Home Cinema Sandeep Reddy Vanga : వామ్మో.. చిరంజీవితో అలాంటి కోరిక ఉందని చెప్పిన సందీప్ రెడ్డి...

Sandeep Reddy Vanga : వామ్మో.. చిరంజీవితో అలాంటి కోరిక ఉందని చెప్పిన సందీప్ రెడ్డి వంగ..

sandeep-reddy-vanga-reveal-about-his-movie-with-chiranjeevi

Sandeep Reddy Vanga : ఒక తెలుగు దర్శకుడు ఒకే ఒక్క సినిమా తెలుగులో దర్శకత్వం వహించి.. ఆ తర్వాత తిన్నగా బాలీవుడ్ కి రీచ్ అయ్యి.. అక్కడ ఒక సినిమా తీసి అది బ్లాక్ బస్టర్ హీట్ చేసుకుని.. మళ్లీ రెండో సినిమా కూడా ( Sandeep Reddy Vanga and Chiranjeevi ) బాలీవుడ్ లోనే చేసి.. మహా మహా బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కసారిగా మన తెలుగు దర్శకుడువైపు కన్నెత్తి చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సందీప్ రెడ్డివంగా ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడో మనందరికీ అర్థమవుతుంది.

Sandeep-Reddy-Vanga-comments-on-Chiranjeevi

ఒక మనిషిలో కృషి, పట్టుదల, తనదంటూ ఒక స్టైల్ లో తాను కరెక్టని నమ్మి.. తన దారిలో తాను గట్టిగా సంకల్పం పెట్టుకొని ప్రయత్నిస్తే.. సాధించలేని ఏదీ లేదని నిరూపించాడు సందీప్ రెడ్డివంగ. అతని ఆలోచన విధానంగానీ.. అతను ( Sandeep Reddy Vanga and Chiranjeevi )తీసిన సినిమాల స్టైల్ గాని.. తెలుగు అభిమానులకు గాని, తెలుగు ప్రేక్షకులకు గాని, అసలు నచ్చుతుందా? అలాంటి ఒక దర్శకుడిని గాని, అలాంటి ఒక పాత్రను గాని.. వాళ్ళు ఒప్పుకుంటారా? అని ఎక్కడా ఒక్క మూల కూడా చిన్న అనుమానం అనేది లేకుండా.. తన మొదటి సినిమాతోనే సినిమాలో ఇలాంటి రూల్స్ పాటించాలని రూల్స్ ని బ్రేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. బ్రేక్ చేయడమే కాకుండా కలక్షన్ కూడా బ్లాక్ బస్టర్ గా తీసుకొచ్చాడు. అదే అతని గొప్పతనమో, అదృష్టమో తెలుసుకోవాలి.

See also  Samantha: శాకుంతలం హిట్ కొట్టడమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారిపోతానంటున్న సమంత.

Sandeep-Reddy-Vanga-comments-on-Chiranjeevi

అనిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సంచలనాన్ని క్రియేట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ని అదరగొడుతుంది.ఇటీవల యుఎస్ వెళ్లి.. అక్కడ పలువురు సినీ అభిమానులను కలిశాడు. వాళ్లను కలిసి వాటిలో వాళ్లతో ముచ్చటిస్తున్న సమయంలో అతని మనసులో ఒక కోరికను వాళ్లతో చెప్పుకుంటూ ( Sandeep Reddy Vanga and Chiranjeevi )వచ్చాడు. ఎప్పటికైనా చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయాలని ఉందని చెప్పాడు. అవకాశం వస్తే చిరంజీవి గారితో తప్పకుండా డ్రామా చేస్తానని వెల్లడించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే అసలు అది ఊహించుకుంటేనే మెగా అభిమానులందరికీ అదొక దడగా ఉంది. చిరంజీవి అంటే ఒక బ్రాండ్, ఆయన్ను అసలు ఎలాంటి మాస్ లెవెల్లో చూపిస్తాడు. ఏం వైలెన్స్ లో చూపిస్తాడు, ఏ రొమాన్స్ లో చూపిస్తాడు, అసలు ఏం ఆలోచించుకొని చూపిస్తాడు అని భయపడుతున్నారు.

See also  Akira Nandan : పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ మొదటి సినిమా ఎప్పుడో ఎలా ఎనౌన్స్ చేస్తారో డీటెయిల్స్..

Sandeep-Reddy-Vanga-comments

అయితే చిరంజీవి గారితో కలిసి సినిమా చేయాలన్న తన కోరిక ఉంది అంటే అర్థం చిరంజీవి గారికి నప్పే లాంటి ఒక స్టోరీనే రాసుకుంటాడని అర్థం. ఆ పాత్రకి చిరంజీవి గారు అయితేనే బాగుంటది అనిపించేలాగే ఆ కథను రాసుకుంటాడు. అలాగే దాన్ని రూపురేఖలు దిద్ది ప్రేక్షకులకు చూపించి, వాళ్ళని మెప్పించి, పాజిటివ్గా కాని నెగిటివ్గా కాని కామెంట్ చేయండి కానీ.. నా కంటెంట్తో కనెక్ట్ అవ్వండి అని చూపించగలిగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అందుకే మరి చిరంజీవి ఎప్పుడైనా ఇతనికి అవకాశం ఇస్తారా? వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తారా అనేది చూడాలి. లేకపోతే యూఎస్ లో సినీ అభిమానులతో ముచ్చటించిన సందీప్ రెడ్డివంగ.. మీరు ఎన్ని ప్రశ్నలు ఇంత సేపు అడిగారు కానీ.. స్త్రీ వ్యతిరేకత్వం గురించి సినిమా గురించి మీరు అడగలేదు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే.. మీరు సినిమాని సినిమాలాగే చూశారు. అంతే తప్పా.. అది రియాల్టీలోకి గాని, రియల్ గా గాని తీసుకోనందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాను అని సందీప్ రెడ్డివంగా వాళ్ళతో చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పటికే 550 కోట్ల పైన కలెక్షన్స్ తీసుకొచ్చిన అనిమల్ సినిమా 700 కోట్లకు దాటుతుందని అంచనాలు వేస్తున్నారు.