Siddu Jonnalagadda: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది డి.జె. టిల్లు సినిమా. మనందరికీ తెలుసు చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించినదో చూసాం.. లాభాల విషయాల్లో ఈ చిత్రం విడుదలైనప్పుడు అప్పట్లో బాహుబలి కంటే ఎక్కువ ఈ సినిమా లాభం తెచ్చిపెట్టిందని వార్తలు వచ్చాయి. ఇక ఈ చిత్రంలో హీరోగా నటించిన జొన్నలగడ్డ సిద్దు అదేవిధంగా హీరోయిన్ గా కేతిక శర్మ నటించారు. జొన్నలగడ్డ సిద్దు ఈ చిత్రంలో అసలు సిసలైన తెలంగాణ ఆశ మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం హిట్ అవ్వడంతో డి.జె. టిల్లు 2 సినిమా కూడా ప్రస్తుతం తీస్తున్నారు.
ఇక్కడే అసలు సిసలైన చిచ్చు మొదలైంది..ఈ చిత్రం తీస్తున్నామని చెప్పినప్పటినుండి ఈ చిత్రంపై ఎన్నో ప్రచారాలు చెలరేగాయి. ఇంకా ఈ చిత్రం మొదలుపెట్టిన కొన్ని రోజులకే డైరెక్టర్ విమల్ కృష్ణతో విభేదాలు వచ్చాయని.. అదే కాకుండా హీరోయిన్ల విషయంలో సిద్దు తీరు మంచిగా లేకపోవడంతో ఈ సినిమాలో నటించడానికి ఎవ్వరు ఇష్ట పడడం లేదంటూ అనేకమైన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అనుపమ పరమేశ్వర్ నటించడానికి ఓ.కే చెప్పినప్పటికీ ఆమె కూడా ప్రస్తుతం నటించకుండా వెళ్లిపోయిందని ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా పై తీవ్రమైన దుమారమే చెలరేగుతుంది.
వీటన్నికిటీచెక్ పెట్టేలా.. ఇటీవలే సిద్దు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వార్తలన్నీటిపై సంచలమైన విషయాలు వెల్లడించాడు. డి.జె. టిల్లు చిత్రం కోసం మొదట మేము హీరోయిన్ గా అనుకున్నది కలిసింది అనుపమ పరమేశ్వరన్ నీ..ఇక అదే కాకుండా డైరెక్టర్ విమల్ కృష్ణ తో మాకు ఎలాంటి గొడవలు లేవు, విభేదాలు లేవు అంటూ లైవ్ లోనే అతనికి కాల్ చేసి మాట్లాడారు. ఇదే కాక ప్రస్తుతం డి.జె. టిల్లు 2 సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విమల్ కృష్ణ తో నేను రిలేషన్ షిప్ లో ఉన్నాను అంటూ సిద్దు జొన్నడగడ్డ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ మాటలు వైరల్ అయ్యి నెట్టింట హల చల్ చేస్తున్నాయి.
రిలేషన్ షిప్ అంటే మీరు ఏదో అనుభవించుకోకండి.. అప్పుడే అక్కడిదాకా ఊహించుకుంటున్నారా.? అయ్యయ్యో.. పాపం అసలు విషయం.. రిలేషన్ షిప్ అంటే సిద్దు ఇంట్లోనే డైరెక్టర్ మాలిక్ కళ్యాణ్ ఉంటారట.. అదే కాకుండా వాళ్లతోనే తింటూ వాళ్ళ ఇంట్లోనే పడుకుంటారట.. ఇక మాలిక్ కళ్యాణ్ పడుకుంటే దుప్పటి జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కప్పుతాడట.. అంత మంచి క్లోజ్ రిలేషన్ మా మధ్య ఉంది అంటూ సిద్దు జోన్నల గడ్డ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం సిద్దు చేసిన ఈ రిలేషన్ షిప్ అనే మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.