Highest Remuneration Hero : ఏదైనా సినిమా తియ్యాలని అనుకుంటే మొదట బడ్జెట్ ఆలోచిస్తారు. ఆ బడ్జెట్ లో కీలకమైన పాత్ర నటీనటుల రెమ్యూనిరేషన్ ఉంటాది. ఇంతకుముందు హైయెస్ట్ రెమ్యూనిరేషన్స్ ఎకువలుగా బాలీవుడ్ లోనే తీసుకునేవారు. అందుకే అన్ని బాషల వాళ్ళు నిమ్మదిగా బాలీవుడ్ కి ( Highest Remuneration Hero ) చేరాలని కోరుకునేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి ఏమి లేదు. మన తెలుగు హీరోలు ఏమి తక్కువ వారు కాదు.. ప్రభాస్, రామ్ చరణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వీళ్లంతా సినిమాకి 100 కోట్లు దగ్గర తీసుకుంటున్నారని టాక్ ఉంది. కాబట్టి రెమ్యునిరేషన్ కోసం వేరే భాషలో నటించే బాధ లేకుండా వీళ్ళు నటించే సినిమానే అన్ని భాషలు వాళ్ళు చూసి..
ఇక్కడ నుంచే ఎక్కువ రెమ్యునిరేషన్ తీసుకునేలా బాహుబలి సినిమాతో జక్కన్న చేసాడు. సినిమా అన్నాక తీసేవాళ్ళు ఒకటి నిర్ణయించుకోవాలి. అదేమిటంటే.. ఎంత మంచి సినిమా, ఎంత బడ్జెట్ పెట్టి తీసినా కూడా ఆ సినిమా ప్రేక్షకుడికి ఎక్కితే.. సూపర్ హిట్ అవుతాది. ప్రేక్షకుడికి నచ్చకపోతే .. ఆ సినిమాని ఇంక ఫ్లాప్ ( Highest Remuneration Hero ) నుంచి తప్పించడం ఎవ్వరి తరం కాదు. అలాగే హీరోలు కూడా కొడితే లైన్ గా సూపర్ హిట్స్ కొట్టి స్టార్ హీరోలుగా వెలుగుతారు. టైం బాగోకపోతే.. ఎన్ని మంచి సినిమాలు చేసినా హిట్ కొట్టలేరు . అలాంటి టైం లో భయపడకూడదు సరి కదా బాధ అస్సలు పడకూడదు.
ఒక హీరోకి ఐదేళ్ల నుంచి సరైన సినిమా లేకపోయినా.. మళ్ళి ఒక్క సినిమాతో అందరి హీరోలని దాటి.. అందరి హీరోలు కంటే హైయెస్ట్ రెమ్యూనిరేషన్లో ఉన్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరని అనుకుంటున్నారా? ఎవరో కాదు.. మన బాలీవుడ్ బాద్ షా షారుఖాన్. ఇంచుమించు 5 ఏళ్ళ గ్యాప్ ( Highest Remuneration Hero ) తర్వాత ఇటీవల షారుక్ఖాన్ నటించిన సినిమా పఠాన్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఒక్క సినిమాతో షారుఖ్ ఖాన్ రెమ్యునిరేషన్ విషయంలో అందరి హీరోలను దాటేశాడు. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ 200 కోట్ల రెమ్యునిరేషన్ హీరోగా పేరు పొందాడు. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో మళ్ళీ తన ఫేమ్ ని హైప్ లోకి తీసుకెల్తూ రీ ఎంట్రీ ఇచ్చాడు షారుఖ్ ఖాన్.
కేవలం తన క్రేజ్ ని చూపించడం మాత్రమే కాకుండా.. ఏకంగా అందరి హీరోలకంటే ఎక్కువ రెమ్యునిరేషన్ తీసుకున్న హీరోగా నిలిచాడు. ఇంతకీ పఠాన్ సినిమాకి మొదట షారుఖ్ ఖాన్ అసలు రెమ్యునిరేషన్ తీసుకోలేదట. సినిమా రిలీజ్ ఆయిన తరవాత లాభాలు వస్తే.. అందులో షేర్ ఇమ్మని అడిగాడట. మరి ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు బద్దలగొట్టిందో మనకి తెలుసు. పఠాన్ సినిమాకి షారుఖ్ ఖాన్ వాటా 200 కోట్ల రూపాయలు వచ్చిందట. ఇంతవరకు ఏ హీరో కూడా ఇంత రెమ్యునిరేషన్ తీసుకోలేదంట. మొత్తం మీద 60 దగ్గరకు వయసు వస్తున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు అందర్నీ దాటించి ఫస్ట్ స్థానంలో నిలబడ్డదంటే అది గ్రేట్ అని ఒప్పుకోవాలి.