Shruti Hassan: విశ్వ నటుడు కమలహాసన్ కూతురిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ తన అందంతో నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తమిళంలోనే కాక ఇటు తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన తను నటిస్తూ ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నది. ఇక ఈ సంవత్సరం విషయానికి వస్తే తను నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దాంతో ఏడాది మొదట్లోనే తన ఖాతాలో రెండు పెద్ద హిట్ సినిమాలు చేరిపోయ్యాయి. చిరంజీవి సరసన నటించిన వాల్తేరు వీరయ్య అలాగే నందమూరి బాలకృష్ణ సరసన నటించిన వీర సింహ రెడ్డి చిత్రాలతో విజయ డంకా మోగచింది శృతిహాసన్..
దాంతో ఈ అమ్మడుకి గోల్డెన్ లెగ్ అని బిరుదు తెచ్చుకుంది. దాదాపు ఈ రెండు చిత్రాలలో నటించిన ఆమె మూడు కోట్ల రూపాయలు పుచ్చుకున్నట్లు అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి.. మొదట్లో ఈ సినిమాలో నటించినందుకు ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నది ఎందుకంటే.. డబ్బు కోసం ఎంత పనైనా చేస్తారు వయసుతో సంబంధం లేకుండా నీ తండ్రి వయసున్న హీరోలతో నువ్వు నటిస్తావా అంటూ చాలామంది ఆమెని సోషల్ మీడియా వేదికగా ఎన్నో విమర్శలు చేశారు. కేవలం శృతిహాసన్ ఒక్కరినే కాకుండా మీ కన్న కూతురు వయసు ఉన్న అమ్మాయిలతో నువ్వు రొమాన్స్ చేయడమేంటని హీరోలను కూడా విమర్శించారు.
అప్పట్లో అబ్బో నెప్పింట ఎంత రచ్చ రచ్చ చేసారు మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా శృతిహాసన్ తమిళ మీడియాతో ముచ్చటిచ్చింది. ఆ సందర్భంగా సినిమాల్లో నటించడానికి హీరోయిన్స్ ఎన్ని బాధలు పడాలో ఎన్ని కష్టాలు పడాలో తెలిపింది. హీరోలకేముంది ఎలాంటి డ్రెస్సులైన వేసుకుంటారు.. కానీ మేము మాత్రం అందంగా కనబడడానికి చీరకట్టుతో మెప్పించాల్సి ఉంటుంది. మరి అదే కాకుండా మంచులో డాన్స్ చేయడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తాను తెలిపింది. హీరోలకేమో కోర్టుతో అలాగే శాల్స్ తో మేకప్ చేసి మరి వాళ్ళను అలా చూపిస్తారు..
మాకు మాత్రం ఏమీ ఇవ్వకుండా కేవలం జాకెట్టు, చీర మాత్రమే ధరించి డాన్స్ చేయమంటే ఎలా అని మీడియా సదరు వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఎదురు జవాబు బదులిచ్చింది. ఈ సంవత్సరం విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ (Shruti Hassan) నటించిన సంగతి మనందరికీ తెలుసు.. ఈ చిత్రంలోని శ్రీదేవి పాటకు గాను ఆమె డాన్స్ చేయలేకపోయానని తెలిపింది దీంతో ఆమె చేసిన వాల్తేరు వీడియోలోని శ్రీదేవి పాటకు సంబంధించిన కామెంట్ చేయడంతో మెగా అభిమానులు ఆమెపై బగ్గుమంటున్నారు..