింది. నాగచైతన్య, సమంత ఎంతో కాలం గాఢంగా ప్రేమించుకుని.. ఒకరంటే ఒకరు ఇష్టపడి.. ఒకరి ఇంట్లో వాళ్లకు ఒకరు చెప్పుకుని.. పెద్ద వాళ్ళని ఒప్పించి.. 2017లో వాళ్ళిద్దరూ దంపతులయ్యారు.

sobhita-dhulipala-comments-on-akkineni-naga-chaitanya-and-samantha-became-viral

ఆ తర్వాత సమంత తన భర్తతో ఎంతో ఆనందంగా ఉండటమే కాకుండా.. మామగారైన నాగార్జునతో పెళ్ళికి ముందు మనం సినిమా చేయగా.. పెళ్లి తరవాత రాజు గారి గది సినిమా చేసి హిట్స్ కొట్టింది. అలాగే సమంత ఎంతో మంచి కోడలిగా.. నాగార్జున అమలాతో ఎంతో చనువుగా, ప్రేమగా ఉండేది. సమంత తర్వాత ఎందుకు ( Sobhita Dhulipala Chaithu and Samantha ) నాగచైతన్యను వదిలేసిందో తెలియదు కానీ.. విడిపోవడం అయితే జరిగిపోయింది. మజిలీ సినిమాలో పెళ్లి తర్వాత కూడా వాళ్ళిద్దరూ జంటని చూస్తే.. ఎంతో అన్యోన్యంగా, వాళ్ళ నటనలో నిజతత్వం, ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ కనిపిస్తూ ఉంటది. అంత ప్రేమ పెట్టుకొని వాళ్ళిద్దరూ ఎలా విడిగా ఉంటున్నారో.. ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పటికీ వీళ్లిద్దరిని పెట్టి సినిమా తీస్తే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.

See also  Chiranjeevi: చిరంజీవి గ్యారేజ్ లోకి మరో కొత్త కారు. నెంబర్ కోసమే 5 లక్షలు. మరి కారు ధర ఎంతో తెలుసా.??

sobhita-dhulipala-comments-on-akkineni-naga-chaitanya-and-samantha-became-viral

అలాంటి నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత.. సమంత ఒంటరిగా ఉంటూ తన సినిమా కెరియర్ సంగతి చూసుకుంటుంది. సమంత హిట్లు కొట్టే క్రమంలో.. కొన్ని ఫ్లాప్ లు, డిజాస్టర్ లు కూడా ఇచ్చింది. ఇది ఇలా ఉంటే నాగచైతన్యా సినిమాలైతే మాత్రం చాలా వరకు సమంతను నుంచి విడిపోయిన తర్వాత హిట్స్ అంటూ లేవు. అయితే ( Sobhita Dhulipala Chaithu and Samantha ) నాగచైతన్య సోబితా ధూళిపాలని ప్రేమిస్తున్నాడని.. వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని.. అతి త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని అనేక వార్తలు సోషల్ మీడియాలో అయితే వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల శోభిత ధూళిపాల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

See also  Abhishek Bachchan : ఇన్నాళ్ళకి ఐశ్వర్య రాయ్ గురించి నిజాలు బయట పెట్టిన అభిషేక్ బచ్చన్..

sobhita-dhulipala-comments-on-akkineni-naga-chaitanya-and-samantha-became-viral

శోభిత ధూళిపాళ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనగా.. అందులో ఒక ఆమె నాగచైతన్య గురించి అడిగింది.. నాగచైతన్య నిజంగా ఒక మంచి మర్యాదస్తుడని.. అని ఎంతో మంచివాడని, చైతు చాలా గౌరవంగా , హుందాగా మాట్లాడుతాడని.. చాలా కూల్ గయ్ అని.. అందుకే అతను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలాగే సమంత గురించి అడగ్గా.. సమంత గొప్ప నటి అని.. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కు స‌మంత‌నే క‌రెక్ట్ ఛాయిస్ అని.. ఆమె బాగా సూట్ అయిందని పొగుడుకుంటూ వచ్చింది. ఆమె ఎన్నుకునే సినిమాలు కూడా చాలా బాగుంటాయని చెప్పింది. అయితే చైతూతో ఉండే అన్నే మంచి లక్షణాలు గురించి చెప్పడమే కాకుండా.. ఇంకా ఆ లక్షణాలు అంటే నాకు చాలా ఇష్టం అంటుంది అంటూ చైతు తో ఆమె ఫ్రెండ్షిప్ వలన కలిగిన అనుభవాలు అన్ని బట్టబయలు చేసినట్టే.. వాళ్ళ ప్రేమను కూడా ఒకరోజు చెబుతాదని అందరూ అనుకుంటుంటున్నారు.