Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటీవల కాలంలో సమంత గురించి ఏదో ఒక రకమైన వార్త ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. ఏం మాయ చేసావే ( Samantha is telling goodbye to act ) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి.. అప్పటినుంచి వెనుతిరగకుండా ఆమె కెరీర్లో ముందుకు వెళ్తూనే ఉంది. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో హీరోయిన్గా నటించి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలుపుకుంది. కేవలం తెలుగులోనే మాత్రం కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది.
అలాగే సమంత ఇప్పుడు ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే సమంత సినిమా ఇటీవల రిలీజ్ అయిన ( Samantha is telling goodbye to act ) శాకుంతలం సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి.. డిజాస్టర్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. దీని తర్వాత సమంత అభిమానులు చాలా ఫీలయ్యారు కానీ.. ఏం చేస్తాం ఏ రంగంలోనైనా ఒకసారి, సక్సెస్ మరోసారి ఫెయిల్యూర్ చూడక తప్పదు. సమంత జీవితం చాలా విచిత్రమైనది. కెరీర్ పరంగా ఆమె జీవితం ఎంత బాగా ముందుకు వెళ్ళిందో.. పర్సనల్ లైఫ్ లో ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
సమంత నాగచైతన్యని ప్రేమించి.. చాలాకాలం వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా కాపాడుకుంటూ.. చివరికి పెద్ద వాళ్ళను ఒప్పించి.. అక్కినేని వారి కుటుంబంలోకి ఎంతో వైభవంగా కోడలుగా అడుగుపెట్టింది. అక్కినేని కుటుంబానికి కోడలు అయిన తర్వాత.. ఆమెకి తెలుగు సినీ ( Samantha is telling goodbye to act ) అభిమానులందరూ బ్రహ్మరథం పట్టారు. అలాంటిది ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆమె నాగచైతన్య నుంచి విడిపోవలసి వచ్చింది. ఇక సమంత ఎప్పుడైతే నాగచైతన్యను వదిలేసిందో.. అప్పటినుంచి ఆమె అనేక రకాల ప్రశ్నలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటన్నిటిని ఆమె పక్కన పెట్టేసింది గాని.. ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. ఒక ప్రత్యేకమైన వ్యాధితో ఆమె కొంతకాలం చాలా బాధపడింది.
ఆ జబ్బు నుంచి రికవరీ అయిన తర్వాత ఆమె నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఖుషి సినిమాతో బిజీగా ఉంటూ.. దానితో పటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది. కానీ ఈ రెండిటి తర్వాత ఆమె ఒక్క సినిమాకు గాని, ఒక వెబ్ సీరీస్ కి గాని.. సైన్ చేయలేదంట. దీంతో ఆమెపై అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సమంత ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని.. అందుకే ఆమె ఈ రెండిటి తర్వాత సినిమాలకు గాని.. సీరీస్ కి గాని ఒక్క సంతకం కూడా పెట్టలేదని.. ఆమె సినిమాలకి ఇంక గుడ్ బాయ్ చెప్పేసి.. ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితిలోకి వెళ్తుందని అనేక వార్తలు వస్తున్నాయి. ఇవి చూస్తున్న సమంత అభిమానులకి.. బాధ పడటమే కాకుండా.. ఇందులో ఏమాత్రం నిజం ఉండదని అనుకుంటున్నారు. అలాగే నిజంగా ఆమె హెల్త్ గాని బాగోకపోతే.. ఒక్కసారి అయినా మళ్లీ చైతు దగ్గరికి వెళ్లి పోవడానికి అవకాశం ఉందేమో చూస్తే బాగుంటుందని అభిమానులు కన్నీటితో వేడుకుంటున్నారు.