Vaishnavi Chaitanya Love: ఇటీవలే వైష్ణవి చైతన్య నటించిన బేబీ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఇండస్ట్రీ లో ప్రస్తుతం బేబీ చిత్రంలో హీరోయిన్ గా చేసినటువంటి ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య పేరు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ చిత్రంలో తన నటనతో అతరగొట్టిందనే చెప్పాలి. పైగా బోల్డ్ పాత్రలో తన తొలి చిత్రంలోనే నటించేసరికి ఒక్క సారిగా వైష్ణవి చైతన్య పేరు విపరీతంగా వైరల్ అయింది.. ఇక వైష్ణవి చైతన్య గురించి పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం మాట్లాడుకోవడం ఆమె నటనకు ప్రశంసలు కురిపియడంతో ఒక్క సారిగా ఫేమస్ అయ్యింది. కానీ తొలి చిత్రంతోనే ఇంత బోల్డ్ గా నటించేసరికి ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం లేదంటూ ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంలో ఎలాంటి బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిందో మనందరం చూసాం. ఇక ఇదే కాకుండా కుమారి 21 చిత్రంలో కూడా హెబ్బా పటేల్ పరిస్థితి అంతే జరిగింది.
అందుకే ఇప్పుడు ఈ హీరోయిన్ పరిస్థితి కూడా ఇలాగే అవుతుందని కొందరు మాట్లాడుకుంటున్నారట. మరి చూద్దాం తర్వాత పరిస్థితి ఎలా ఉంటాయో ఏ విధంగా జరుగుతుందో.. కానీ ప్రస్తుతం అయితే వైష్ణవి చైతన్య గురించి నెట్టింట ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక మనందరికీ తెలిసిందే వైష్ణవి చైతన్య ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ కారణం. ఇక ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అవడంతో వైష్ణవి చైతన్యకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడమే కాకుండా సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. అయితే ఈ వెబ్ సిరీస్ చేయడం వల్లే వైష్ణవి చైతన్య లవ్ బ్రేకప్ అయ్యిందట అందుకు సంబంధించిన తాజా వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి అసలు విషయం ఏంటి అని ఆరా తీస్తే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన మెహబూబ్ దిల్సే అందరికీ తెలిసే ఉంటుంది.
కొన్ని డబ్స్మాష్ వీడియో ద్వారా ఫేమస్ అయ్యి యూట్యూబర్ గా మారిపోయాడు ఇతడు. ఇదే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు. అయితే మొదట్లో వైష్ణవి చైతన్య కూడా డస్మాష్ వీడియోలు తీసు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేసరికి వైష్ణవి తన షార్ట్ ఫిలింలో వెబ్ సిరీస్ లో ఆమెతో కలిసి కొన్ని కవర్ సాంగ్స్ లో ఇలా ఇద్దరు కలిసి రకరకాల ప్రయోగాలు చేశారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ఏదో బంధం ఏర్పడిందని ఇదే కాకుండా ఎమ్మెలన్సీ కంపెనీలో వైష్ణవి చైతన్యకి అవకాశం కూడా ఇప్పించాడట..
ఇక వైష్ణవి చైతన్యతో విపరీతంగా రాసుకుపోసుకు తిరుగుతూ క్లోజ్ గా ఉండేసరికి మహబూబ్ కి సైతం వైష్ణవి మీద విపరీతమైన ప్రేమ (Vaishnavi Chaitanya Love) పెరిగిందట. కానీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లో షణ్ముఖంతో కలిసి నటించిన అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య దూరం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ బంధం అక్కడితో కట్ అయిపోయింది అంట. అలా ఆ వెబ్ సిరీస్ తర్వాత ఎక్కువగా షణ్ముక్ తో తిరగడం వల్ల మెహబూబ్ చైతన్యలకి ఉన్న ఆ క్లోజ్ నెస్ అయితే ఉందో అది తెగిపోయిందట. ఇక ఈ విషయం ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవ్వడంతో షణ్ముఖ్ జస్వంత్ వల్లనే వైష్ణవి చైతన్య మేము బ్రేకప్ అయిందా అయ్యో ఎంత పాపం జరిగిపోయింది అంటూ కొందరు ఈ వార్త వైరల్ చేస్తుండగా.. మరికొందరు వైష్ణవి అభిమానులు షణ్ముక్ తో నటించడం వల్లే కదా సాఫ్ట్వేర్ డెవలపర్ అంత ఫేమస్ అయ్యి వైష్ణవి చైతన్య కు బేబీ చిత్రంలో అవకాశం లభించింది అంటూ ఆమెకు సపోర్టుగా దాసు పలుకుతూ కామెంట్లు రాస్తున్నారు.