Samantha: దేశం మొత్తం సంచనాలను సృష్టించినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం పుష్ప ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిందో మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఈ చిత్రంలో సమంత ఓ ఐటమ్ సాంగ్ లో అలరించి దేశం మొత్తం కుర్రకారులని ఉర్రూతలూగిస్తూ ఊ అంటావా మామా అంటూ అలరిస్తూ సమంత లో కూడా ఇలాంటి ఓ టాలెంట్ ఉందని కేవలం ఈ యొక్క పాటతో ప్రతి ఒక్కరికి తెలియడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక దేశం మొత్తం ఊ అంటావా అంటూ ఎక్కడ చూసినా ఇదే పాట మార్మోగిపోతుంది. (Samantha Item Girl)
పెద్దోళ్ళు వయసుతో సంబంధం లేకుండా కుర్రాలైన, పెద్దోల్లైనా అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పాటని ఎంతో ఇష్టంగా చిందులేస్తున్నారు. ఇప్పటికే సంవత్సరం దాటుతున్నప్పటికీ కూడా ఈ పాటలో ఈ పాటకు యూట్యూబ్లో చాలా పాపులర్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ పాట ఎంతలా మనందరినీ అలరించి ఉంటుందనేది.. ఇక ఈ పాటలో సమంత డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఓ రేంజ్ లో అదరగొట్టిందని చెప్పాలి. కేవలం సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ పాటను రీ క్రియేట్ చేశారు.
ఇక పుష్ప సినిమాకి హిట్ లభించడానికి ఎన్నో దారులున్నప్పటికీ అందులో ఈ సినిమాకి క్రేజ్ మరింత పెరగడానికి ఉన్న ఓ విషయం ఈ పాట అని కచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ పాట పాడిన సింగర్ ఇంద్రావతి చౌహన్ కూడా తన మొదటి పాటతోనే ఎంతో పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఓ వైపు సమంత స్టెప్పులను ఇరగదీస్తూ ఎంతో అదరగొట్టే ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రత్యేకించి మనందరికీ తెలిసిన విషయమే.. కాగా ఈ పాటలో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంది సమంత. అయితే స్టార్ హీరోయిన్ గా స్టార్డమ్ దక్కించుకున్న ఈ అమ్మడు మాత్రం..
ఈ సాంగ్లో చిందులేసాక ఐటమ్ గర్ల్ అనే ముద్ర పడిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఏ పార్టీలో ఉన్న ఈ పాటకు డాన్స్ చేయాలని ఆమెను తెగ ఇబ్బంది పెడుతున్నారట.. అలా తాజాగా సమంత నటిస్తున్న వెబ్ సిరీస్ సిటాడిల్ షూటింగ్ ప్రస్తుతం సెర్బియాలో జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇక ఈ షూటింగ్ కాస్త విరామం సమయంలో సమంత పాపకి వెళ్తే అక్కడ కూడా ఈ పాటకు డాన్స్ చేయాలంటూ చాలా మంది కేకలు పెట్టారు. దాంతో చేసేదేమీ లేక సమంత కూడా ఐటమ్ గర్ల్ లాగా డాన్స్ చేసింది. ఇది చూసిన అభిమానులు స్టార్ హీరోయిన్ నుంచి ఇలా ఐటెం గర్ల్ లా (Samantha Item Girl )మారిపోయావా అంటూ సమంత పై కామెంట్స్ ల వర్షాన్ని కురిపిస్తున్నారు.