Sarath Babu: విలక్షణమైన తెలుగు సినిమా నటుడు శరత్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఆయన మనందరికీ సుపరిచితమే.. సినిమా ప్రపంచంలో దాదాపు తెలుగు, తమిళ, కన్నడ, సినీ రంగాలలో 220 చిత్రాలకు పైగా ఈయన నటించిన ఈయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, ఓ తండ్రిగా, రకరకాలైనటువంటి విలక్షణ పాత్రల్లో పోషించాడు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్..వీరు 1951 వ సంవత్సరంలో జూలై 31న ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఆముదాలవలసలో జన్మించాడు. ఇక తను నటించిన తొలి చిత్రం రామరాజ్యం.
ఈ సినిమా 1973లో విడుదల అయింది. ఇక ఆ తరువాత తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి అక్కడ కూడా గొప్ప పేరు తెచ్చుకొని అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో ఏళ్ల పాటు వెండితెరపై సందడి చేసిన శరత్ బాబు (Sarath Babu) ఈ మధ్యకాలంలో అడపాదడపా చిత్రాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న ఆయన అనారోగ్యానికి గురయ్యాడని సమాచారం.. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి గత సంవత్సరం నుండి చిత్ర పరిశ్రమలో ఏమైందో తెలియదు వరుసగా అనారోగ్య పాలవుతూ అభిమానులకు చేదు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోతున్నారు.
చాలామంది అనారోగ్య కారణాల చేత మరణిస్తే, మరికొంతమంది వయసు వచ్చి వృద్ధాప్యం చేత మరణిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది సెలబ్రిటీలు అనారోగ్య పాలవుతూ హాస్పటల్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు అలాంటి వారిలో సీనియర్ నటుడు శరత్ బాబు కూడా.. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎంతోమంది సినీ పెద్దలు ఆయనను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఆయన నటించిన తొలి చిత్రం రామరాజ్యం తో తెలుగులో అడుగుపెట్టి.. ఆ తర్వాత కన్నడ మూవీలలో తమిళ, మలయాళ మూవీలలో నటించాడు. ఇక ఆ తర్వాత అమెరికా అమ్మాయి సినిమాలో నటించిన తర్వాత బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన చిలకమ్మ చెప్పింది అనే చిత్రంలో కూడా నటించారు.
మూడుసార్లు నంది అవార్డు, ఒకసారి ఉత్తమ సహాయక నటుడిగా అవార్డులు ఆయనను వరించాయి. వయసు పెరగడంతో వృద్ధాప్యం కు దారి తీయడంతో సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నాడు. దీంతో ఆయన ఆరోగ్యానికి గురవడంతో సినీ పెద్దలు ఆయన బాగుండాలని ఆ భగవంతున్ని ఆరాధిస్తున్నారు. ఇటీవలే కరాట కళ్యాణి కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నాకు ఇష్టమైన హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు (Sarath Babu) త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తాం అని పోస్ట్ చేసింది. ఇక తెలుగు ప్రజలే కాక యావత్ సినీ ప్రపంచం ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు.