Cine Industry: ఆమని మాతృభాష కన్నడం పుట్టింది బెంగళూరులో, దివంగత నటి అయినటువంటి సౌందర్య కి చాలా మంచి స్నేహితురాలు ఆమని. సౌందర్యలాగే ఆమని కూడా మంచి సినీ నటి. తెలుగులో శుభలగ్నం-శుభసంకల్పం-మావిచిగురు లాంటి ఎన్నో క్లాసికల్ సినిమాల్లో తాను నటించింది. ముఖ్యంగా కె.విశ్వనాథ్ లాంటి దిగ్గజ దర్శక మహా శయులతో నటించిన ఘనత ఆమెకే దక్కింది.
అలా దశాబ్దాల కెరియర్ లో ఆమె తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటులందరితో నటించారు. ముఖ్యంగా ఇల్లాలి పాత్రలు చేయడంలో ఆమెకు ఆమె సాటి అయిన ఆమనిని తెలుగు అభిమానులు బాగా ఇష్టపడతారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన ఆమని ప్రస్తుతం సెకండ్ ఇన్నిస్లో మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. మరోవైపు టీవీ షో లలో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తుంది.
సినిమాల్లో కంటే టీవీ కాన్సెప్ట్లలో ఆమెకు మంచి పాపులారిటీ దక్కుతుంది. ఐతే ఆమె కెరియర్ (Cine Industry) తొలినాళ్లలో సినిమా అవకాశాల కోసం తిరగని ఆఫీసు లేదు అయితే తాను ఎక్కడికి వెళ్లినా కూడా ఆమని వాళ్ళ అమ్మను తన వెంట తీసుకువెళ్లేదట. ఆమని వాళ్ళ అమ్మ తన వెంట ఉండడం కొందరికి నచ్చేది కాదట. దీంతో కొంతమంది దర్శక నిర్మాతలు మీ అమ్మను తీసుకురాకుండా నువ్వే ఒంటరిగా రమ్మని చెప్పేవారట. దాంతో వాళ్ళు చెప్పిన దురుద్దేశం ఆమనికి అర్థమయ్యి వాళ్లకు ధీటుగా సమాధానం ఇచ్చేదట.
అమ్మ లేకుండా నేను రానని ముఖం మీదనే చెప్పేదట, ఇలా కెరియర్ మొదట్లోనే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఆమెకు తెలిసేదంట.. ఆ తర్వాత నుంచి ఆమని చాలా జాగ్రత్తగా ఉండేదని తెలిపింది. తన కెరియర్ తొలినాలలో చెల్లి, కూతుర్ల పాత్రలు ఎక్కువగా వచ్చేవట. ఆమని చెల్లిగా నటిస్తే ఇక ఎప్పుడు అలాంటి పాత్రలే వస్తాయని అలాంటి పాత్రలు ఎంచుకోకుండా హీరోయిన్ పాత్రలకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ చెల్లి కూతురు పాత్రలను రిజెక్ట్ చేసిందంట. మెగాస్టార్ చిరంజీవి తో కూడా చెల్లి పాత్ర వేయాలన్న ఆఫర్ ఆమని కొచ్చిందంట కానీ ఆ ఆఫర్ను ఆమని రిజెక్ట్ చేసిందట.