Samantha Hero: సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించినటువంటి ఏం మాయ చిత్రంతో అడుగు పెట్టింది. ఇక ఈ చిత్రం మంచి క్లాసికల్ లవ్ గా సూపర్ హిట్ సాధించడంతో అతి తక్కువ సమయంలోనే వరుస చిత్రాలు అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎగబాకండి. అలా అగ్ర హీరోలు అందరితో నటించి అతి తక్కువ సమయంలోనే సార్ధమ్ చేజిక్కించుకుంది. ఇక ఆ తర్వాత కేవలం తెలుగులో మాత్రమే నటించకుండా సౌత్ లో అన్ని భాషలలో నటిస్తూ తనేంటో నిరూపించుకుంది. ఇక కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకుంది.
కానీ వీళ్ళిద్దరి మధ్య ఏవేవో కారణాల చేత వీళ్ళ పెళ్లి మూడునాళ్ళ ముచ్చటగానే నిలిచిపోయింది. వాళ్ళ మధ్యలో తలెత్తిన తగాదాల వల్ల వివాహ దాంపత్యానికి స్వస్తి పలికి విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుంటూ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టింది. వరుస చిత్రాల లో నటిస్తున్న సమయంలోనే మాయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది. దీంతో ఆ వ్యాధి పూర్తిగా నయం అవడానికి ఆ వ్యాధి చికిత్స మేరకు అమెరికా వెళ్లేందుకు సంవత్సర కాలం వరకు పూర్తిగా సినిమాలను దూరం గా ఉంటూ నటించకూడదని నిర్ణయించుకుందట. ఇక సమంత ఇటీవలే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి చిత్రంలో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
దాంతో ఇటు ఓ పక్క విజయ్ దేవరకొండ మరో పక్క సమంత సైతం వరుస ప్లాపులతో బాధపడుతున్న వీళ్ళకి ఖుషి మంచి ఖుషీ తెచ్చి పెట్టిందని చెప్పాలి. ఇక ఈ చిత్రం దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద 75 కోట్ల కలెక్షన్లు పైగా రాబట్టింది. దాంతో చాలా కాలం తర్వాత తను ఎంతో ఆనందంతో మునిగి తేలింది అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సమంత రొమాంటిక్ సీన్లతో అదరగొట్టిందనే చెప్పాలి. ఈ మూవీలో ఇద్దరి మధ్యల కుదిరిన మంచి కెమిస్ట్రీలతో కూడిన రొమాన్స్ వాటి పెద్ద కారణమని చెప్పాలి. అయితే తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా సమంత మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక చలన చిత్ర రంగంలో హీరోయిన్ గా అడుగు పెట్టక ముందుకు (Samantha Hero) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అంటూ ఆమె చెప్పుకొచ్చింది. కాగా గతంలో ఆయనతో కలిసి నటించిన చిత్రం అత్తారింటికి దారేది మన అందరికి తెలిసిందే.. మనమంతా చూశాం. ఇక ఈ చిత్రంలో అవకాశం రావడానికి తను ఎంతో అదృష్టంగా భావించిందని తెలిపింది. నాకు పవన్ అంటే ఎంతో ఇష్టమని అతనితో నటించడానికి ఎన్ని సార్లైనా అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తానంటూ తెలిపింది. ఇక ఆమెతో నటించడానికి అసలు అవకాశాన్ని వదులుకోనని వెల్లడించింది. దాంతో ప్రస్తుతం మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా విపరీతంగా వైరల్ గా మారాయి.