Home Cinema Samantha: పుష్ప 2 ఆఫర్ వద్దనుకున్న సమంత…! అసలు విషయం అదేనా..??

Samantha: పుష్ప 2 ఆఫర్ వద్దనుకున్న సమంత…! అసలు విషయం అదేనా..??

Samantha Pushpa2:  ఏం మాయ చేసావే సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన సమంత అనది కాలంలోనే అందర్నీ అదే మాయ చేసి ఇట్టే ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది సమంత. అంది వచ్చిన అవకాశాలన్నిటిని చేజిక్కించుకుంటూ ఎన్నో హిట్లు కొట్టి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఊ అంటావా మామ అంటావా అంటూ మొట్టమొదటిసారిగా ఐటమ్ సాంగ్ లో నటించి దేశం మొత్తం తన వైపు చూసేలా ఆకర్షించింది.

samantha-rejects-a-big-offer-for-an-appearance-in-pushpa-2

ఆ సాంగ్ విడుదలైన తర్వాత ఎన్ని ప్రశంసలు అందుకుందో అన్ని విమర్శలు ఎదుర్కొంది. అయితే సమంత నాగచైతన్యతో విడిపోయే సమయంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైస్ తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఈ చిత్రంలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ లో తను అలరించిన విషయం అందరికి తెలిసిందే. సమంత తన జీవితంలో నటించిన ఒకే ఒక ఐటెం సాంగ్ ఇది. 2021 లో వచ్చిన ఈ పాట అందర్నీ ఉర్రూతలూగించిన ఈ పాటతో దేశ వ్యాప్తంగా సమంతకు ఏ రెంజ్ లో గుర్తింపు లభించిందో అందరికి తెలిసిన విషయమే.

See also  Actress Anita : నా భర్త నన్ను మోసం చేసాడు.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఆర్తనాధాన..

samantha-rejects-a-big-offer-for-an-appearance-in-pushpa-2

ఇదే కాకుండా తన గ్లామర్ షో తో అందరిని ఫిదా చేసి చేసింది. దాంతో ఒక్కసారిగా తన లైఫ్ మారిపోయింది. అయితే పుష్ప2 (Samantha Pushpa2) సమంత కోసం దర్శకుడు సుకుమార్ ప్రత్యేకమైన రోల్ చేస్తున్నారట. అది పుష్ప 2 కథకు మరొక లెవెల్ కు తీసుకువెళుతుందని అప్పట్లో స్టార్ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది అదేంటంటే సమంతకు పుష్ప 2 సీక్వెల్ లోను ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది.

See also  Varun - Lavanya : ఇటలీలోని ఒక హోటల్ లో వరుణ్ లావణ్య చేస్తున్న పని ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

samantha-rejects-a-big-offer-for-an-appearance-in-pushpa-2

తనను మరోసారి స్పెషల్ నెంబర్లో నటించేందుకు సంప్రదింపులు చేస్తున్నారని ప్రచారం అయితే జరుగుతుంది కానీ సమంత ప్రస్తుతం తన వ్యాధి నుంచి కోలుకొని చాలా ప్రాజెక్టులకు సంతకాలు చేయడంతో ఈ స్పెషల్ నెంబర్స్ లో నటించడానికి ఇష్టం లేదని చెబుతుందట దాంతో చిత్ర యూనిట్ మొత్తం ఆమెను ఒప్పించే పనిలో నిమగ్నమై ఉన్నారంట. ప్రస్తుతం సమంత అయితే వరుస సినిమాలతో చాలా హడావిడిగా తన జీవితం సాగుతుంది. ఐతే విజయ్ దేవరకొండ సరసన చెయ్యాల్సిన ఖుషి సినిమా ఆగిపోవడంతో ఆ చిత్రం త్వరగా చెయ్యాలని సమంత నిర్ణయించుకున్నారు అంట, దీనిపై ఇటివలే ఓ ట్వీట్చేసిన సంగతి తెలిసిందే..