Home Cinema Geetha Madhuri: పక్కలోకి వస్తే ఆ నిర్మాత అవకాశం ఇస్తా అన్నాడంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసింది...

Geetha Madhuri: పక్కలోకి వస్తే ఆ నిర్మాత అవకాశం ఇస్తా అన్నాడంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసింది సింగర్ గీత మాధురి..

Geetha Madhuri: సినిమా హిట్ అవ్వాలంటే కేవలం సినిమాలో స్టోరీ ఒక్కటి బాగుంటే సరిపోదు ముందుగా అందులో విడుదలైన పాటలు సూపర్ హిట్ అవ్వాలి. అందరికీ పాటలు నచ్చాలని ఏమీ లేదు కానీ సినిమాలకి స్టోరీ అంత ముఖ్యమో పాటలు కూడా అంతే ముఖ్యం..  తెర వెనకాల నుండి అద్భుతమైన గాత్రంతో థియేటర్ లో షేక్ చేసే పాటలు పాడే సింగర్స్ ఎంతో మంది ఉన్నారు. అలాంటి సింగర్లలో తన గాత్రంతో మైమరిపించేలా పాటలు పాడి ఆకట్టుకునే వారిలో సింగర్ గీతా మాధురి అనగానే ప్రతి ఒక్క మ్యూజిక్ ప్రియులకు, సినీ ప్రియులకి కచ్చితంగా తెలిసిన పేరు. ఇక ఈమె ఎన్నో పాటలు పాడి చాలా మంచి పేరు తెచ్చుకుంది. తన అద్భుతమైన గొంతుతో ఎన్నో క్లాసికల్ మాస్ పాటలు పాడే ఎంతగానో అలరించింది.

Singer Geetha Madhuri

కేవలం హీరోలకి హీరోయిన్లకే క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురవుతాయని అందరూ అనుకుంటారు.కానీ ఇక్కడ సింగర్ గీత మాధురి సైతం క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందట.. మరి నిజంగానే గీతా మాధురి కూడా అవకాశాల కోసం ఆ నిర్మాతలతో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొందా అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. గీతా మాధురి ఇండస్ట్రీలోకి ప్రేమలేఖ రాశా అనే సినిమాలో పాట పాడి అడుగు పెట్టింది. ఇక ఈ చిత్రం అనంతరం రామ్ చరణ్ హీరోగా తన తొలి చిత్రం చిరుతలో చంకా చంకా చమ్కీరే మాస్ పాట పాడి కుర్రకారులని క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత తనకు మంచి గుర్తింపు దక్కిందంటే మాధువి లతా  తనీష్ హీరో హీరోయిన్లుగా నటించిన నచ్చావులే చిత్రంలో నిన్నే నిన్నే కోరా అనే పాటతో చాలా మంచి గుర్తింపు దక్కించుకుంది.

See also  Trisha Krishnan Latest: పాపం త్రిష.. అంత పెద్ద లోపం ఉన్నందు వల్ల ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదా..

ఇక ఈ పాటతో చాలా మంచి ఫేమస్ అయిన గీతా మాధురి ఆ తర్వాత వరుస చిత్రాలలో తన దైన శైలిలో అవకాశాలు అందుకొంటూ స్టార్ సింగర్ గా మారిపోయింది. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఉంది. ఇక తన లైఫ్ మంచి గా కొనసాగుతున్న తరుణంలో సినిమాల్లో హీరోగా పలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సపోర్టింగ్ రోల్స్ చేసే నందు తో ప్రేమలో పడి అతని వివాహం చేసుకుంది. ఇక నందు సైతం పలు చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. ఆ మధ్య కాలంలో రష్మిక మందనతో బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే చిత్రం కూడా ఇద్దరు కలిసి చేసినప్పటికీ తెలిసిందే.. కాగా ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ అట్టర్ ఫ్లాప్ ని మూట కట్టుకుంది.. అయితే అసలు ఈ విషయాలన్నీ పక్కనపెట్టి మన టాపిక్ విషయంలోకి వెళ్ళినట్లయితే..

See also  Janhvi Kapoor: జూనియర్ ఎన్టీఆర్ మీద మోజుతో జాన్వికపూర్ ఏం కోల్పోయిందో తెలుసా?

Geetha Madhuri

సింగర్ గీతా మాధురి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాలలో గురించి సినిమా ఇండస్ట్రీ గురించి అంతగా తెలిసేది కాదట.. దాంతో స్టార్ నిర్మాత గీతా మాధురికి అవకాశాల ఆశ చూపి నీకు పెద్ద పెద్ద చిత్రాల్లో పాటలు పాడ్డానికి అవకాశం కల్పిస్తానంటూ తెలిపాడట. అందుకు నువ్వు చేయాల్సిందేమీ ఉండదు నా బెడ్ రూమ్ కి రవాలి అంతే అని తెలిపాడట. కాగా గీతా మాధురి కి అసలు విషయం అర్థమై అయితే నేను సినిమాల్లో పాటలైనా పాడకుండా ఉంటా గాని ఈ కెరీర్ మొత్తాన్ని వదిలేయమన్నా వదిలేస్తాను కానీ ఇలాంటి తప్పుడు పని అస్సలు చేయనంటూ ఆ స్టార్ నిర్మాత మొహం మీద చెప్పి వచ్చిందట. ఇక ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో గీతా మాధురి (Geetha Madhuri) చిత్రాలలో వరుస అవకాశాలు సాధించుకుంటూ ప్రస్తుతం స్టార్ సింగర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతూ ఉంది.