Home Cinema Sarath Babu : శరత్ బాబు చివరి కోరిక తీరకపోవడానికి అసలు కారణం అదా!

Sarath Babu : శరత్ బాబు చివరి కోరిక తీరకపోవడానికి అసలు కారణం అదా!

Sarath Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు నటించి తెలుగు సినీ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న శరత్ బాబు మే 22వ తేదీ మంగళవారం నాడు కన్నుమూయడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినీ అభిమానులకి ఎంతో బాధ కలిగించింది. శరత్ బాబు ( Sarath Babu last wish ) ఎన్నో పాత్రలను ఎన్నో సినిమాలలో అలవోకగా నటించి.. ఆ పాత్రకి న్యాయం చేసిన గొప్ప నటుడు. ఆయన మరణించిన వార్త విని తెలుగు సినిమా ఇండస్ట్రీ, అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. గత కొద్ది రోజులుగా శరత్ బాబు ఆరోగ్యం బాగోక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

See also  Tejasvi Madivada: పెళ్ళికి సిద్దమైన తేజస్వి మడివాడ..పెళ్ళికొడుకు ఎవరో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

sarath-babu-last-wish-does-not-fulfill-before-death

ఆయన శరీరంలో ఆర్గాన్స్ పాడవడం వల్ల ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన బ్రతికుండగానే సోషల్ మీడియాలో ఆయన చనిపోయారంటూ వార్తలు రావడం జరిగింది కానీ.. ఆయన కుటుంబ సభ్యులు ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆయన బ్రతికే ఉన్నారని చెప్పడంతో మళ్లీ అభిమానులకు కొంత ఊరట ( Sarath Babu last wish ) కలిగించేది. ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో జాయిన్ చేసిన శరత్ బాబుని మళ్లీ ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వస్తారని.. ఆయన్నీ మళ్లీ చూస్తామని.. ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఆయన కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురయ్యింది. అయితే ఆయన మరణ వార్త వినగానే సోషల్ మీడియాలో నెటిజనులు ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూ..

sarath-babu-last-wish-does-not-fulfill-before-death

ఎవరి ఫీలింగ్స్, ఎవరి బాధలు వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరణించిన ప్రతి మనిషి గురించి బ్రతికున్న వాళ్ళు మాట్లాడుకునేది ఏమిటంటే.. మరణించిన వ్యక్తి బ్రతికున్నంత కాలం ఏం మంచి చేశాడు? ఎలాంటి బ్రతుకు బ్రతికాడు? ఎంత బ్రతుకు బ్రతికాడో? చివరికి ఏమయ్యాడు? అనుకుంటూ మాట్లాడుకుంటూ వైరాగ్యం ( Sarath Babu last wish ) తెచ్చుకోవడం అనేది చాలా కామన్. అయితే శరత్ బాబు మరణిస్తూ ఆయన చివరి కోరిక ఏమై ఉంటుంది? అని నెటిజనులకు ఒక చిన్న అనుమానం పుట్టింది. అసలు ఆయనికి కోరిక ఏదైనా ఉందా? ఉంటే అది తీర్చగలిగే కోరికే నా? తీరిందా? తీరలేదా? ఏం జరిగింది? అంటూ అభిమానులు చర్చించుకున్నారు.

See also  Anasuya: అదొక్కటి తప్ప తన అంద చందాలను చూసుకోండి అంటూ ఆరబోసిన అనసూయ.

 

అయితే శరత్ బాబు చివరి కోరిక గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇంతకీ శరత్ బాబు చివరి కోరికలు ఏమిటంటే.. ఆయన ఎన్నో రోజుల నుంచి హార్సీనీ హిల్స్ లో సెటిల్ అవ్వాలని అనుకున్నారట. అయితే అక్కడ అభిమానులు తగ్గట్టుగా నిర్మాణాన్ని చేయించుకున్నారట కానీ, ఆ ఇల్లు నిర్మాణం పూర్తి కాకపోవడం వలన ఆయన ఇంకా అక్కడికి మారలేకపోయారట. ఈ లోపు ఆయన మరణం జరిగిపోయింది. అలాగే శరత్ బాబు ఆఖరి సారిగా నటించిన సినిమా మళ్లీ పెళ్లి సినిమాలో కృష్ణ పాత్రని శరత్ బాబు నటించారు. చివరికి ఆ సినిమాని ఆయన చూడకుండానే వెళ్ళిపోయారు. అయితే నెటిజనులు.. పాపం శరత్ బాబు హార్సీనీ హిల్స్ కి మారిపోయి.. నరేష్ పవిత్ర సినిమా మళ్లీ పెళ్లి లో ఆయన పాత్రను చూసుకొని వెళ్లి ఉంటే బాగుండును అని అనుకుంటున్నారు..