Akkineni Family: సమంత గురించి వారంలో కనీసం ఏదో ఒక వార్త అయితే కచ్చితంగా ట్రెండింగ్ లో ఉంటుంది. సమంతని తలచుకోకుండా ఫిల్మ్ న్యూస్ రైటర్ లకు కీ-బోర్డ్ లో అక్షరాల కూడా ముందుకు వెళ్ళవు.. అంతటి స్టార్ డమ్ సామ్ కు దక్కిందనే చెప్పాలి. ప్రస్తుతం ఓ వార్త అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారి సోషల్ మీడియా వేదిక మొత్తం ఆ వార్త చట్టా పట్టా లేసుకొని తిరుగుతుంది. కేవలం సమంత కారణం చేత అక్కినేని కుటుంబం రెండు ముక్కలు కాబోతుందా.? అనే ప్రశ్న.! లేవనెత్తి సోషల్ మీడియా వేదికగా ఇందుకు సమాధానం అయింది. ఇటీవలే అఖిల్ పుట్టినరోజు జరుపుకున్నాడు దానికి సమంత విష్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే నాగచైతన్య, నాగార్జున వాళ్ల విషయంలో మాత్రం ఎలాంటి నోరు విప్పదు. విడాకులకు ముందు నాగార్జునకు అప్పట్లో శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్విట్ లో మర్యాద పూర్వకమైన మామగారు, మామ అనేవి ఎక్కడా కనిపించలేదు. దాంతో.. అప్పట్లోనే సామ్, చైతు విడాకులు తీసుకుంటున్నారనే రూమర్లు మొదలయ్యాయి. అలా సమంత నాగార్జున పట్ల వ్యవహరించిన తీరు వల్ల ఆ తర్వాత ఆ రూమర్లె నిజమయ్యాయి వాళ్ళిద్దరూ నిజంగానే విడాకులు తీసుకున్నారు… విడాకులు తీసుకున్న తర్వాత నుండి సమంత, నాగచైతన్యకు ఏ ఒక్క విషెస్ కూడా చెప్పలేదు. కనీసం నాగచైతన్య కొత్త సినిమాలు విడుదలకు విషెస్ కూడా తెలుపలేదు. నాగార్జున పుట్టినరోజు కూడా సమంత స్పందించలేదు..
కానీ అఖిల్ బర్త్ డే వస్తే మాత్రం సమంత స్పెషల్ గా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ నెల 24న విడుదలయ్యే అఖిల్ సినిమా ఏజెంట్ గురించి సమంత ఎప్పటికప్పుడు విషెస్ తెలుపుతూ ఉంటుంది. గతంలో కూడా ఏజెంట్ సినిమా గురించి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇదే కాకుండా సమంత మయోసైటీస్ వారితో బాధపడుతున్నప్పుడు అఖిల్ సమంత నువ్వు త్వరగా కోలుకోవాలి మై డియర్ సామ్ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. సమంత విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని కుటుంబంతో పూర్తిగా దూరమయింది సమంత.. విడాకులు తీసుకున్నప్పటికీ సమంతతో అఖిల్ సన్నిహితంగా ఉండడం నాగచైతన్యకు నచ్చడం లేదట..
ఈ బలమైన కారణం చేతనే నాగచైతన్య అఖిల మధ్య గొడవలకు దారి తీస్తున్నాయట.. అందుకే ఈ గొడవలు తలెత్తడం వల్లే అఖిల్ బర్త్డే సందర్భంగా నాగచైతన్య కనీసం సోషల్ మీడియా ఖాతాలో తన తమ్మునికి బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ అసలు ఈ విషయంలో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలియదు కానీ కొంతమంది నెట్టిజెన్స్ మాత్రం సమంత వల్ల అక్కినేని ఫ్యామిలీ లో అన్నదమ్ముల మధ్య చిచ్చు రగిలించి వెళ్లిందని సమంత ఆ కారణం చేత అన్నదమ్ముల మధ్యల గొడవలు పెరిగి అక్కినేని కుటుంబం (Akkineni Family) ముక్కలు కాబోతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.