Home Cinema Samantha: సినిమా ఇండస్ట్రీ లోనే ఎవ్వరూ చెయ్యలేని సాహసం చేసిన సమంత.

Samantha: సినిమా ఇండస్ట్రీ లోనే ఎవ్వరూ చెయ్యలేని సాహసం చేసిన సమంత.

Samantha Film Industry: సమంత గురించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎప్పుడైతే అక్కినేని కుటుంబంలోకి కోడలుగా వెళ్ళిందో అప్పటి నుండి సమంత మరింత ఎత్తుకు ఎదిగిందని చెప్పాలి. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత అక్కినేని కుటుంబం నుంచి బయటకు వచ్చాక చాలా డిప్రెషన్ లోనయ్యి మయోసాటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం ప్రతి ఒక్క సమంత అభిమానికే కాక యావత్ తెలుగు ప్రపంచానికి తెలుసు.. ఇక ఇటీవలే ఆ వ్యాధి నుండి కాస్త బయటపడి తను సైన్ చేసిన రెండు ప్రాజెక్టులను పూర్తిచేసుకుని మళ్లీ పూర్తి మామూలు మనిషి లాగా రావడానికి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లడానికి సిద్ధమయ్యింది.

See also  Adipurush Business: ఆదిపురుష్ బిజినెస్ చూస్తే బుర్రపాడు.

samantha-has-done-a-feat-that-no-one-can-do-in-the-film-industry

సమంత గురించి మనకు తెలిసిందే ఫిట్నెస్ కోసం అందం ఆరోగ్యం కోసం చాలా నియమ నిబంధనలతో ఉంటారు. నిత్యం యోగా వ్యాయామం కచ్చితం. అలాగే కఠినమైన ఆహార నియమాలు తప్పనిసరి. తన ఇంటి ఆవరణలోనే స్వయంగా సమంత కూరగాయలు పండ్లు పండించి మరి అవే తింటుంది. అంత జాగ్రత్తగా తన అందం ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఇంత జాగ్రత్తగా ఉన్న సమంతకు ఎందుకో తెలియదు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డట్టు గత ఏడాది అక్టోబర్ లో సమంత ఈ విషయాన్ని వెల్లడించి. కొన్నాళ్ల పాటు ఇంట్లోనే చికిత్స తీసుకొని ఇంటికి పరిమితమైంది. ఆ తర్వాత కొంత కోలుకొని పలు సినిమా షూటింగ్ లలో పాల్గొన్న సమంత ఇటీవలే పాల్గొన్న ఖుషి మూవీ అలాగే వెబ్ సిరీస్ సిటాడెల్ పూర్తి చేసుకుంది.

See also  Star couple: షాకింగ్.. చైతు సమంతల్లా మరో స్టార్ జంట కూడా విడిపోతున్నారా?

samantha-has-done-a-feat-that-no-one-can-do-in-the-film-industry

ప్రస్తుతం సమంత మరో ప్రాజెక్టుపై సైన్ చేయకుండా ఖాళీగానే ఉన్నారు. కాగా ఈ విరామ సమయాన్ని కాస్త మానసిక ప్రశాంతత కోసం ఉపశమనం పొందడానికి అలాగే పలు చికిత్సల నిమిత్తం ఇండోనేషియాలోని బాలికి వెళ్లి ప్రకృతి ఒడిలో కాసింత విరామం తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ కూడా ఏరియల్ యోగ చేస్తూ ఉంది సమంత.. అయితే ప్రస్తుతం నెట్టింట సమంత (Samantha Film Industry) గురించి వార్త అయితే వైరల్ అవుతుంది. అది సినిమా ఇండస్ట్రీలో ఇంత వరకు ఎవరు చేయని ఓ సాహసానికి తెరలేపింది. సమంత నాలుగు డిగ్రీల చల్లని నీళ్లల్లో నీళ్లతో దాదాపు ఆరు నిమిషాల పాటు ఉందట. అంత గడ్డకట్టే చల్ల నీళ్ళలో కొద్దిసేపు గడపడం చాలా ఎక్కువ. అలాంటిది సమంత ఆరు నిమిషాల పాటు గడపడం అంటే సామాన్యమైన విషయం కాదు.

See also  Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ప్యాంటు జిప్ విప్పేస్తే.. కుర్రాళ్లు రియాక్షన్ చూడండి.

samantha-has-done-a-feat-that-no-one-can-do-in-the-film-industry

శరీరం ఎంతో ఒత్తిడికి లోనవుతుంది. సాహసాన్ని పూర్తి చేసింది. కాగా ఇది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ అట.. చల్లని నీళ్లలో కొన్ని నిమిషాలు స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. ఇక సమంత సినిమాలకు విరామం ప్రకటించినట్లు వార్తలు రాసాగాయి. ఇండోనేషియా దేశం నుంచి వచ్చాక సమంత అమెరికా వెళ్ళనుందట. అక్కడ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట సమంత. అందుకే కొత్త ప్రాజెక్టులకి సైన్ చేయడమే లేదట. ఇక ఆమె నటించిన ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ శివ నిర్మాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ తర్వాత సిటాడిల్ యాక్షన్ సిరీస్ వరుణ్ ధావన్ తో ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీడీలో విడుదల అవ్వనుందట.