
NTR : ఎన్టీఆర్ అనే పదమే ఒక వైబ్రేషన్.. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ గా కీర్తించబడిన నందమూరి తారకరామ రావు తెలుగు సినీ ప్రపంచానికి ఆదిపురుషుడుగా చెప్పవచ్చును. ఆయన పోషించిన అనేక పౌరాణిక, జానపద, సామాజిక ( Senior NTR called that star hero ) సినిమాలు అన్నీ ఆయా జోనర్ లలో ట్రెండ్ సెట్టర్ అయ్యాయి. ముఖ్యంగా పౌరాణికంగా ఆయన నటించిన కృష్ణుడు , రాముడు, రావణడు , కర్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, ఈశ్వరుడు,భీముడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇతిహాసాల్లో ఉండే ప్రధానమైన ఆల్మోస్ట్ అన్నీ క్యారెక్టర్స్ ఆయన పోషించాడు. ఆక్యారక్టర్ వేయడమో, మెప్పించడమో పక్కన పెడితే, ఎన్టీఆర్ వేసిన ఆయా క్యారక్టర్ లో నిజమైన దేవుడ్ని తెలుగు ప్రజలు చూసుకున్నారు.
రాముడు, కృష్ణుడు అంటే అచ్చం రామారావు లాగే ఉంటాడేమో అనే నిర్ధారణకు తెలుగు ప్రజలు అనేకమంది వచ్చేశారు. కృష్ణుడిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఢిల్లీ లో సైతం పెడితే.. కృష్ణుడి రూపాన్ని ఇంత అందగా ఎప్పుడూ చూడలేదు , ఎవరు దీన్ని నిర్మించిందని ఆరాలు తీస్తే.. ఆది పెయింటింగ్ కాదు మనిషి అని తెలిసి ( Senior NTR called that star hero ) ఆశ్చర్యపోయారు అంట. తెలుగు నాట దేవుడిలా కీర్తించబడుతున్న తరుణంలోనే ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీ పెట్టి కేవలం 13 నెలలలోనే అధికారం చెప్పటడమే కాకుండా రికార్డు మెజార్టీ సైతం సొంతం చేసుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే సహచర మంత్రి అయిన నాదెండ్ల భాస్కర రావు చేతిలో వెన్నుపోటుకిగురై పదవికోల్పోయాడు.
మళ్లీ ఫైట్ చేసి తన ముఖ్యమంత్రి పదవి తిరిగిపొందాడు ఎన్టీఆర్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సినీ ఇండస్ట్రీ లో ఎంతో అన్యోన్యంగా ఉన్న అనేకమంది తన సహచరులు ఆయనకు దూరం అయ్యారు. అందులో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. కృష్ణ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు సైతం తీసి బహిరంగ శతృత్వానికి నాంది పలికాడు. కృష్ణ తో పాటు అనేక మంది సినిమా వాళ్లు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా పనిచేశారు. తెలుగు ( Senior NTR called that star hero ) సినిమాకి ఎన్టీఆర్ ఆదిపురుషుడు అయితే , నాగేశ్వర రావు రెండో వాడిగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తరువాత అంతటి ఘనకీర్తి తెచ్చుకునింది ఒక్క నాగేశ్వరావు గారే. ఎన్టీఆర్ , నాగేశ్వర రావు గారు కలసి వారి కాంబినేషన్లో మల్టీ స్టార్స్ గా వాళ్లు చేసినన్ని సినిమాలు మరెవరు చేయలేదు. ఇద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నా , ఫాన్స్ కి మధ్య విపరీతంగా గొడవలు ఉన్నా వీరు ఇద్దారూ మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు .
దివిసీమలో కనీ వినని ఉప్పెన వస్తే ప్రజల సహాయార్ధం NTR, ANR ఆప్రాంతానికి వస్తే ఇద్దరూ కలసి ఉన్న పోస్టర్ మీద ఇద్దరి పేస్ లకి పేడ కొట్టి ఉంది అంట. కానీ ఇద్దరూ నవ్వుకుని వచ్చారని ANR అనేక ఇంటర్వూస్ చెప్పారు. ఇలా ఉన్న వీరి స్నేహంలో లేని పోనీ అబద్దాలు ఎన్టీఆర్ కి ANR మీద చెప్పి ఇద్దరికీ కాకూండా చేశారు అంట. ఇందులో ANR , NTR కి వ్యతిరేకంగా ఒక చర్య కూడా చేయలేదు అంట. చివరి దశలో ఇవన్నీ తెల్సుకున్న ఎన్టీఆర్ ANR కి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పి, తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు అంట , ANR కూడా వెళ్లడానికి సిద్ధపడ్డారు అంట.. కానీ అంతలోనే ఎన్టీఆర్ చనిపోయారని వార్త వచ్చిందంట. ఇదంతా రచయితి అయిన కృష్ణ కుమారి ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. ఈ ఎపిసోడ్ మొత్తం నాగేశ్వర రావు గారు తన పర్సనల్ డైరీ లో రాసుకున్నారని అనికూడా ఆమె చెప్పారు.