Sensational comments on Natu Natu Song and Keeravani: నాటు నాటు అనే పాట వింటే తెలుగు వాడే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని భాషలవారు డాన్స్ వేసే రేంజ్ కి ఆ పాట వెళ్ళింది. ఆ పాటతో పాటు మన తెలుగు వారి ఖ్యాతిని అలా ప్రపంచంలోకి తీసుకుని వెళ్లిన ఘనులు ఆర్ఆర్ఆర్ టీమ్. అందుకే యావత్ భారతదేశం ఈ టీం ని కొనియాడతుంది. తెలుగువారిని అభినందనలతో ప్రపంచం ముంచెత్తుతుంది. ఇలాంటి గడియాలు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాయో ఊహించలేము కూడా. కొన్ని తరాలు ఇలాంటి ఆనందాన్ని వినకుండా, చూడకుండా కూడా వెళ్ళిపోయి ఉంటాయి. నాటు నాటు పాట లో ఎన్నో చెప్పుకోతగ్గవి ఉన్నాయి. ఆ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణికి, పాట రాసిన చంద్రబోసు అవార్డు తీసుకుంటుంటే, ఆర్ఆర్ఆర్ టీం కి వచ్చిన కన్నీటి బాష్పాలు ప్రతీ తెలుగువాడు ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు.
నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అనే కల నిజమై మన సినిమా రంగాన్ని పలకరించింది. దీని పై ప్రతీ సెలబ్రెటీ, ప్రధానితో సహా అందరూ కొనియాడారు. రాజ్యసభలో ఈ సినిమా గురించి ఈ టీం గురించి ఎంతో కొనియాడుతూ మాట్లాడారు. అంతటి పురస్కారాన్ని ఈ సినిమాకి తెప్పించిన రాజమౌళి నిజంగా గొప్పవాడు అనే మాట చాలా చిన్నది అయిపోతాది. నాటు నాటు సాంగ్ కి ఇంతటి అవార్డు దొరికిన సందర్భంలో, ఆ పాట తో లింక్ ఉన్న ప్రతీ ఒక్కరూ గర్వంగా, ఆనందంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంతో ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గారు కూడా కొడుకు సక్సెస్ ని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు.
నాటు నాటు పాటకి ( Sensational comments on Natu Natu Song and Keeravani ) అవార్డు రావడం గురించి శివశక్తి దత్తా మాట్లాడుతూ.. అసలు నాటు నాటు అనే పాట ఒక పాటేనా? నాకు అయితే నచ్చలేదు. ఈ పాటలో మ్యూజిక్ ఎక్కడ ఉంది? చంద్రబోస్ రాసిన 5 వేల పాటల్లో ఇదొక పాటా? కీరవాణి ఇచ్చిన సంగీతంలో ఇదొక మ్యూజికేనా? ఏమాటకామాటే.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది. అంతేకాదు తారక్, చరణ్ డ్యాన్స్ మహా అద్భుతం. వీళ్ల కృషి వల్ల ఆస్కార్ దక్కడం గర్వించదగ్గ విషయం. కీరవాణి నా పంచప్రాణాలు. మూడో ఏట నుంచే అతడికి సంగీతం నేర్పాను. తన టాలెంట్ చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను.ఇన్నాళ్లూ అతడు చేసిన కృషికి ఈ రూపంలో ఫలితం వచ్చిందని శివశక్తి దత్తా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..
నాకు సినిమా అంటే ప్యాషన్. మేము నలుగురు అన్నదమ్ములం. మేమంతా తుంగభద్ర ఏరియాకు వలస వెళ్లాం. అక్కడ 16 సంవత్సరాలు ఉండి, 300 ఎకరాలు కొన్నాను. కానీ సినిమా కోసం భూమినంతా అమ్మేసుకున్నాము. చివరికి రోజు గడవడం చాల కష్టం అయ్యే పరిస్థితికి కూడా వచ్చాము. అలాంటి సమయంలో కీరవాణి చక్రవర్తి దగ్గర పని చేస్తే వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది. ఆ తరువాత విజయేంద్రప్రసాద్, నేను కలిసి మంచి మంచి కథలు రాశాం. జానకిరాముడు, కొండవీటి సింహం.. ఇలా ఎన్నో హిట్ సినిమాలకు మేము పని చేశాం అంటూ ఆయన అందంతో జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు.