Home Cinema Shraddha Das: యాంకర్ ప్రదీప్ ఫై తనకున్న ప్రేమను తెలియచేసిన శ్రద్ధ దాస్..

Shraddha Das: యాంకర్ ప్రదీప్ ఫై తనకున్న ప్రేమను తెలియచేసిన శ్రద్ధ దాస్..

Shraddha Das: ముంబైలో పుట్టినప్పటికీ అమ్మడికి మాత్రం టాలీవుడ్లో బోల్డ్ బ్యూటీ అనే పేరు వచ్చింది. ప్రస్తుదానికి మాత్రం బుల్లితెర పైన యాంకర్ గా వ్యవహరిస్తూ పాపులారిటీ సంపాదించుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ యాంకర్ ప్రదీప్ పై తనకున్న క్రష్ బయటపెట్టింది. మరి క్రష్ భవిష్యత్తులో ఎలా మారబోతుందో ప్రేక్షకులను ఆలోచనలోకి నెట్టేస్తుంది ముద్దుగుమ్మ. తాజాగా డాన్స్ డి-15 స్టేజిపై ప్రదీప్ తో కలిసి చిందులేసింది.
shraddha-das-expressed-her-love-towards-telugu-anchor-pradeep-machiraju

ఇక ప్రదీప్ యాంకర్ మేల్ కేటగిరిలో టాప్ యాంకర్ అలాగే బుల్లితెర సూపర్ స్టార్, ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో అమ్మాయిల రాజకుమారుడిగా పేరు పొందాడు. ఈ ఎనర్జిటిక్ యాంకర్ చాలా షోలకు తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. డి-15 ఛాంపియన్షిప్ బాటిల్ షోకు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. తన చలాకి మాటలతో చాకచక్యంగా పంచులేసే జబర్దస్త్ ఆదికే కౌంటర్లు వేస్తున్నాడు ప్రదీప్.

See also  Adipurush : ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ సంచలన నిర్ణయం.. అదే జరిగితే ఉరేసుకోవడమే అంటున్నారు!

shraddha-das-expressed-her-love-towards-telugu-anchor-pradeep-machiraju

ఇక డి-15 షో కి జడ్జీలుగా శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ మరియు శ్రద్ధదాస్ లు వ్యవహరిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోకి ప్రత్యేక ఆకర్షణ ఏదైనా ఉందంటే అది యాంకర్ ప్రదీప్- శ్రద్దా డాన్స్ కం క్రష్ గురించి చెప్పడమే. స్వయంగా శ్రద్ధదాస్ యాంకర్ ప్రదీప్ పై తనకు గతంలో చిన్న క్రష్ ఉందని చెప్పింది. అయితే ఈ క్రష్ భవిష్యత్తులో ఎంత దూరం వెళ్తుందో మాత్రం చెప్పలేనని బాంబు పేల్చేసింది.

See also  Pranathi-NTR: ప్రణతికి ఆ విషయంలో ఎన్టీఆర్ అంటే అంత కోపమా.? నిత్యం గొడవ పడుతూనే ఉంటున్నారా ఇప్పటికీ..

దాంతో మీరిద్దరిలాగే సంతోషంగా ఉండాలని శేఖర్ మాస్టర్ నవ్వులు పోయించాడు. అనంతరం ప్రదీప్-శ్రద్దా కలిసి స్టేజిపై రొమాంటిక్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక శ్రద్దా తన హాట్ హాట్ అందాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది.