Home Cinema Skanda – Mahesh Babu : స్కంద సినిమా గురించి మహేష్ బాబు సంచలన నిర్ణయం!

Skanda – Mahesh Babu : స్కంద సినిమా గురించి మహేష్ బాబు సంచలన నిర్ణయం!

Skanda – Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమాలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన ఎన్నుకున్న కథ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా సక్సెస్ అయినా.. ఫెయిల్ అయిన కూడా ఆ కథలో మాత్రం ఓ కొత్తదనం ఉంటుంది. అలాగే ఇప్పటివరకు మహేష్ బాబు డబ్బింగ్ ( Skanda movie first offered to Mahesh Babu ) సినిమాలను రీమేక్ చేయకుండా తెలుగులో కథను రాసి తెలుగు లో చేసిన కొత్త సినిమాలకే ఆయన ప్రాధాన్యతిస్తూ.. అలానే నటిస్తూ వచ్చిన గొప్ప హీరో. ఇంతవరకు రీమేక్ చేయని ఘనత మహేష్ బాబుకు దక్కింది. ఇతర భాషలో సక్సెస్ అయిన సినిమా వైపు కన్నెత్తి చూడకుండా తనమీద తాను, దర్శకుల మీద, కథ రచయిత మీద నమ్మకంతో దూసుకు వెళ్లే హీరో మహేష్ బాబు.

See also  Janhvi Kapoor : జాన్వీ కపూర్ మీద తన అభిప్రాయాన్ని.. పచ్చిగా బయట పెట్టిన బోనీకపూర్..

skanda-movie-first-offered-to-mahesh-babu-but-he-rejected-so-ram-pothineni-accepted-and-done-it

అటువంటి మహేష్ బాబు దగ్గరికి బోయపాటి శ్రీను వెళ్లి ఒక కథ చెప్పాడంట. ఆ కథ చెప్పగానే మహేష్ బాబుకి నచ్చింది కానీ.. ఆ సినిమాకు మాత్రం నో చెప్పాడంట. ఇంతకీ అది ఏం సినిమా అంటే.. బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న చిత్రం స్కంద. ఇటీవల ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ( Skanda movie first offered to Mahesh Babu ) కూడా జరిగింది. ఈ సినిమాపై రామ్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అంటే.. హీరోని ఎంత గొప్పగా చిత్రీకరించి చూపిస్తాడో అందరికీ తెలుసు. రామ్ ని మళ్లీ ఒక లెవెల్ కి తీసుకు వెళ్లే విధంగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నాడని అనుకుంటున్నారు.

See also  Nayanthara : నయనతార హీరోయిన్ గా మాత్రమే కాకుండా.. ఎం చేసి ఇన్ని వందలకోట్లు సంపాదించిందో తెలిస్తే..

skanda-movie-first-offered-to-mahesh-babu-but-he-rejected-so-ram-pothineni-accepted-and-done-it

స్కంద సినిమాపై ఇంత మందికి భారీ అంచనాలున్న ఈ సినిమాని మహేష్ బాబు ఎందుకు నో అని ఉంటాడు అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి స్కందా సినిమాని మహేష్ బాబు ( Skanda movie first offered to Mahesh Babu ) గురించే బోయపాటి శ్రీను రాసుకున్నాడంట. రాసుకున్న తర్వాత మహేష్ బాబు దగ్గరికి వెళ్లి సినిమా స్టోరీ మొత్తం చెప్పాడంట. మహేష్ బాబు సినిమా అయితే చాలా బాగుంది కానీ.. ఇంత మాస్ ఎలిమెంట్ సినిమాకి, ఇంత ఊర మాస్ కింద కనబడడానికి నేను పనికిరానని.. అది చూసి అభిమానులు అంతగా ఆకర్షితులు కారని.. తనపెర్సొనాలిటీ అసలు నప్పదని.. ఆ పాత్రకి నేను న్యాయం చేయలేనని చెప్పాడంట.

See also  Ileana: ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ స్టార్ హీరోయిన్ సోదరుడే కారణమా.??

అంతేకాదు ఈ సినిమా మిర్చి సినిమా స్టైల్ లో ఉంటుందంట. ఫస్ట్ ఆఫ్ అంత పెద్దగా ఏమీ ఉండదంట. సెకండ్ హాఫ్ లో హీరో తన హీరోయిజాన్ని ఊర మాస్ లెవెల్లో చూపిస్తాడంట. అలా చూపించడానికి నా పర్సనాలిటీ కానీ, నా బిహేవియర్ కానీ, నా మాట తీరు గాని సెట్ కాదని.. నేను ఈ సినిమాకి పనికిరాని చెప్పి సింపుల్గా నో చెప్పేసాడు అంట మహేష్ బాబు. అలా మహేష్ బాబు నో చెప్పిన సినిమాని రామ్ పోతునేనితో బోయపాటి శ్రీను తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ అనుకున్నట్టుగా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిందంటే.. మహేష్ బాబు ఈ సినిమాని మిస్ అయినట్టే అని మరికొందరు అనుకుంటున్నారు..