Home Uncategorized Singer Mangli: అమాతం రెమ్యునరేషన్ పెంచేసిన మంగ్లీ ఇప్పుడు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా.?

Singer Mangli: అమాతం రెమ్యునరేషన్ పెంచేసిన మంగ్లీ ఇప్పుడు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా.?

Singer Mangli: మంగ్లీ అసలు పేరు సత్యవతి, అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బసినేపల్లె తండలో పేద బంజారా కుటుంబంలో పుట్టిన తనకు చిన్నతనం నుంచే పాటలు పాడటం చాలా ఇష్టం. ఆ ఇష్టంతో సంగీతం నేర్చుకుని ఎస్.వి విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లమో కోర్సు పూర్తి చేసుకుంది. V6 టీవీ ఛానల్ లో మాటకారి మంగ్లీ అనే కార్యక్రమంతో తెలంగాణ యాసలో అందరికీ దగ్గరయ్యింది కానీ తనకి ఇష్టమైన సంగీతాన్ని దూరమైతున్న అనే బాధతో V6 టీవీ నుండి బయటకు వచ్చేసింది.

See also  Top Heroine : టాప్ హీరోయిన్ చేసిన ఒక పనికిమాలిన పని వలన అందరు హీరోయిన్లు రిస్క్ లో పడ్డారు.

ఆ తర్వాత మైక్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో చేరి రేలా రేలా రే అనే పాట మంగ్లీని సెలబ్రిటీ సింగర్ చేసింది.  బతుకమ్మ పాటలతో చాలా ఫేమస్ అయిన మంగ్లీ ఫోక్ సాంగ్స్, జానపద గీతాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. సినిమాల్లో పాడే అవకాశం అందుకుంది. మంగ్లీ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. గోర్ జీవన్ అనే లంబాడి చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించింది.

See also  Puri-Charmi: చార్మి ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటే.. పూరి లైట్ తీసుకోమన్నాడట ఇంతకీ ఏం జరిగింది.?

మంగ్లీ పాడిన పాట ప్రతి ఒక్కటి సూపర్ హిట్టే, రాములో రాములా, సారంగ దరియా, చింతకు జింతక్, ఊరంతా, బుల్లెట్, జ్వాలా రెడ్డి, కన్నె అదిరింది మొదలైన పాటలు సినిమాల్లో ఉర్రూతలూగించాయి. ఇటు సినిమాలోనే కాక మంగ్లీకి తన సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో ఆమెనే సొంతంగా పాటలు విడుదల చేస్తుంది. తద్వారా మంగ్లీకి మంచి సంపాదన వస్తుంది. ఒకపక్క సినిమాలో నటిస్తూ, మరొక యూట్యూబ్లో పాటలు పాడుతూ నాలుగైదు రకాలుగా మంగ్లీ సంపాదిస్తుంది. ఒకప్పుడు ఒక పాటకు ఇరవై వేలు తీసుకున్న మంగ్లీ ఇప్పుడు రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేస్తుందట. మంగ్లీ పాడిన ప్రతీ పాట హిట్టవ్వడంతో నిర్మాతలు ఇవ్వడానికి వెనుకడుగు వేయడం లేదు.