Home Cinema Singer Sunitha : సింగర్ సునీత.. నేను దారుణంగా మోసపోయాను..

Singer Sunitha : సింగర్ సునీత.. నేను దారుణంగా మోసపోయాను..

Singer Sunitha : సింగర్ సునీత అంటే సినీ అభిమానులకు అందరికీ ఎంతో ఇష్టం. ఆమె పాటలు ఎంత మధురంగా ఉంటాయో, మాటలు కూడా అంతే తీయగా ఉంటాయి. ఆమె పాట, మాట మాత్రమే కాదు.. ఆమె ముఖం కూడా ఎంతో ( Singer Sunitha latest comments ) అందంగా ఉంటుంది. చీర కట్టులో ఆమె లక్ష్మీదేవిలా ఎంతో సంప్రదాయంగా ఉంటుంది. సింగర్ సునీతను చూస్తే.. భగవంతుడు ఒకే మనిషికి ఇన్ని ఇస్తాడా అని అనిపిస్తుంది. అందచందాలకు లోటు లేకుండా, మాటతీరుకు లోటు లేకుండా, గానం ఆవిడ పాడుతుంటే అందరూ హాయిగా ఆస్వాదించేలా ఎన్ని ఇచ్చాడు అనిపిస్తుంది.

Singer-Sunitha-latest-commetns

అయితే భగవంతుడు ప్రతి మనిషికి ఏదో ఒక బాధ అనేది ఇస్తాడు. అలాగే మనకు జీవితాలు చాలా బాగున్నాయి అనుకునే వాళ్ళకీ, సెలబ్రిటీసు, ఎంత అదృష్టవంతులు అనుకునే వారికి కూడా ఏదో ఒక రకమైన చింత అనేది ఉంటుంది. అదే జీవితం.. చింతలేని జీవితం ఉండదేమో. సింగర్ సునీత కూడా ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చింది. సునీత అని ( Singer Sunitha latest comments ) పిలిచే కంటే కూడా.. ఆమెను సింగర్ సునీత అని పిలిస్తేనే ఎక్కువగా ఇష్టపడుతుంది. సింగర్ సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆమె రెండవ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎన్నో నెగటివ్ కామెంట్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

See also  Lavanya Mehndi function: లావణ్య త్రిపాఠి మెహందీ ఫంక్షన్ లో సూపర్ స్పెషల్ ఇదేనట..

Singer-Sunitha-latest-commetns-viral

కొందరైతే ఆమెని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాగా సపోర్ట్ చేశారు కానీ.. మరికొందరు నెగిటివ్ గా కామెంట్స్ కూడా చేశారు. ఆమె దేన్నీ పట్టించుకోకుండా ఆమె నిర్ణయమే ఆమె శక్తిగా ఆలోచించుకొని, ఏది మంచో తెలుసుకొని, ఆమెకి నచ్చింది చేసుకుంది. సునీత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పర్సనల్ లైఫ్ గురించి ఎమోషనల్ గా ( Singer Sunitha latest comments ) ఎన్నో విషయాలను పంచుకుంది. అలా ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పే క్రమంలో.. నేను చాలా దారుణంగా చాలా విషయాల్లో మోసపోయాను. చిన్న వయసులోనే పెళ్లి, కొడుకు, కూతురు అన్ని వచ్చేసాయి. అలాగే మా నాన్న వ్యాపారం చేసి మోసపోవడం, ఇల్లు కూడా పోవడం, ఫైనాన్షియల్ గా ఎన్నో ఇబ్బందులు పడటం కూడా చూశాను. ఎప్పటికైనా ఆర్థికంగా.. గట్టిగా నిలబడాలి అని అనుకునేదాన్ని. డబ్బును కష్టపడి సంపాదించాలి అనుకునేదాన్ని.

See also  Sai Dharam Tej Reacts: నేను అబ్దుల్ కి డబ్బులు ఇవ్వలేదు..అబ్దుల్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

Singer-Sunitha-second-marriage

అయితే ఎన్నోసార్లు నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను మోసం చేసేవారు.అది తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయేదాన్ని.కానీ ఏమీ చేయలేక చిరునవ్వు నవ్వేసేదాన్ని. నా ఆశ్చర్యం, కష్టం అన్నీ కూడా నా చిరునవ్వుతోనే చూపించేదాన్ని. అందుకే అందరూ నా నవ్వుని ఫేక్ స్మైల్ అని అంటారు. అలాగే నా గురించి ఏమైనా ప్రశ్నిస్తే నాకు చెప్పాలనిపిస్తే చెప్తాను.. చెప్పకూడదనిపించినా, చెప్పలేకపోయినా కూడా ఒక చిన్న స్మైల్ ఇస్తాను. అందుకే నా స్మైల్ చూసి ఫేక్ స్మైల్ అని ఎందరో అంటారు. అలా అని వాళ్లని తప్పని నేననను. సింగర్ సునీత ఇప్పటికీ 5000 షోలుపైగా చేసిందంట. 28 ఏళ్ల కెరీర్లో ఆమె ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో నేను చేసిన మంచి పని అంటూ ఏమైనా ఉంటే.. ఒక మంచి నిర్ణయం అంటూ ఏదైనా ఉంటే.. అది కేవలం నేను రెండో పెళ్లి చేసుకోవడమే అని ధైర్యంగా చెప్పింది. సింగల్ సునీత చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.