Home Cinema Shobita Dhulipala: అక్కినేని ఇంటికి కోడలవ్వాలంటే సమంతలా శోభితకు అలాంటి కండీషన్ నాగార్జున పెట్టాడా.?

Shobita Dhulipala: అక్కినేని ఇంటికి కోడలవ్వాలంటే సమంతలా శోభితకు అలాంటి కండీషన్ నాగార్జున పెట్టాడా.?

Shobita Dhulipala: అక్కినేని కుటుంబం గురించి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ అవుతుందో మనమంతా ప్రతీ రోజు వింటూనే ఉన్నాము. అక్కినేని నాగేశ్వర్రావు మనవడుగా, అక్కినేని నాగార్జున కొడుకుగా తెలుగు సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య ఏం మాయ చేసావే చిత్రంతో తన ఖాతాలో సూపర్ హిట్ మూవీని వేసుకున్నాడు. ఆ తర్వాత తనకు సెటయ్యే చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ఇండస్ర్టీలో నిలదొక్కుకుంటూ వస్తున్నాడు నాగ చైతన్య. అలాంటి చైతు తన చిత్రం ఏం మాయ చేసావే చిత్రంతో పరిచయమైన సమంతతో ప్రేమలో పడి దాదాపు పది సంవత్సరాలు వీళ్ళిద్దరు ప్రేమించుకుని ఆ తర్వాత వివాహం చేసుకున్నారు.

See also  Mega Family : మెగా కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇదే..

shobita-dhulipala-gets-new-conditions-from-akkineni-family-to-marry-naga-chaitanya

వీళ్ళి పెళ్ళి పట్టుమంటే కనీసం నాలుగేళ్ళైన నిలువకుండానే మనస్పర్ధలతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎవ్వరి దారి వారిదన్నట్టు చూసుకుంటూ వారి భవిష్యత్తు మీద ఫోకస్ పెట్డారు. ముఖ్యంగా సమంత స్థోమతకు చేయలేని చిత్రాలను కూడా సైన్ చేస్తుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇక చైతు తన తదుపరి విడుదల అవ్వబోయే కస్టడి తో హిట్ కొట్టడానికి ఎదురు చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగానే మరొక వార్త శోభిత దూళిపాల తో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలను నిజం చేస్తున్నట్లు ఈ జంట ఎక్కడ పడితే అక్కడ కెమరా కంట పడుతుండడం తో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది గీ ముచ్చట..

See also  Rajamouli : రాజమౌళి ఆధ్యాత్మిక టూర్ వేయడానికి అసలు కారణం అదా.. ఇక సంచలనమే..

shobita-dhulipala-gets-new-conditions-from-akkineni-family-to-marry-naga-chaitanya

ఆ మధ్య లండన్ లో ఓ ప్రముఖ హోటల్లో వీళ్ళిద్దరు ఉండడం పై పెద్ద దుమారమే చెలరేగింది సోషల్ మీడియాలో.. ఇప్పుడు ఆ వార్త కంటే మరొక సంచలనమైన వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియా అంతటా.. నాగ చైతన్యను వివాహం చేసుకోవాలంటే శోభిత దూళిపాలకు అక్కినేని నాగార్జున ఓ కండీషన్ పెట్టాడట. మనందరికీ తెలిసిన విషయమే గతంలో సమంత విషయంలో జరిగిందే.. చైతుతో వివాహం అయిన తర్వాత సమంతను సినిమాల్లో నటించకూడదన్న రిస్ర్టిక్షన్ పెట్టాడని.. అందుకే సామ్ చైతుకి విడాకులు ఇచ్చిందని ఎన్నో రకాళ వార్తలు వినిపించాయి. అదే విధంగా సేమ్ టూ సేమ్ శోభిత దూళిపాల విషయంలో కూడా అక్కినేని నాగార్జున అదే రిస్ర్టిక్షన్ పెట్టాడంట.

See also  Mahesh Babu : వరల్డ్ కప్ మిస్ అవ్వడానికి కారణం మహేష్ బాబు అంట.. అర్ధం లేని లాజిక్స్..

shobita-dhulipala-gets-new-conditions-from-akkineni-family-to-marry-naga-chaitanya

అక్కినేని కుటుంబానికి కోడలుగా రావాలంటే ఖచ్చితంగా సినిమాల్లో నటించకూడదు అనే కండీషన్ పెట్టాడట నాగార్జున. ఈ విషయం నాగార్జున తెలియజేయడంతో శోభిత దూళిపాల సైతం షాక్ కు గురయ్యిందంట. అక్కినేని ఇంటికి కోడలు అవ్వడానికి నాగ చైతన్య కోసం తను సినిమాలను సైతం వదులుకోవడానికి సిద్దంగా ఉందట. దీంతో త్వరలో అక్కినేని ఇంట భాజా భజంత్రీలు మోగనున్నట్లు సమాచారం. ఇక శోభిత (Shobita Dhulipala) గురించి మనందరికీ తెలిసిన విషయమే మిస్ ఇండియా లో రెండవ స్థానం కైవసం చేసుకుంది. టాలీవుడ్ లో గూఢాచారి, మేజర్, పొన్నియల్ సెల్వన్-1, అలాగే 2 చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించింది.