Home Cinema Big Boss: రెండవ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రాబోతున్న హాట్...

Big Boss: రెండవ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రాబోతున్న హాట్ బ్యూటీ ఈమెనే..

serial-actress-jyothi-rai-to-enter-big-boss-8-as-wild-card-entry

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఇంతకు ముందు సీజన్ లాగా లేదు. ప్రోమోలో చెప్పినట్టుగానే అంతా కొత్తకొత్తగా ఉంది. ఈ సీజన్ లో కెప్టెన్సీ లేరు, ప్రైజ్ మనీ లేదు, రేషన్ కూడా లేదట. కెప్టెన్సీ కి బదులుగా ఈసారి చీఫ్స్ ఉంటారు, అలాగే ప్రైజ్ మనీ కి బదులుగా పే మనీ ఉంటుంది. అంటే ప్రతీ వారం కంటెస్టెంట్స్ ఆడి గెలుచుకోవాలి. వాళ్ళ ఆట తీరుని బట్టి పే మనీ పెరుగుతూ ఉంటుంది. అది 50 లక్షల దగ్గర ఆగొచ్చు, కోటి రూపాయిల దాకా కూడా వెళ్లొచ్చు(Big Boss Jyothi Rai). ఇక చివరిగా రేషన్, ఇది కూడా టాస్కులు ఆడి గెలవాల్సిందే.

See also  Nitya Menon : ఊహించని సడన్ దుఃఖంలో నిత్యామీనన్..

అయితే ఈ సీజన్ లో టాస్కుల కంటే ఎక్కువగా గొడవలే ఉన్నట్టుగా అనిపించింది. మొదటి వారంలో కంటెస్టెంట్స్ ఎన్ని టాస్కులు ఆడారు అంటే టక్కుమని చెప్పలేని పరిస్థితి, అదే ఎలాంటి గొడవలు జరిగాయో చెప్పమంటే చెప్పేస్తాము, దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు టాస్కులు ఆడియన్స్ లోకి సరిగా వెళ్లలేదని. ఇదంతా పక్కన పెడితే మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుండి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమెని ఎలిమినేట్ చేయగానే, మరో కంటెస్టెంట్ ని వైల్డ్ కార్డు(Big Boss Jyothi Rai) ఎంట్రీ ద్వారా లోపలకు పంపుతారు, అది కూడా మొదటి వారంలోనే జరుగుతుంది అని అందరూ అనుకున్నారు.

See also  Niharika divorce : నిహారికాకి విడాకులు ఇప్పించిన వ్యక్తిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కానీ అది జరగలేదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా జ్యోతి రాయ్ అడుగుపెడుతుందనే వార్త కూడా వినిపించింది. కానీ అది జరగలేదు, వచ్చే వారం అయినా ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వస్తుందో లేదో చూడాలి. ఇంతకీ ఈ జ్యోతి రాయ్ ఎవరంటే స్టార్ మా ఛానల్ లో టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోయిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో జగతి అనే తల్లి పాత్ర పోషించిన అమ్మాయి.

See also  Renu Desai : చాన్నాళ్లకు అతని.. ప్రేమలో పడి ప్రత్యేకమైన అనుభూతిని పొందానంటున్న రేణుదేశాయ్..

చూసేందుకు ఎంతో అందంగా కనిపించే జ్యోతి రాయ్, అంత చిన్న వయస్సులో తల్లి పాత్ర చేసి మెప్పించింది అంటే సాధారమైన విషయం కాదు కదా, ఈమె ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ని తెరిచి చూస్తే స్టార్ హీరోయిన్స్ కూడా ఈమె అందం ముందు పనికిరారు అనిపిస్తాది. అలాంటి అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే, ఆమె గేమ్ బాగా ఆడినా, ఆడకపోయినా టాప్ 5 వరకు తీసుకొచ్చేస్తారు మన తెలుగు ఆడియన్స్. మరి ఆడియన్స్ ఈమె పై పెట్టుకున్న అంచనాలను రీచ్ అవుతుందా లేదా అనేది భవిష్యత్తులో చూడాలి.