Shruti Haasan Comments: యూనివర్సల్ స్టార్ కమలహాసన్ కూతురి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన నటనతో తన దైన శైలిలో కోట్లాది మంది అభిమానులను కైవసం చేసుకుని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించకుండా నటనతో ఇండస్ట్రీలో తనెంటో నిరూపించుకుంది. అలాంటి శృతి హాసన్ ఇండస్ట్రీకి పరిచయమైంది 2008వ సంవత్సరంలో లక్ అనే చిత్రంతో వెండి తెర కు అడుగు పెట్టింది. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది మాత్రం అనగనగా ఓ ధీరుడు అనే చిత్రంతోనే.. ఇక నటిగా ఈ చిత్రంలో తన నటనకు శృతి హాసన్ కి ఒక రకంగా మంచి మార్కులే పడ్డాయి. కానీ చిత్రం ఆశించినంత స్థాయిలో మాత్రం ఫలితాన్ని అందించలేకపోయింది అయితే కెరియర్ ఆరంభంలో ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బురిడీ గొట్టాయి దాంతో అమ్మడికి ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది.
అలా అలా సరైన అవకాశం కోసం చూస్తూ ఉన్నా శృతి హాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ తో శృతి హాసన్ సినీ కెరియర్ తిరిగింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడంతో శృతి హాసన్ కి తెలుగులో వరుస చిత్రాల్లో అవకాశాలు లభించాయి. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనది కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలా తెలుగులో స్టార్ హీరోలతో వరుస చిత్రాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సూపర్ సక్సెస్ గా నిలిచింది. అయితే ఆ మధ్యలో లవ్ బ్రేకప్ అంటూ సినీ కెరీర్ ను తనే గాలికి వదిలేసిన మళ్లీ 2020 తర్వాత బిజీ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ..
ఇక ప్రస్తుతం శృతి హాసన్ విషయానికొస్తే.. ఇటు తెలుగు తో పాటు తమిళ్ మరియు హిందీ ఇంగ్లీష్ చిత్రాలు నటిస్తుంది. అయితే శృతి హాసన్ ఏదైనా సరే ఓపెన్ మైండెడ్ గా చెప్పేస్తుందని మనందరికీ తెలిసిందే. ఆమె ఓపెన్ మైండెడ్ అని మనకు అర్థమవుతుంది. అయితే తాజాగా ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కాస్త సరదాగా గడిపింది. ఆస్క్ మీ సెషన్ లో భాగంగా ఆమె అభిమానులు మరియు నేటిజన్లు అడిగిన పలు విషయాలకు తన దైన శైలిలో సమాధానాలు తెలియపరచింది. అందులో భాగంగానే అందరూ అడిగే ప్రశ్నలకు చక చకా జవాబులు చెబుతుండగా ఒక నెటీజన్ చిన్న వయసులో ఎలాంటి జాబ్ చేయాలనుకునేవారు అని అడగ్గా శృతిహాసన్ షాకింగ్ సమాధానాన్ని వెల్లడించింది.
అందులో భాగంగానే బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా చేయాలని ఉండేది తనకు చిన్నప్పుడు అలాంటి ఆలోచనలే వచ్చే అని ఆమె తెలిపింది. మరొక నెటీజన్ వెంటనే నీ పెళ్ళెప్పుడు అని అడగ్గా అందుకు శృతిహాసన్ (Shruti Haasan Comments) బోరింగ్ కొచ్చిన్ అంటూ అందుకు రిప్లై ఇచ్చింది. ఇక మరొకరు నేను టాటూ వేయించుకోవడం ఇష్టమా అంటూ అడగ్గా శృతిహాసన్ ఇష్టం కాదు పిచ్చి. అందుకే కదా నా 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే నేను మొదటి టాటా వేయించుకున్నాను. ఒకవేళ నేను నటిని కాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒళ్లంతా టాటలు వేయించుకునే దానితో చెప్పుకొచ్చిందిశ దీంతో ఆమె మాట్లాడిన మాటలు ఒక్క సారిగా వైరల్ గా మారిపోయాయి. అమ్మో శృతిహాసన్ కి టాటూలు అంట ఇంత పిచ్చా నటి కాకపోయి ఉంటే ఒళ్లంతా టాటూ లేపించుకునేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్..