Home Cinema Sobhan Babu : అప్పట్లో శోభన్ బాబు కు వచ్చిన ఒక్క ఆలోచన ఎన్ని వేల...

Sobhan Babu : అప్పట్లో శోభన్ బాబు కు వచ్చిన ఒక్క ఆలోచన ఎన్ని వేల కొట్లో తెలుసా?

sobhan-babu-earned-many-crores-because-of-only-that-thought

Sobhan Babu : శోభన్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి స్టార్ హీరో అయిన శోభన్ బాబు అంటే సినీ అభిమానులకి, ఆయన అభిమానులకి, సినీ రంగానికి కూడా ఎంతో ఇష్టం. ఎందుకంటే.. ఎంతో ( Sobhan Babu earned many crores ) క్రమశిక్షణ ఉన్న మనిషి ఆయన. ఆయన అభిమానులు కూడా ఆయన లాగే సౌమ్యంగా ఉండే అభిమానులు. శోభన్ బాబు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి విపరీతమైన ఇష్టం. కుటుంబ కదా చిత్రాల్లో ఎక్కువగా నటించి అందర్నీ మెప్పించిన హీరో. ఒకరకంగా చెప్పాలంటే అప్పటి రొమాంటిక్ హీరో అంటే శోభన్ బాబే.

Sobhan-Babu-thought-crores-value

ఆయనకు ప్రతి హీరోయిన్ తో ఉండే కెమిస్ట్రీ, ఆయన నటించే విధానం అద్భుతంగా ఉండేది. చాలామంది ఆడవాళ్లు తన భర్త శోభన్ బాబు లాగా ఉండాలి అని అనుకునే వారు. అంత బాగా ఆ పాత్రలో లీనం అయిపోయే నటించేవాడు. శోభన్ బాబు జీవితంలో విచిత్రం ఏమిటంటే.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ( Sobhan Babu earned many crores ) ఆయన కుటుంబం నుంచి ఎవరిని కూడా సినిమా రంగంలోకి తీసుకురాలేదు. పైగా ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత.. సినిమా రంగంలో ఉన్నవారు దాని రిలేటెడ్ వ్యాపారాలు మొదలుపెడతారు. కానీ శోభన్ బాబు మాత్రం ఒక స్టూడియో కట్టడం గానీ, సినిమా రిలేటెడ్ వ్యాపారాలు గాని, సినిమా ఓన్ గా ప్రొడ్యూస్ చేయడం కానీ ఏది కూడా చేయలేదు.

See also  Animal First Day Collection : అనిమల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

Sobhan-Babu-thought-crores

పైగా ఆయన కుటుంబం నుంచి ఒకరిని కూడా సినిమా రంగంలోకి తీసుకురాలేదు. అదే ఆయనలో ఉన్న ఒక విచిత్రం. ఆయన ఒక్కడే పడిన కష్టంతో, సంపాదనతో.. ఈ రోజుకి చూస్తే స్టార్ హీరోలకంటే ఎక్కువగా ఆయన ఆస్తివిలువ ( Sobhan Babu earned many crores ) ఉందని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటారు. దానికి కారణం ఏమిటి? ఒక్క శోభన్ బాబు సంపాదనతో అన్ని కోట్ల రూపాయల సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది?. ఆయనకు వచ్చిన ఒకే ఒక్క ఆలోచన ఆయన తర్వాత మూడు నాలుగు జనరేషన్లు ఆనందంగా బ్రతకడానికి కారణమైంది.

See also  Kushi Review and Rating : ఖుషి సినిమాతో వాళ్ళ జీవితాలు మారిపోతాయా.. రివ్యూ మరియు రేటింగ్..

Sobhan-Babu-thought-money

నిజంగా ఆయన కుటుంబ సభ్యులు అదృష్టవంతులు. ఆయన కష్టపడి సంపాదించి ఒక మంచి ఆలోచనతో వాళ్ల కుటుంబానికి ఎంత ఆస్తినిచ్చారో అంటూ సినిమా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. శోభన్ బాబుని ఎవరు ఎన్ని ప్రలోభాలు చేసినా ఏ వ్యాపారం చేయనని చెప్పేవారట. ఆయన ఒకటే చెప్పేవారట, దానినే నమ్మేవారట.. అదేమిటంటే.. జనం పెరుగుతూనే ఉంటారు.. కానీ భూమి పెరగదు. కాబట్టి కొంతకాలాని భూమికి చాలా డిమాండ్ పెరుగుతుంది. అందుకని భూమిని కొనుక్కొని దాచిపెట్టుకుంటే చాలు అదే పెద్ద ఆదాయం, అదే పెద్ద వ్యాపారం అని చెప్పేవారట. ఆ ఒకే ఒక్క ఆలోచనతో.. ఆయనకు వచ్చిన ఆదాయంలో నుంచి సగం పైగా భూమిని కొని మిగిలిన డబ్బులతోనే పొదుపుగా బ్రతికేవాడు అంట. ఇంకా డబ్బులు సరిపోకపోతే.. అప్పు చేసి మరి ఆ భూమిని కొని.. తర్వాత నెమ్మదిగా అప్పు తీర్చేవారట. ఆ రోజుల్లో ఆయనకు వచ్చిన ఆలోచన నిజమే. అప్పుడు భూములు కొనుక్కొని దాచిపెట్టుకున్న వాళ్ళు ఈరోజు అపర కోటీశ్వరులై కూర్చున్నారు.