Home Cinema Pawan Kalyan: ఆ ఒక్క మాట అప్పుడే చెప్పి ఉంటే ఆనాడే పవన్ కళ్యాణ్ జైలు...

Pawan Kalyan: ఆ ఒక్క మాట అప్పుడే చెప్పి ఉంటే ఆనాడే పవన్ కళ్యాణ్ జైలు పాలయ్యేవాడు.. రేణుదేశాయ్ సంచలనమైన విషయాలు వెల్లడి..

Shocking Post By Renu Desai: సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ న్యూస్ వచ్చిందంటే ఏదో ఒక విషయం రేణు దేశాయ్ ప్రస్తావన కూడా తప్పకుండా ఉంటుంది. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అనే విషయం.. కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు అలాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి మధ్య ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రస్తుత విషయానికొస్తే ఆకిరా నందన్ బర్త్ డే రోజు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులపై రేణుదేశాయి భగ్గుమన్నది.

See also  Janhvi Kapoor : జాన్వీ కపూర్ మెగా ఫ్యామిలీ మీద కన్నేయడమే కాకుండా ఎంత పని చేసిందంటే..

shocking-post-by-renu-desai-about-her-divorce-from-pawan-kalyan

ఇక ఆ విషయమే కాకుండా తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియా వేదిక మొదటిసారి ఆమె విడాకులకు సంబంధించిన ఓ పోస్టు పెట్టింది. ఆమె పెట్టిన ఆ పోస్ట్ లో ఏమని ఉంది అంటే.. సోషల్ అవేర్నెస్ అండ్ యాక్టివిటీల గురించి మాట్లాడే కృష్ణకుమారి ప్రస్తుత సమాజంలో విడాకులు తీసుకున్న ఆడవాళ్లే ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు అనే కోణంలో మాట్లాడుతూ రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ల గురించి ప్రస్తావన లేవనెత్తింది. ఇక ఆ వీడియోలో ఎవరైనా ఒక జంట విడాకులు తీసుకుంటే మాత్రం కచ్చితంగా ఆ జంటలో మొదటగా విమర్శించేది ఆడవారిని అని తెలిపింది.

shocking-post-by-renu-desai-about-her-divorce-from-pawan-kalyan

ఆమె చెప్పినట్లే అచ్చం వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత అందరూ ఎక్కువగా విమర్శించింది రేణు దేశాయ్ నే.. ఒకవేళ అకిరా నందన్ పవన్ కళ్యాణ్ కి సహజననం వల్ల జన్మించలేదు.. ఏ చర్చి లోనో, ఏ గుడిలోనో పవన్ కళ్యాణ్ తనను వివాహం చేసుకున్నాడన్న విషయాన్ని నేను అప్పుడే చెప్పినట్లయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ జైల్లో ఉండేవాడు అని చెబుతూ వాళ్ళ విడాకులపై సంచలమైన విషయాలు వెల్లడించింది రేణు దేశాయ్. అయితే కృష్ణకుమారి అనే సోషల్ యాక్టివిటీస్ గురించి ఎక్కువ మాట్లాడే ఆమె మాట్లాడిన ఆ వీడియోని రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

See also  RRR OSCAR: ఆస్కార్ స్పెషల్.. తెలుగు చరిత్రలో మరో అద్భుత ఘట్టం.!! అభిమానుల కోరిక తిర్చనున్న రాజమౌళి..??

shocking-post-by-renu-desai-about-her-divorce-from-pawan-kalyan

తనెవరో నాకు తెలియదు కానీ ఆమె మాట్లాడే విషయాలు మాత్రం నా గురించే మాట్లాడుతున్నట్టు ఉంది. ఇదే కాక నేను ఎక్కడైనా నోరు విప్పి మాట్లాడదామంటే నన్ను ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయి ఇలా లేనిపోని వాక్యాలు పవన్ కళ్యాణ్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అని రాస్తారు. అందువల్లే నేను ఇంతవరకు ఏ రోజు ఏనాడు నోరు తెరవలేదు. కానీ ఈ వీడియో చూశాక నాకు మొట్టమొదటిసారి కన్నీళ్లు ఆగలేదు. ఎందుకంటే నన్ను కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం నాలో కలిగింది. అంటూ రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త (Shocking Post By Renu Desai) కాస్త నెట్టింట వైరల్ గా మారింది చెక్కర్లు కొడుతుంది..