Home Cinema Samantha New House: హైదరాబాద్ లో సమంత కొత్త ఇల్లు..ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ ఐపోతుంది..

Samantha New House: హైదరాబాద్ లో సమంత కొత్త ఇల్లు..ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ ఐపోతుంది..

Samantha New House ఈ రోజుల్లో సెలబ్రిటీలు వరుసపెట్టి బిగ్ ప్రాపర్టీస్ కొనడం చూస్తున్నాం. పలువురు హీరో హీరోయిన్లు దేశంలోని మహా నగరాల్లో లగ్జరీ విల్లాస్ కొంటున్నారు. అలానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఓ లగ్జరీ హౌస్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది సమంత. అయితే తనతో కెరీర్ ప్రారంభించిన హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రేమించుకున్నారు.

ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. బిజీ అయిపోతూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. చాలా కాలం తర్వాత విడాకులపై కూడా ఇద్దరూ స్పందించారు. తాజా నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లోని ప్రధాన లొకేషన్‌లలో ఒకటైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సమంతా 7.8 కోట్లతో విలాసవంతమైన జయభేరి ఆరెంజ్ కౌంటీలో ఇల్లు తీస్కుంది, ఇది నానక్రామ్‌గూడలోని ప్రసిద్ధ గేటెడ్ కమ్యూనిటీ.
ఈ అద్భుతమైన డ్యూప్లెక్స్ 13వ మరియు 14వ అంతస్తులలో విస్తరించి ఉంది మరియు 7,944 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

See also  Gajala : జూనియర్ ఎన్టీఆర్ వలన సూసైడ్ చేసుకోబోయిన హీరోయిన్ గజాల!

సమంతకు జూబ్లీహిల్స్‌లో కూడా ఒక ఇల్లు ఉంది, అక్కడ ఆమె తన మాజీ భర్త, నటుడు నాగ చైతన్యతో కలిసి నివసించేది. 2021 నుండి, ఆమె తన రెండు పెంపుడు కుక్కలు హష్ మరియు సాషాతో కలిసి ఇంట్లో నివసిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, సమంత ముంబైలో సముద్ర వీక్షణలతో కూడిన 3BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందని కూడా వార్తలు వచ్చాయి. సమంత ఇప్పుడు మరో ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడంపై దృష్టి సారిస్తోంది.ఆమె ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, BMW 7 సిరీస్ వంటి ఇతర విలాసవంతమైన కార్లని కూడా కొనుగోలు చేసింది.(Samantha New House)

See also  Jagapathi Babu: మీరు ఏమన్నా అనుకోని నేను చెప్పేదే నిజం ప్రభాస్ కి నిజం గా అది లేదు అంటూ సంచలనమైన వాఖ్యలు చేసిన జగపతిబాబు.

ఇక ప్రస్తుతం సమంత తన రాబోయే టాలీవుడ్ చిత్రం ‘కుషి’తో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని ప్లాన్ చేస్తోంది, ఇందులో ఆమె విజయ్ దేవరకొండతో కలిసి నటించనుంది. ఆమె బాలీవుడ్‌లో అమెజాన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’లో వరుణ్ దావన్‌తో కూడా కనిపించనుంది.ఏదైతే నేమి చాలా రోజులు గా ఇబ్బంది పడుతున్న సమంత ఇప్పుడిప్పుడే కొంచం మంచిగా అవ్వడం మనము చూస్తున్నాము. సమంత ఇలానే హ్యాపీ గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.(Samantha New House)