Home Cinema Samyuktha Menon: కొంచమైనా బుద్ది ఉండాలి కదా మీకు.?? ఆ మాత్రం తెలియదా అంటూ కడిగేసిన...

Samyuktha Menon: కొంచమైనా బుద్ది ఉండాలి కదా మీకు.?? ఆ మాత్రం తెలియదా అంటూ కడిగేసిన సంయుక్తా మీనన్..!!

Samyuktha Menon Serious: ఇదేంటబ్బా టైటిల్ ఇలా రాసారు అనుకుంటున్నారా.? అవును మీరు విన్నది నిజమే.! కేరళా పిల్లకు కోపం వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలిస్తే మీరు అవాక్కవ్వడం ఖాయం.. తన కోపాన్ని అంతా మూటగట్టి సోషల్ మీడియాలో తన ప్రతాపాన్ని చూపించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి బీమ్లా నాయక్ సినిమాతో అడుగుపెట్టిన ఈ కేరళా ముద్దుగుమ్మ, తన మొదటి సినిమాతో మంచి హిట్ సంపాదించింది. ఆ తర్వాత వెనుకకు తిరిగి చూడలేదు ఈ అమ్మడు. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు బింబిసార, సార్ చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడుకి యాట్రిక్ పాప గా పేరు తెచ్చుకుంది. (Samyuktha Menon Serious)

See also  Sai Dharam Tej: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంత గొప్ప త్యాగం చేసాడా సాయి ధరమ్ తేజ్ కోసం చాలా గొప్పోడే.

samyuktha-menon-serious-on-movie-virupaksha-team

తాను నటించినటువంటి మూడు వరుస చిత్రాలు హిట్ కొట్టటంతో కేరళ పాపకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు దక్కింది. దాంతో ఒక్కసారిగా అమ్మడు రేంజ్ అమాతం పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కేరళ హీరోయిన్ అయినటువంటి సంయుక్త మీనన్ తెలుగులో హీరో సాయి ధరమ్ తేజ్ సరనన విరూపాక్ష అనే చిత్రంలో నటిస్తున్నది. ఐతే మొన్న ఉగాది పండుగ సంధర్భంగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు. ఆ పోస్టరే కొంప ముంచింది అందరినీ.. మరి ఇంతకు ఏంటా ముచ్చట చూద్దామా..

samyuktha-menon-serious-on-movie-virupaksha-team

సంయుక్త మీనన్ తన సోషల్ మీడియా వేదికగా అందరినీ కడిగి పడేసింది. ఫుల్ ఫైర్ అవుతూ విరూపాక్ష చిత్ర టీం అంతటికీ ఎక్కేసింది. చిత్ర బృందం చేసిన పనికి చాలా హర్ట్ అయిన కేరళ కుట్టి అందరినీ ఒక రేంజ్ లో కడిగి అడిగి పారేసింది. నేను చాలా బాధతో ఉన్నాను ఎంతో డిసప్పాయింట్ చెందాను. నాకు కలిగిన నిరాశను మీకు వ్యక్తం చేసే ముందు విరూపాక్ష టీంతో అలాగే ఎంతో మంచి గొప్ప నటులతో, అలాగే టెక్నీషియన్స్ తో కలిసి పనిచేసే గొప్ప అవకాశం లభించినందుకు చాలా సంతోషం. ఈ మెమోరీస్ ను నేను జీవితాతం గుర్తుపెట్టుకుంటాను. అయితే వెంకటేశ్వర చిత్ర నిర్మాణ సంస్థ నన్ను ఎందుకు ఛీట్ చేసింది..? మరీ ఇంత బాధ్యతా రహితంగా ఎందుకు ఉంది.??

See also  హీరోలను ప్రేమించి కెరియర్ ను పాడు చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే.!

samyuktha-menon-serious-on-movie-virupaksha-team

నా మనసు ఎంతో నిరాశ పర్చింది. నేను హర్ట్ అయ్యాను. మీరే కదా చెప్పారు, నా క్యారెక్టర్ పోస్టర్ ను ఉగాది రోజున విడుదల చేస్తారని.? మాట కూడా ఇచ్చారు. మరి ఏది ఆ పోస్టర్ ఎక్కడ అంటూ చిత్ర బృందాన్ని మొత్తం నిలదీసింది. దాంతో చిత్ర బృందం నిర్మాణ సంస్థ స్పందించిన సీనియర్స్.. క్షమాపణలు కోరుతున్నాము. త్వరలోనే మీకు కలిగిన ఈ సమస్యను పరిష్కరిస్తాం అంటూ మాటిచ్చారు. దీంతో ఆ వివాదం సద్దు మనిగింది. ఐతే సంయుక్త మీనన్ లో ఉన్న ఆ బోల్డ్ యాంగిల్ చూసి నెటీజన్లు ఫిదా అవుతున్నారు. హీరోయిన్స్ అంటే నీలాగే ఉండాలి. ఏదైనా తప్పు చేస్తే ఇలాగే నిలదాస్తూ తాట తీయాలంటూ ఆమెను ఓ రేంజ్ లో పొగుడుతున్నారు.