Samantha: తెలుగు సినీ ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న సమంత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. ఆ మధ్యకాలంలో మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడి ప్రస్తుతం కోల్కొని మళ్లీ సినిమాల్లో చాలా బిజీ బిజీగా మారిపోయింది. ఇక ఆ తర్వాతే ఆమె నటించిన చిత్రం శాకుంతలం భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైనప్పటికీ డిజాస్టర్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.. కాగా ఈ చిత్రంపై సమంత ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఊహించిన ఫలితం అంతగా రాలేకపోయింది. (Samantha reveals all personal)
నాగచైతన్యకు సమంత ఎప్పుడైతే విడాకులు ఇచ్చిందో ఆ క్షణం నుండే ఏ చిన్న వార్త కూడా ఆమెకు సంబంధించింది ఏ చిన్న విషయం వచ్చిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం.. కాగా ఇక ఈ మధ్యకాలంలో అయితే సమంత తన సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటుంది. ఇదే కాకుండా ఇటీవలే బాలీవుడ్ సెలబ్రిటీలకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కి పెళ్లి సంబంధం కోసం చూస్తున్నాను అంటూ ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. ఇదే కాకుండా తాజాగా మరో స్టార్ సింగర్ భర్త టాలీవుడ్ హీరో అయిన రాహుల్ రవీంద్రన్ ను ఉద్దేశించి ఒక పోస్ట్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టగా అది ప్రస్తుతం చాలా వైరల్ గా మారింది.
మరి ఇంతకి సమంత పెట్టిన ఆ పోస్ట్ ఏంటో మరి ఇప్పుడు చూద్దాం.. మనందరికీ తెలిసిన విషయమే.. సమంతకి ఆమె వాయిస్ కి డబ్బింగ్ చెప్పేది సింగర్ చిన్మయి.. కేవలం సింగర్ గానే కాకుండా అప్పట్లో కాస్టింగ్ కౌచ్ గురించి తన పెదవి విప్పి చాలా ఫేమస్ కూడా అయింది. మరి అదే విధంగా చిన్న భర్త రాహుల్ రవీంద్రన్ కూడా టాలీవుడ్ లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు చిత్రాల్లో నటించాడు. సమంతకి చిన్మయి మంచి ఫ్రెండ్ లాగా చిన్మయి భర్త కూడా రాహుల్ రవీందర్ సమంత కి మంచి ఫ్రెండ్ అయ్యాడు. అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఈ పోస్టు పబ్లిష్ చేసింది. (Samantha reveals all personal)
అదేమిటి అంటే.. పెళ్లిల్లో అసలు ఈ భోజనం చేసే వెళ్లే కాన్సెప్ట్ అనేది ఎందుకు ఉంటుందో నాకు ఇంతవరకు తెలియదు. కానీ బ్రో ముందు భోజనం చేసి వెళ్ళండి అని ఉండే పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ కి సింగర్ చిన్మయి ని తన భర్త రాహుల్ రవీంద్రన్ ను సమంత ట్యాగ్ చేసింది. దాంతో ఈ పోస్టు కాస్త వైరల్ అవ్వడంతో అది చూసిన ప్రతి ఒక్కరూ ఏంటి రాహుల్ రవీంద్రన్ తినడానికి మాత్రమే పెళ్లిళ్లకు వెళ్తారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతూ తెగ నవ్వుకుంటున్నారు. ఇదే కాకుండా ఆ హీరో గురించి సమంత తన సీక్రెట్ బయట పెట్టిందని మరికొంతమంది పలు కామెంట్లు చేస్తున్నారు. అయితే సమంతకి చిన్మయి రాహుల్ రవీందర్ కి మధ్య ఉన్న స్నేహం వల్లే చాలా సరదాగా సమంత ఇలాంటి పోస్టు రాహుల్ రవీందర్ పై పెట్టగలిగి ఆయనకు ట్యాగ్ చేసిందని అనుకుంటున్నారు.